News


డేటా దుర్వినియోగానికి జైలు శిక్ష ..

Thursday 5th December 2019
news_main1575517273.png-30061

  • కంపెనీలపై రూ. 15 కోట్ల దాకా జరిమానా
  • వ్యక్తిగత డేటా భద్రత బిల్లుకు క్యాబినెట్ ఆమోదం

న్యూఢిల్లీ: వ్యక్తిగత డేటాను దుర్వినియోగం చేసిన పక్షంలో కంపెనీలు ఇకపై భారీ మూల్యం చెల్లించుకోవాల్సి రానుంది. కోట్ల రూపాయల జరిమానాలు కట్టడంతో పాటు వాటి ఎగ్జిక్యూటివ్‌లు జైలు శిక్షలు కూడా ఎదుర్కొనాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించిన వ్యక్తిగత డేటా భద్రత బిల్లుకు కేంద్ర క్యాబినెట్ బుధవారం ఆమోదముద్ర వేసినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. దీన్ని ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే ప్రవేశపెట్టే అవకాశం ఉందని పేర్కొన్నాయి. వ్యక్తిగత డేటా భద్రత బిల్లు నిబంధనలు ఉల్లంఘించిన పక్షంలో సదరు కంపెనీ .. రూ. 15 కోట్ల దాకా లేదా తన అంతర్జాతీయ టర్నోవరులో 4 శాతం మొత్తాన్ని జరిమానాగా కట్టాల్సి వస్తుంది. ఒకవేళ వ్యక్తుల డేటాను కావాలనే చట్టవిరుద్ధంగా ప్రాసెసింగ్‌ చేశారని తేలిన పక్షంలో సదరు కంపెనీలో డేటా వ్యాపార విభాగానికి ఇంచార్జిగా ఉన్న ఎగ్జిక్యూటివ్‌కు మూడేళ్ల దాకా జైలు శిక్ష పడే అవకాశం ఉంది. అలాగే తమ డేటాను పూర్తిగా తొలగించేలా తగు చర్యలు తీసుకోవడానికి వ్యక్తులకు హక్కులు లభిస్తాయి. డేటా బిల్లులో మరికొన్ని ముఖ్యాంశాలు..

  • వ్యక్తులకు సంబంధించిన కీలక డేటాను అన్ని ఇంటర్నెట్ కంపెనీలు.. భారత్‌లోనే భద్రపర్చాలి. ఒకవేళ విదేశాల్లో ప్రాసెస్ చేయాల్సి వస్తే.. చట్ట నిబంధనలకు లోబడి, ఆయా వ్యక్తుల నుంచి కచ్చితంగా పూర్తి అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది.
  • ఆరోగ్యం, మతం, రాజకీయ అభిప్రాయాలు, బయోమెట్రిక్స్‌, జన్యుపరమైన, ఆర్థికపరమైన వివరాలను కీలక డేటాగా పరిగణించడం జరుగుతుంది. కీలక డేటాలో మార్పులు, చేర్పుల గురించి కేంద్రం ఎప్పటికప్పుడు ప్రకటిస్తుంది.
  • చిన్నపాటి ఉల్లంఘనలకు సంబంధించి కంపెనీలపై రూ. 5 కోట్లు లేదా గ్లోబల్ టర్నోవరులో 2 శాతం దాకా జరిమానా విధించవచ్చు. నిబంధనలు ఉల్లంఘించిన అధికారులకు జైలు శిక్ష కూడా విధించవచ్చు.  You may be interested

జియో బాదుడు ... 39శాతం పైనే

Thursday 5th December 2019

పెంపులో ఐడియా, ఎయిర్‌టెల్‌ కన్నా ఎక్కువే 39 శాతానికి పైగా పెరిగిన రిలయన్స్‌ జియో ఛార్జీలు న్యూఢిల్లీ: ప్రముఖ టెలికం కంపెనీ రిలయన్స్‌ జియో... ఛార్జీలు పెంచుతూ కొత్త రేట్లను బుధవారం విడుదలచేసింది. డిసెంబర్‌ 6 నుంచి ధరలు పెరగనున్నట్లు కంపెనీ గతంలోనే ఒక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. కాగా, ప్రస్తుతం అమల్లో ఉన్న ట్యారిఫ్‌లతో పోల్చితే 39 శాతానికి పైగా పెంపును ప్రకటించింది. రోజుకు 1.5 జీబీ డేటాతో 84

కార్వీ కేసులో బ్యాంకులకు చుక్కెదురు

Thursday 5th December 2019

తనఖా షేర్లపై సెబీనే ఆశ్రయించాలని శాట్ సూచన న్యూఢిల్లీ: క్లయింట్ల షేర్లు సొంతానికి వాడుకుందని ఆరోపణలు ఎదుర్కొంటున్న కార్వీ స్టాక్ బ్రోకింగ్ (కేఎస్‌బీఎల్‌) వ్యవహారంలో సెక్యూరిటీస్ అపీలేట్ ట్రిబ్యునల్‌లో (శాట్‌) బ్యాంకులకు చుక్కెదురైంది. తనఖా పెట్టిన షేర్లను క్లయింట్ల ఖాతాల్లోకి మళ్లించకుండా తక్షణం ఆదేశాలివ్వాలన్న బ్యాంకుల అభ్యర్థనను శాట్ తోసిపుచ్చింది. దీనిపై డిసెంబర్ 6లోగా మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీనే ఆశ్రయించాలని ఆదేశించింది. అలాగే ఆయా బ్యాంకుల వాదనలు విని, డిసెంబర్

Most from this category