క్లాస్ యాక్షన్ దావా మార్గదర్శకాలు విడుదల
By Sakshi

న్యూఢిల్లీ: చిన్న ఇన్వెస్టర్ల ప్రయోజనాలు దెబ్బతినేలా వ్యవహరించే కంపెనీలపై క్లాస్ యాక్షన్ దావా వేసేందుకు ఉద్దేశించిన మార్గదర్శకాలను కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల శాఖ విడుదల చేసింది. వీటి ప్రకారం కంపెనీలోని మొత్తం సభ్యుల సంఖ్యలో అయిదు శాతం మంది లేదా 100 మంది (ఏ సంఖ్య తక్కువైతే అది) క్లాస్ యాక్షన్ దావా వేయొచ్చు. డిపాజిటర్లు, డిపాజిట్లు స్వీకరించే సంస్థలకు కూడా ఇది వర్తిస్తుంది. అన్‌లిస్టెడ్ కంపెనీ అయితే.. ఇష్యూడ్ షేర్ క్యాపిటల్‌లో కనీసం అయిదు శాతం వాటా ఉన్నవారు క్లాస్ యాక్షన్ దావా వేయొచ్చు. లిస్టెడ్ కంపెనీలకి ఇది రెండు శాతంగా ఉంటుంది. కంపెనీల చట్టం కింద నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ రూల్స్ 2016లో కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల శాఖ ఈ మేరకు సవరణలు చేసింది. దావా వేసేందుకు అర్హుల వివరాలపై స్పష్టత రావడంతో ఇన్వెస్టర్లు ఇకపై క్లాస్ యాక్షన్ సూట్ వేసేందుకు మార్గం సుగమమైందని అధికారవర్గాలు తెలిపాయి. ఏదైనా కంపెనీ తమ ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరిస్తోందని చిన్న, మైనారిటీ ఇన్వెస్టర్లు భావించిన పక్షంలో ఒక గ్రూపుగా ఏర్పడి కంపెనీల చట్టంలోని సెక్షన్ 245 కింద క్లాస్ యాక్షన్ దావా వేయొచ్చు.
You may be interested
హెచ్సీఎట్ టెక్ లాభం రూ.2,550 కోట్లు
Friday 10th May 2019-ఒక్కో షేర్‌కు రూ.2 మధ్యంతర డివిడెండ్ -ఈ ఆర్థిక సంవత్సరంలో 1,000 కోట్ల ఆదాయం లక్ష్యం -హెచ్‌సీఎల్ టెక్ సీఈఓ విజయ్ కుమార్ న్యూఢిల్లీ: ఐటీ దిగ్గజం హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ గత ఆర్థిక సంవత్సరం(2018-19) మార్చి క్వార్టర్లో రూ.2,550 కోట్ల నికర లాభం (కన్సాలిడేటెడ్)సాధించింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం (2017-18) ఇదే క్వార్టర్లో రూ.2,230 కోట్ల నికర లాభం వచ్చిందని హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ తెలిపింది. ఆదాయం రూ.13,178 కోట్ల నుంచి 21 శాతం వృద్ధితో
ఎస్బీఐ ఫలితాలు ఎలా ఉండొచ్చు?
Friday 10th May 2019మార్చి త్రైమాసిక ఫలితాలను ఎస్బీఐ శుక్రవారం ప్రకటించనుంది. నికర వడ్డీ ఆదాయంలో రెండంకెల వృద్ధి, ప్రొవిజన్లు తగ్గడంతో బ్యాంకు మంచి లాభాలను చూపవచ్చని నిపుణులు భావిస్తున్నారు. క్యు4లో బ్యాంకు రూ.5-7వేల కోట్ల లాభాలన్ని ప్రకటించవచ్చని బ్రోకింగ్ సంస్థలు భావిస్తున్నాయి. అంతకుముందేడాది ఇదే కాలానికి బ్యాంకు రూ. 7718 కోట్ల నష్టాన్ని ప్రకటించింది. బ్యాంకు ఫలితాలపై వివిధ సంస్థల అంచనాలు ఇలా ఉన్నాయి.. - నార్నోలియా సెక్యూరిటీస్: లాభం 53 శాతం పెరిగి