News


మార్చి నాటికి బీపీసీఎల్‌, ఎయిరిండియా విక్రయం

Tuesday 19th November 2019
news_main1574133195.png-29683

  • కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడి

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ చమురు రిఫైనరీ దిగ్గజం భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (బీపీసీఎల్‌), విమానయాన సంస్థ ఎయిరిండియాల విక్రయం సాధ్యమైనంత వరకూ ఈ ఆర్థిక సంవత్సరంలోనే ముగించాలని కేంద్రం యోచిస్తోంది. మార్చి నాటికల్లా అమ్మకం పూర్తి చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఎయిరిండియాపై చాలా మంది ఇన్వెస్టర్లు ఆసక్తి చూపుతున్నట్లు ఆమె వివరించారు. ఎయిరిండియా విక్రయానికి ప్రభుత్వం ప్రయత్నించడం ఇది రెండోసారి. 76 శాతం వాటాలను అమ్మేందుకు గతేడాది ప్రయత్నించినప్పటికీ ఇన్వెస్టర్లు ఆసక్తి చూపకపోవడంతో విరమించుకోవాల్సి వచ్చింది. మరోవైపు, పెట్టుబడులకు ఊతమిచ్చేలా కేంద్రం గత ఐదేళ్లలో పలు సంస్కరణలు ప్రవేశపెట్టిందని, ఇవి 2024-25 నాటికి భారత్‌ను 5 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలన్న లక్ష్య సాధనకు తోడ్పడతాయని సోమవారం లోక్‌సభలో నిర్మలా సీతారామన్ చెప్పారు. ఈ సంస్కరణల్లో దివాలా చట్టం ముఖ్యమైనదని, దేశ ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేసే దిశగా ఇది కీలకమైన అడుగని ఆమె పేర్కొన్నారు. 



You may be interested

ఐఎండీ ర్యాంకింగ్‌లో 6 మెట్లు తగ్గిన భారత్‌

Tuesday 19th November 2019

59వ స్థానంతోనే సరి న్యూఢిల్లీ: స్విట్జర్లాండ్‌కి చెందిన ప్రముఖ బిజినెస్‌ స్కూల్‌ ‘ఐఎండీ’ తాజాగా ప్రకటించిన వరల్డ్‌ టాలెంట్‌ ర్యాంకింగ్‌లో భారత్‌ వెనకపడింది. మొత్తం 63 దేశాలతో కూడిన ఈ జాబితాలో భారత్‌ 6 మెట్లు తగ్గి 59వ స్థానానికి పడిపోయింది. పెట్టుబడి, అభివృద్ధి, సంసిద్ధత ఆధారంగా ఈ ర్యాంకింగ్‌ను విడుదలచేయగా.. చైనా (42), రష్యా (47), దక్షిణ ఆఫ్రికా (50)వ స్థానాల్లో నిలిచి, బ్రిక్స్‌ దేశాల జాబితాలో భారత్‌ను వెనక్కునెట్టాయి.

మొ‘‘బిల్‌’’ మోతే..!

Tuesday 19th November 2019

డిసెంబరు నుంచీ ఐడియా, ఎయిర్‌టెల్‌ ఛార్జీల పెంపు భారీ నష్టాలు, అప్పులకు కేంద్ర బకాయిలు తోడు ఏ మేరకు పెంచుతామన్నది వెల్లడించని సంస్థలు చెల్లింపులపై మారటోరియానికి సీఏఓఐ అభ్యర్థన న్యూఢిల్లీ: భారీ నష్టాలు, పేరుకుపోయిన రుణాలు... వాటికి తోడు సుప్రీం కోర్టు తాజా తీర్పుతో కేంద్రానికి వేల కోట్లు చెల్లించాల్సి రావటం... ఈ సంక్షోభం నుంచి కొంతైనా గట్టెక్కాలంటే వినియోగదారులపై భారం మోపాల్సిందేనని టెలికం కంపెనీలు భావిస్తున్నాయి. ఇందులో భాగంగా  కాల్‌ చార్జీలను పెంచబోతున్నాయి. డిసెంబర్‌

Most from this category