News


రూ.లక్ష దాటిన జీఎస్టీ ఆదాయం

Saturday 1st February 2020
news_main1580536836.png-31396

 

న్యూఢిల్లీ: వరుసగా మూడోనెల్లో వస్తుసేవల పన్ను(జీఎస్టీ) ఆదాయం రూ.లక్ష కోట్లకుపైగా వసూలయ్యింది. పన్ను ఎగవేత దారుల నుంచి చెల్లింపు వసూళ్లు పెరగడంతో డిసెంబర్‌ నెలలో  రికార్డు స్తాయిలో జీఎస్టీ ఆదాయం రూ. 1.1లక్షలుగా నమోదైంది. రెవిన్యూ సెక్రటరీ అజయ్‌ భూషన్‌ పాండే  ఏర్పాటు చేసిన ఉన్నతస్థాయి సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు.దేశీయ లావాదేవీల్లో 12 శాతం వృద్ధి పెరిగిందని, గతేడాది జనవరితో పోలిస్తే 2020 జనవరిలో ఐజీఎస్టీ ఆదాయం 80 శాతం పెరిగిందని తెలిపారు. ఇక దిగుమతి వస్తువుల ఐజీఎస్టీ వృద్ధి గతేడాదితో పోలిస్తే 3 శాతం పడిపోయిందని పేర్కొన్నారు. 2020 స్థూల జీఎస్టీ ఆదాయం రూ.1,10,828 కోట్లుకాగా, సీజీఎస్టీ రూ.20,944 కోట్లుగా నమోదైంది. ఇక రాష్ట్రాల్లో వసూలయ్యే ఎస్‌జీఎస్‌టీ రూ.28,224 చేరింది. రూ.23,481 కోట్ల దిగుమతులతో కలిపి ఐజీఎస్టీ రూ.53,031 కోట్లుగా నమోదైంది. సెస్‌ రూ.8,637 కోట్లకు చేరింది. గతేడాది డిసెంబర్‌ నుంచి జనవరి 31వరకు 83 లక్షల మంది జీఎస్టీఆర్‌ 3బీ రిటర్న్‌లను సమర్పించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెల్లింపులు తరువాత సీజీఎస్టీ ఆదాయం రూ.45,674 కోట్లుగా, ఎస్‌జీఎస్టీ రూ.46,433 కోట్లుగా నమోదైందని అధికారులు వివరించారు.

     
     



You may be interested

లాభాల్లోకి సూచీలు

Saturday 1st February 2020

బడ్జెట్‌ రోజు నష్టాలతో ఆరంభమైన దేశీయ మార్కెట్లు క్రమంగా లాభాల్లోకి మరలాయి. 11939 పాయింట్ల వద్ద ఆరంభమైన నిఫ్టీ ఒకదశలో 11880 పాయింట్ల కనిష్టాలకు చేరింది. క్రమంగా కోలుకొని 12017 పాయింట్ల గరిష్ఠాన్ని చేరింది. ప్రస్తుతం(మధ్యాహ్నం12గంటలకు) 11975 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. సెన్సెక్స్‌ 40767 పాయింట్ల వద్ద కదలాడుతోంది. బడ్జెట్లో మార్కెట్‌ను ప్రభావితం చేసే పన్ను అంశాలు ఇంకా ప్రవేశ పెట్టలేదు. 

కేంద్ర బడ్జెట్‌ 2020 హైలైట్స్‌..(అప్‌డేటింగ్‌) -ఆదాయ పన్ను శ్లాబ్‌ తగ్గింపు

Saturday 1st February 2020

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ లోక్‌సభలో 11 గంటలకల్లా బడ్జెట్‌ ప్రసంగం ప్రారంభించారు. వస్తు, సేవల పన్ను(జీఎస్‌టీ) అత్యంత ప్రధానమైన సంస్కరణగా సీతారామన్‌ బడ్జెట్‌ ప్రసంగంలో పేర్కొన్నారు. ఆర్థిక మంత్రి ప్రసంగం ఇలా సాగింది. ఆదాయ పన్ను తగ్గింపు రూ. 5 లక్షలలోపు ఆదాయంపై పన్ను లేదు రూ. 5-7.5 లక్షల ఆదాయంపై ప్రస్తుతం అమలవుతున్న 20 శాతం‍ శ్లాబు 10 శాతానికి కుదింపు రూ. 7.5-10 లక్షల ఆదాయంపై ఇక 15

Most from this category