News


ఎయిరిండియాలో పూర్తి వాటాల విక్రయం

Friday 13th December 2019
news_main1576208202.png-30199

  • ఎయిరిండియాలో పూర్తి వాటాల విక్రయం
  • కేంద్ర మంత్రి హర్‌దీప్ సింగ్ పురి స్పష్టీకరణ

న్యూఢిల్లీ: నష్టాలు, రుణాల భారంతో కుదేలవుతున్న ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియాలో 100 శాతం వాటాలు విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి హర్‌దీప్ సింగ్ పురి స్పష్టం చేశారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఎయిరిండియాలో డిజిన్వెస్ట్‌మెంట్‌ కోసం ప్రత్యేక యంత్రాంగాన్ని (ఏఐఎస్‌ఏఎం) పునరుద్ధరించినట్లు, వ్యూహాత్మకంగా వాటాల విక్రయ ప్రతిపాదనకు ఆమోదముద్ర వేసినట్లు గురువారం ఆయన లోక్‌సభకు రాతపూర్వక సమాధానం ద్వారా తెలిపారు. దాదాపు రూ. 50,000 కోట్ల రుణభారం ఉన్న ఎయిరిండియా .. 2018-19లో రూ. 8,556 కోట్ల నష్టాలు నమోదు చేసింది. మరోవైపు, ఏవియేషన్ రంగంలో పరిస్థితులను మెరుగుపర్చే దిశగా.. జెట్ ఎయిర్‌వేస్ విమానాలను ఇతర ఎయిర్‌లైన్స్‌కు బదలాయించేందుకు సత్వర చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి పేర్కొన్నారు. అలాగే, వచ్చే అయిదేళ్లలో వివిధ విమానాశ్రయాలను అభివృద్ధి చేసేందుకు ఎయిర్‍పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) రూ. 25,000 కోట్లు వెచ్చించనుందని వివరించారు. నిధుల సంక్షోభంతో జెట్ ఎయిర్‌వేస్ ఈ ఏడాది ఏప్రిల్‌లో మూతబడిన సంగతి తెలిసిందే. 

పారదర్శకంగా జరగాలి: ఐఏటీఏ
దేశీ విమాయాన రంగంలో పోటీతత్వం మెరుగుపడే విధంగా.. ఎయిరిండియాలో డిజిన్వెస్ట్‌మెంట్ సక్రమంగా, పారదర్శక విధానంలో జరగాలని విమానయాన సంస్థల అంతర్జాతీయ సమాఖ్య ఐఏటీఏ డైరెక్టర్ జనరల్ అలెగ్జాండర్ డి జునియాక్ అభిప్రాయపడ్డారు. అలాగే ఎయిరిండియాకు ప్రస్తుతం ఇస్తున్న వనరులను .. మొత్తం ఏవియేషన్ రంగానికి అందించేందుకు ప్రభుత్వానికీ వెసులుబాటు లభించవచ్చని ఆయన పేర్కొన్నారు. భారత మార్కెట్లో గట్టి పోటీ, భారీ నిర్వహణ వ్యయాల కారణంగా విమానయాన సంస్థల నిర్వహణ ఆపరేటర్లకు చాలా కష్టంగా ఉంటోందని జునియాక్ అభిప్రాయపడ్డారు. జెట్ ఎయిర్‌వేస్ వంటి పెద్ద సంస్థ దివాలా తీయడమనేది, దేశీ విమానయాన రంగంలో ఎయిర్‌లైన్స్‌ నిలదొక్కుకోగలగడంపై సందేహాలకు తావిచ్చేదిగా ఉందని పేర్కొన్నారు. You may be interested

ఇన్ఫీకి మరో తలనొప్పి

Friday 13th December 2019

(అప్‌డేటెడ్‌...) అమెరికాలో క్లాస్ యాక్షన్ దావా ఇన్వెస్టర్లను తప్పుదోవ పట్టించిందని ఆరోపణలు లాస్ ఏంజెలిస్:   సీఈవో, సీఎఫ్‌వోలపై ప్రజావేగుల ఫిర్యాదులతో సతమతమైన ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌కు తాజాగా మరో తలనొప్పి ఎదురైంది. షేర్‌హోల్డర్ల హక్కుల పరిరక్షణకు సంబంధించి ఇన్ఫీపై క్లాస్ యాక్షన్ దావా వేయనున్నట్లు అమెరికాకు చెందిన న్యాయసేవల సంస్థ ది షాల్ లా ఫర్మ్‌ వెల్లడించింది. మార్కెట్‌ను తప్పుదోవ పట్టించేలా ఇన్ఫోసిస్ తప్పుడు ప్రకటనలు చేసిందని షాల్‌ ఆరోపించింది. స్వల్పకాలిక లాభాలను

విలీన బాటలో ఎయిర్‌టెల్‌ డీటీహెచ్‌, డిష్‌టీవీ

Friday 13th December 2019

విలీన బాటలో ఎయిర్‌టెల్‌ డీటీహెచ్‌, డిష్‌టీవీ ప్రపంచంలో అతిపెద్ద కంపెనీగా ఆవిర్భావం 4 కోట్ల చందాదారులతో 62 శాతం మార్కెట్‌వాటా ముంబై: దేశ టీవీ ప్రసార పంపిణీ విభాగంలో అతిపెద్ద కంపెనీ ఆవిర్భావానికి అడుగులు పడుతున్నాయి. ఎయిర్‌టెల్‌ డిజిటల్‌ టీవీ, డిష్‌ టీవీ విలీనానికి ఇరు కంపెనీల మధ్య కొన్ని నెలలుగా జరుగుతున్న చర్చలు ముగింపు దశకు చేరాయి. ఇరు కంపెనీల ప్రమోటర్లతోపాటు, ప్రైవేటు ఈక్విటీ సంస్థ వార్‌బర్గ్‌పింకస్‌ డీల్‌ విషయమై ఒక అంగీకారానికి

Most from this category