News


ఏజీఆర్‌పై టెల్కోలకు నిరాశ..

Saturday 29th February 2020
news_main1582952579.png-32181

  • డీసీసీ భేటీలో నిర్ణయం వాయిదా

న్యూఢిల్లీ: తీవ్ర సంక్షోభంలో ఉన్న టెలికం రంగానికి ఊరటనిచ్చే చర్యలపై చర్చించేందుకు శుక్రవారం జరిగిన డిజిటల్ కమ్యూనికేషన్స్ కమిషన్‌ (డీసీసీ) సమావేశం.. ఎలాంటి నిర్ణయం తీసుకోకుండానే ముగిసింది. ఏజీఆర్ డేటాను మదింపు చేసేందుకు మరిన్ని వివరాలు అవసరం కావడంతో డీసీసీ కొద్ది రోజుల్లో మరోసారి భేటీ అయ్యే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. దాదాపు రెండు గంటల పాటు భేటీ సాగినట్లు వివరించాయి. మరోవైపు, ఏజీఆర్‌ అంశంపై పెద్దగా చర్చ జరగలేదని, భారత్‌ నెట్ ప్రాజెక్టు అమలు విషయంపైనే సమావేశంలో ప్రధానంగా దృష్టి పెట్టినట్లు టెలికం శాఖ వర్గాలు తెలిపాయి. అటు, టెలికం శాఖ కార్యదర్శి అన్షు ప్రకాష్‌తో వొడాఫోన్ ఐడియా సీఈవో రవీందర్ టక్కర్‌ భేటీ అయ్యారు. అయితే, సమావేశం వివరాలను వెల్లడించడానికి నిరాకరించారు.


    సవరించిన స్థూల ఆదాయాల (ఏజీఆర్‌) ప్రాతిపదికన టెల్కోలు దాదాపు 1.47 లక్షల కోట్ల మేర లైసెన్సు ఫీజు, స్పెక్ట్రం యూసేజీ చార్జీలు కట్టాల్సి ఉన్న సంగతి తెలిసిందే. రుణభారం, నష్టాలతో సతమతమవుతున్న టెలికం రంగం.. దీనితో మరింత కుదేలైంది. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు కొంత మేర కట్టినప్పటికీ .. మిగతాది చెల్లించేందుకు మరింత వ్యవధి, రుణాలపరమైన వెసులుబాటు ఇవ్వాలంటూ కేంద్రాన్ని కోరింది. ఈ నేపథ్యంలో శుక్రవారం సమావేశంలో డీసీసీ ఏవైనా ఊరట చర్యలు ప్రకటించవచ్చన్న అంచనాలు నెలకొన్నాయి.  You may be interested

ఇండియా సైతం తప్పించుకోలేదు!

Saturday 29th February 2020

కరోనా కరెక‌్షన్‌ ప్రభావం తప్పదు పెట్టుబడిసాధనాలన్నీ దుర్బలంగా ఉన్నాయి మార్క్‌ ఫెబర్‌ హెచ్చరికలు భారత్‌ సహా అన్ని మార్కెట్లు చాలా ఖరీదైనవిగా ఉన్నాయని ప్రముఖ అనలిస్టు మార్క్‌ ఫెబర్‌ అభిప్రాయపడ్డారు. అందువల్లే ప్రపంచవ్యాప్తంగా పతనం వస్తోందని, ఈ వరుసలో ఇండియా సైతం కరెక‌్షన్‌ తప్పించుకోలేదని తెలిపారు. కరోనా వైరస్‌ అనేది ఈ పతనానికి ఒక ఉత్ప్రేరకమేనన్నారు. ప్రస్తుతం ప్రపంచ బుల్‌మార్కెట్‌ 11వ సంవత్సరంలో ఉందన్నారు. 2009 మార్చి6న అంతర్జాతీయ బుల్‌మార్కెట్‌ ఆరంభమైందన్నారు. అన్ని మార్కెట్లలో

ఆర్థికరంగంపై మరింత దృష్టి అవసరం: రాజన్‌ సూచన

Saturday 29th February 2020

న్యూఢిల్లీ: ఆర్థిక పురోగతికి తీసుకోవాల్సిన చర్యలపై కేంద్రం మరింత దృష్టి సారించాల్సిన అవసరం ఉందని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) మాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ పేర్కొన్నారు. అయితే దీనికి బదులు ప్రభుత్వం తన రాజకీయ, సామాజిక అజండాలపైనే మరింత దృష్టి సారిస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు. వృద్ధి మందగమనానికి ఈ అంశమూ ఒక కారణమనీ ఆయన విశ్లేషించారు. ఫైనాన్షియల్‌ రంగం ప్రక్షాళనకు కేంద్రం ఎటువంటి చర్యలూ తీసుకోకపోవడం కూడా

Most from this category