News


ప్రత్యేక కంపెనీగా గెయిల్‌ పైప్‌లైన్‌ విభాగం !

Tuesday 16th July 2019
news_main1563260366.png-27096

  • కసరత్తు చేస్తోన్న ప్రభుత్వం 

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ గ్యాస్‌ సంస్థ, గెయిల్‌ (ఇండియా)ను విభజించాలని ప్రభుత్వం యోచిస్తోంది. గెయిల్‌ కంపెనీ పైప్‌లైన్‌ వ్యాపారాన్ని ప్రత్యేక కంపెనీగా ఏర్పాటు చేయాలని, ఈ విభాగాన్ని వ్యూహాత్మక ఇన్వెస్టర్‌కు విక్రయించనున్నదని సంబంధిత వర్గాలు తెలిపాయి.

ఐఓసీ, బీపీసీఎల్‌ల ఆసక్తి...
దేశంలోనే అతి పెద్ద నేచురల్‌ గ్యాస్‌ మార్కెటింగ్‌, ట్రేడింగ్‌ కంపెనీగా గెయిల్‌ ఇండియా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. దేశంలోని 16,234  కిమీ. గ్యాస్‌పైప్‌లైన్‌ నెట్‌వర్క్‌లో మూడింట రెండొంతులు ఈ కంపెనీదే. నేచురల్‌ గ్యాస్‌ సరఫరాలో తరచుగా అవాంతరాలు ఏర్పడుతుండటం, ఈ విషయంలో వినియోగదారుల నుంచి ఫిర్యాదులు ఎక్కువగా వస్తుండటంతో ఈ పైప్‌లైన్‌ విభాగాన్ని ప్రత్యేక కంపెనీగా ఏర్పాటు చేస్తే బావుంటుందని ప్రభుత్వం భావిస్తోంది. గ్యాస్‌ పైప్‌లైన్‌, మార్కెటింగ్‌ వ్యాపారాలకు వేర్వేరు ఖాతా పుస్తకాలను గెయిల్‌ నిర్వహిస్తోందని, అందుకే గ్యాస్‌పైప్‌లైన్‌ విభాగాన్ని ప్రత్యేక కంపెనీగా మార్చడంలో ఎలాంటి ఇబ్బంది ఉండదని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. గెయిల్‌ నుంచి పైప్‌లైన్‌ విభాగాన్ని విడదీయాలనే ఆలోచన పదేళ్ల నుంచే నలుగుతోంది. అయితే ఇప్పటివరకూ సాకారం కాలేదు. కాగా గ్యాస్‌పైప్‌లైన్‌ విభాగాన్ని కొనుగోలు చేయడానికి ఐఓసీ, బీపీసీఎల్‌లు సిద్ధంగా ఉన్నాయని సమాచారం.



You may be interested

భూషణ్ పవర్‌ను కొంటాం ..కానీ..

Tuesday 16th July 2019

కంపెనీలో మోసాల వార్తలపైనే ఆందోళన ఎన్‌సీఎల్‌టీకి తెలిపిన జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ న్యూఢిల్లీ:   దివాలా ప్రక్రియ కింద వేలానికి వచ్చిన భూషణ్ పవర్ అండ్ స్టీల్‌ (బీపీఎస్‌ఎల్‌)ను కొనుగోలు చేసేందుకు కట్టుబడి ఉన్నామని నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ)కి జేఎస్‌డబ్ల్యూ స్టీల్ తెలిపింది. అయితే, ఆ సంస్థ మాజీ ప్రమోటర్లు మోసాలకు పాల్పడ్డారన్న ఆరోపణలపైనే కొంత ఆందోళన ఉన్నట్లు, కంపెనీలో ఏం జరుగుతోందో తెలుసుకోవాలని కోరుకుంటున్నట్లు వివరించింది. దీంతో బీపీఎస్‌ఎల్‌ ఫోరెన్సిక్

బజాజ్‌ కన్సూమర్‌ లాభం 9 శాతం అప్‌

Tuesday 16th July 2019

10 శాతం పెరిగిన ఆదాయం  న్యూఢిల్లీ: ఎఫ్‌ఎమ్‌సీజీ కంపెనీ బజాజ్‌ కన్సూమర్‌ కేర్‌ ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలంలో రూ.57 కోట్ల నికర లాభం సాధించింది. గత ఆర్థిక సంవత్సంరలో ఇదే క్వార్టర్‌లో సాధించిన నికర లాభం, రూ.52 కోట్లుతో పోల్చితే 9 శాతం వృద్ధి సాధించామని బజాజ్‌ కన్సూమర్‌ కేర్‌ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.224 కోట్ల నుంచి 10 శాతం వృద్ధితో రూ.247 కోట్లకు పెరిగిందని

Most from this category