News


టమాటా, ఉల్లి ధరలు పడిపోతే వెంటనే చర్యలు

Thursday 27th February 2020
news_main1582773389.png-32124

  • ధరల పతనంపై అప్రమత్తం చేసేందుకు వెబ్‌సైట్‌
  • ఆవిష్కరించిన కేంద్ర మంత్రి హర్‌సిమ్రత్‌కౌర్‌ బాదల్‌

న్యూఢిల్లీ: టమాటా, ఉల్లిపాయలు, ఆలుగడ్డల ధరలు ఉన్నట్టుండి పతనమైతే ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసేందుకు రూపొందించిన పోర్టల్‌ (వెబ్‌సైట్‌)ను కేంద్ర ఆహార శుద్ధి శాఖా మంత్రి హర్‌సిమ్రత్‌కౌర్‌ బాదల్‌ బుధవారం ఢిల్లీలో ఆవిష్కరించారు. ‘‘ప్రజలు అధికంగా వినియోగించే ఈ మూడు కూరగాయల టోకు ధరలను ఈ పోర్టల్‌ తెలియజేస్తుంది. అధిక సరఫరా కారణంగా ధరలు పడిపోతే ప్రభుత్వాన్ని అప్రమత్తం చేస్తుంది. దీంతో ‘ఆపరేషన్స్‌ గ్రీన్‌’ పథకం కింద ప్రభుత్వం సకాలంలో స్పందించి.. అధికంగా ఉన్న ఉత్పత్తిని కోల్డ్‌ స్టోరేజ్‌లకు తరలించేందుకు వీలుగా రైతులకు సబ్సిడీ ఇస్తుంది. లేదా మిగులు ఉత్పత్తిని డిమాండ్‌ ఉన్న చోటుకు తరలించేందుకు సాయమందిస్తుంది’’ అని మంత్రి బాదల్‌ తెలిపారు. క్రితం ఏడాది అదే కాలంతో పోలిస్తే ధరలు 50 శాతం పతనమైనా, మూడేళ్ల కనిష్ట స్థాయికి ఈ మూడు కూరగాయల ధరలు క్షీణించినా ప్రభుత్వం రూపొందించిన ‘మార్కెట్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ ఎర్లీ వార్నింగ్‌ సిస్టమ్‌ (ఎంఐఈడబ్ల్యూఎస్‌) అనే పోర్టల్‌ హెచ్చరికలు పంపుతుంది. దేశవ్యాప్తంగా 1,200 మార్కెట్లలో వీటి ధరలను ఈ పోర్టల్‌ తెలియజేస్తుందని నాఫెడ్‌ అడిషనల్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఎస్‌కే సింగ్‌ తెలిపారు. 



You may be interested

నేడు మరోసారి నష్టాల ఓపెనింగ్‌!

Thursday 27th February 2020

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 27 పాయింట్లు మైనస్‌ నేడు నిఫ్టీకి 11,618 వద్ద తొలి సపోర్ట్‌! వరుసగా ఐదో రోజు ఎస్‌అండ్‌పీ డీలా   నేడు(గురువారం) దేశీ స్టాక్‌ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ఉదయం 8.30  ప్రాంతం‍లో 27 పాయింట్లు క్షీణించి 11,671 వద్ద ట్రేడవుతోంది. మంగళవారం ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ ఫిబ్రవరి ఫ్యూచర్‌ 12,698 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక్కడి ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఫ్యూచర్‌ కదలికలను ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ

అపోలో టైర్స్‌ వార్‌బర్గ్‌ పెట్టుబడులు

Thursday 27th February 2020

రూ.1,080 కోట్లు మేర !  న్యూఢిల్లీ: అపోలో టైర్స్‌ కంపెనీలో ప్రముఖ ప్రైవేట్‌ ఈక్విటీ సంస్థ, వార్‌బర్గ్‌ పింకస్‌ రూ.1,080 కోట్లు పెట్టుబడులు పెట్టనున్నది. వార్‌బర్గ్‌ పింకస్‌ అనుబంధ కంపెనీకి రూ.1,080 కోట్ల విలువైన తప్పనిసరి కన్వర్టబుల్‌ ప్రిఫరెన్స్‌ షేర్లను జారీ చేయడానికి డైరెక్టర్ల బోర్డ్‌ ఆమోదం తెలిపిందని అపోలో టైర్స్‌ సీఎమ్‌డీ ఓంకార్‌ ఎస్‌ కన్వర్‌ తెలిపారు. ఈ ప్రతిపాదనకు వాటాదారుల, వివిధ సంస్థల ఆమోదాలు పొందాల్సి ఉందని పేర్కొన్నారు.

Most from this category