News


కేంద్రానికి ఆర్‌బీఐ నిధులు మంచికే: ఏడీబీ

Friday 30th August 2019
news_main1567146106.png-28110

న్యూఢిల్లీ: కేంద్రానికి రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) నిధులను బదలాయించడం ఆర్థిక వ్యవస్థ ఉత్తేజానికి దోహదపడుతుందని ఆసియన్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ (ఏడీబీ) ప్రెసిడెంట్‌  తకిహికో నకయో పేర్కొన్నారు. రూ.1.76 లక్షల కోట్ల మిగులు బదలాయింపు ‘‘తగిన విధానం’’గా ఆయన పేర్కొన్నారు. ఈ ధోరణి పెట్టుబడులకు సానుకూలమైనదని వివరించారు. ఇక్కడ ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, అమెరికా-చైనా వాణిజ్య వివాదం నుంచి కొన్ని భారత్‌ పరిశ్రమలు ప్రయోజనం పొందవచ్చని అన్నారు. అయితే ఇపుపడు భయమంతా అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి, బలహీన మార్కెట్‌ సెంటిమెంట్‌, మారకపు విలువల్లో ఒడిదుడుకులేనని వివరించారు. నాలుగురోజుల నకయో భారత్‌ పర్యటన శుక్రవారంతో ముగుస్తుంది. మార్చి 2020తో ముగిసే ఆర్థిక సంవత్సరంలో భారత్‌ వృద్ధి రేటు 7 శాతం ఉంటుందని ఏడీబీ అంచనా. 2020-21లో ఇది 7.2 శాతంగా ఉంటుందని విశ్లేషిస్తోంది. 



You may be interested

మార్కెట్లోకి మహీంద్రా కొత్త బొలెరొ సిటీ పిక్‌ అప్‌

Friday 30th August 2019

ప్రారంభ ధర రూ.6.25 లక్షలు బెంగళూరు: ప్రముఖ వాహన తయారీ కంపెనీ ‘మహీంద్రా అండ్‌ మహీంద్రా’ (ఎం అండ్‌ ఎం).. ప్రత్యేకించి నగర అవసరాలకు తగిన విధంగా రూపొందించిన ‘బొలెరొ సిటీ పిక్‌-అప్‌’ వాహనాన్ని గురువారం మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ఈ అధునాతన పిక్‌-అప్‌ వాహన ధర రూ.6.25 లక్షలు(ఎక్స్‌షోరూమ్‌- బెంగళూరు)గా నిర్ణయించింది. ఫోర్‌-సిలెండర్‌.. 2,523 సీసీ డిజిల్‌ ఇంజిన్‌ కలిగిన ఈ నూతన వాహనానికి 1.4 టన్నుల పేలోడ్ సామర్థ్యం ఉన్నట్లు

సీజీ పవర్ నుంచి థాపర్ అవుట్‌

Friday 30th August 2019

సీజీ పవర్ నుంచి థాపర్ అవుట్‌ చైర్మన్‌గా తొలగించిన బోర్డు కొత్త చైర్మన్ ఎంపిక కోసం నేడు సమావేశం న్యూఢిల్లీ: ఆర్థిక అవకతవకలు వెలుగుచూసిన నేపథ్యంలో సీజీ పవర్ అండ్ ఇండస్ట్రియల్ సొల్యూషన్స్‌ సంస్థ చైర్మన్‌ పదవి నుంచి గౌతమ్ థాపర్‌ను తప్పిస్తూ బోర్డు నిర్ణయం తీసుకుంది. థాపర్‌ తొలగింపు తీర్మానానికి మెజారిటీ బోర్డు సభ్యులు ఆమోదం తెలిపినట్లు స్టాక్‌ ఎక్స్చేంజీలకు సీజీ పవర్ తెలిపింది. తీర్మానాన్ని థాపర్ వ్యతిరేకించగా, సీఈవో.. ఎండీ కేఎన్

Most from this category