News


బీఎస్‌ఎన్‌ఎల్‌, ఎంటీఎన్‌ఎల్‌లకు రూ.74,000కోట్ల బెయిలవుట్‌

Wednesday 3rd July 2019
news_main1562148366.png-26769

ప్రభుత్వ రంగ టెలికాం సంస్థలైన భారతీ నిగమ్‌ లిమిటెడ్‌(బీఎస్‌ఎన్‌ఎల్‌), మహానగర్‌ టెలిపోన్‌ నిగమ్‌(ఎమ్‌టీఎన్‌ఎల్‌)లకు రూ.74,000 కోట్ల బెయిఅవుట్‌ ప్యాకేజీని ప్రభుత్వం ప్రకటించింది. ఈ స్కీమ్‌లో ఎక్సి‍ట్‌ ప్యాకేజితో పాటు అదనపు ఐదు శాతం పరిహారం, 4జీ స్పెక్ట్రమ్‌ నిబంధనలు, మూలధన వ్యయం మిళితమై ఉన్నాయి. ఆర్ధిక సంవత్సరం 2019 చివరి నాటికి అధిక రుణాలు కలిగిన ప్రభుత్వ రంగ సంస్థల్లో, రూ.13,804కోట్లతో బీఎస్‌ఎన్‌ఎల్‌ ఇండియా మొదటి స్థానంలో ఉంది. మూడవ స్థానంలో రూ.3,398కోట్లతో ఎంటీఎన్‌ఎల్‌ ఉండగా, రెండవ స్థానంలో ఎయిర్‌ఇండియా ఉంది. ఈ బెయిలవుట్‌ స్కీమ్‌లో రూ.20,000 కోట్లను 4జీ స్పెక్ట్రమ్‌ కోసం కేటాయించగా, రూ.40,000కోట్లను స్వచ్ఛంద పదవి విరమణ పథకానికి(వీఆర్‌ఎస్‌), వారికి విరమణ సౌలభ్యాలను అందించడానికి కేటాయించారు. వీటితో పాటు రూ.13,000 కోట్లను మూలధన వ్యయంగా అందించారు. 
   నష్టాల్లో నడుస్తున్న ప్రభుత్వ సంస్థల్లో విరమణ వయసును 60 నుంచి 58 కి తగ్గించడం వలన ఖర్చులను తగ్గించుకోవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. జూన్‌ నెల ఉద్యోగుల జీతాల చెల్లింపులు చేశామని,  రూ.14,000 కోట్ల బకాయిల చెల్లింపుల కోసం టెలికమ్యూనికేషన్‌ డిపార్ట్‌మెంట్‌(డీఓటీ) అనుమతులకై వేచి ఉన్నామని బీఎస్‌ఎన్‌ఎల్‌ తెలిపింది. అంతేకాకుండా బీఎస్‌ఎన్‌ఎల్‌, ఎంటీఎన్‌ఎల్‌ సంస్థల టవర్లు, భూమి, ఆప్టికల్‌ ఫైబర్‌ వంటి ఆస్తుల నుంచి నగదు సంపాదించే విధంగా ఓ డ్రాప్ట్‌ బిల్లు కేబినెట్‌ చూట్టు తిరుగుతోందని వార్తలు వినిపిస్తున్నాయి. 
    రూ.1.2లక్షల కోట్ల విలువ కలిగిన రెండు కంపెనీలను మూసివేయడం కంటే బెయిలవుట్‌ మంచి పద్ధతని డీఓటీ భావిస్తోంది. ఈ సంస్థలలోని ప్రభుత్వం పెట్టుబడులను ఉపసంహరించుకున్నా, ఎక్కువ మంది కొనుగోలుదారులను ఆకర్షించలేకపోవచ్చు. ఇది టెలికాం రంగంలో ఆర్థిక ఒత్తిడిని కలిగించవచ్చని పరిశీలకులంటున్నారు. బీఎస్‌ఎన్‌ఎల్‌, ఎంటీఎన్‌ఎల్‌ కంపెనీల జాయింట్‌ వెంచర్‌ను ప్రారంబించే అవకాశాన్ని పరిశీలిస్తున్నామని డీఓటీ తెలిపింది. 
   అధ్వాన్న నిర్వహణ, అధిక ఖర్చుల వలన గత కొన్నేళ్ల నుంచి ప్రభుత్వ టెలికాం సంస్థలు ఈ రంగంలోని ప్రైవేటు కంపెనీలతో పోటి పడలేకపోతున్నాయి. ఈ రెండు సంస్థల యావరేజ్‌ రెవెన్యూ పెర్‌ యూజర్‌(ఏఆర్‌జీయూ)  రూ.38 దగ్గరుంటే ప్రవేట్‌ కంపెనీలలో అది రూ. 70గా ఉంది. 

 You may be interested

అధిక రాబడులకు...ఎఫ్‌ఐఐలు ఇండియాకు రావాల్సిందే!

Wednesday 3rd July 2019

ఈక్విటీ పెట్టుబడులపై మంచి రాబడి సంపాదించాలని భావించే విదేశీ మదుపరులు ఇండియా ఈక్విటీలను మరువలేరని, ప్రపంచంలో భారత ఎకానమీ చాలా బలంగా కనిపిస్తోందని మాన్యులైఫ్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ అభిప్రాయపడింది. ట్రేడ్‌ వార్‌ నేపథ్యంలో చైనా అస్థిరతను ఎదుర్కొంటోందని, విదేశీ మదుపరులకు ఇప్పుడు ఒక సురక్షితమైన, పరుగులు తీసే ఎకానమీ కావాలని సంస్థ ఎండీ రానా గుప్తా చెప్పారు. భారత్‌ తన ఎకానమీకి లక్షల కోట్ల డాలర్లను జత చేస్తోందన్నారు. దీంతో

ప్రభుత్వరంగ బ్యాంకు షేర్ల ర్యాలీ

Wednesday 3rd July 2019

ఉదయం ట్రేడింగ్‌ సెషన్‌లో నష్టాల బాట పట్టిన ప్రభుత్వరంగ బ్యాంకింగ్‌ రంగ(పీఎస్‌యూ)షేర్లు మిడ్‌సెషన్‌ సమయానికల్లా తిరిగి లాభాల్లోకి మళ్లాయి. ఎన్‌ఎస్‌ఈలో ప్రభుత్వరంగ బ్యాంకింగ్ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ పీఎస్‌యూ ఇండెక్స్‌  నేడు 3,207.60ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. కేవైసీ నిబంధలను ఉల్లఘించినందుకు ఆర్‌బీఐ 4 ప్రభుత్వరంగ బ్యాంకులపై రూ.1.75 కోట్ల జరిమానా విధించింది. వాటిలో పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌, యూకో బ్యాంక్‌, అలహదాబాద్‌ బ్యాంకులపై రూ.50లక్షలు, కార్పోరేషన్‌ బ్యాంకుపై

Most from this category