News


విమానయాన రంగంపై పన్నుల భారం దించాలి: సింగ్‌

Tuesday 22nd October 2019
news_main1571715603.png-29040

వాషింగ్టన్‌: విమానయాన రంగంపై పన్నుల భారం తగ్గించాలని స్పైస్‌జెట్‌ చీఫ్‌ అజయ్‌ సింగ్‌ ప్రభుత్వానికి సూచించారు. ఎంఆర్‌వో(నిర్వహణ, రిపెయిర్‌, ఓవర్‌హాల్‌) విభాగంలో భారత్‌ అద్భుతంగా పనిచేయగలదని అభిప్రాయపడ్డారు. భారత్‌లో పౌర విమానాయన రంగంపై అధిక పన్నుల భారం ఉందని, అంతర్జాతీయంగా పోటీ పడేందుకు ఇది అవరోధంగా ఉన్నట్టు సింగ్‌ చెప్పారు. ఈ మేరకు ఆయన ఓ వార్తా సంస్థతో మాట్లాడారు. ‘‘విమానయాన రంగం ఉద్యోగాలు కల్పిస్తోంది. భారత్‌ను ప్రపంచంతో అనుసంధానిస్తోంది. కనుక ఈ రంగం పట్ల మరింత సమగ్ర దృక్పథంతో వ్యవహరించాల్సిన అవసరం ఉంది’’ అని సింగ్‌ పేర్కొన్నారు. 



You may be interested

ఇన్ఫోసిస్‌ 15% క్రాష్‌!

Tuesday 22nd October 2019

 స్వల్ప కాలంలో మార్జిన్‌లు, లాభాలను పెంచుకోడానికి అనైతిక విధానాలను అనుసరిస్తోందని ఇన్ఫోసిస్‌కు వ్యతిరేకంగా, కొంత మంది ఉద్యోగులు యుఎస్‌ సెక్యురిటీ ఎక్సెంజ్‌కి, ఇన్ఫోసిస్‌ బోర్డుకు లేఖలు రాయడంతో సోమవారం సెషన్‌లో ఇన్ఫోసిస్‌ ఏడీఆర్‌లు(యుఎస్‌ మార్కెట్లో) 16 శాతం మేర పడిపోయాయి. అదే విధంగా దేశీయ మార్కెట్‌లో కూడా ఇన్ఫోసిస్‌ షేరు మంగళవారం సెషన్‌లో 10 శాతం లేదా రూ. 76.75 నష్టపోయి రూ. 691.10 వద్ద ప్రారంభమైంది. ప్రారంభంలో షేరు

దేశీయ పరిశ్రమ ప్రయోజనాలను పరిరక్షిస్తాం

Tuesday 22nd October 2019

కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్‌ గోయల్‌ న్యూఢిల్లీ: ప్రతిపాదిత భారీ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఆర్‌సీఈపీ) కుదుర్చుకునే ముందు దేశీయ పరిశ్రమ ప్రయోజనాలకు పరిరక్షిస్తామని కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్‌ గోయల్‌ తెలిపారు. ప్రాంతీయ సమగ్ర ఆర్థిక సహకార (ఆర్‌సీఈపీ) ఒప్పందం కోసం 10 ఆసియాన్‌ సభ్య దేశాలతోపాటు వాటితో స్వేచ్ఛా వాణిజ్యం కలిగిన ఆరు దేశాల మధ్య చర్చలు జరుగుతున్న విషయం గమనార్హం. ఈ ఏడాది నవంబర్‌లోపు చర్చలు ముగించి,

Most from this category