News


టెల్కో లైసెన్స్‌ ఫీజుల తగ్గింపు!

Tuesday 24th December 2019
news_main1577160967.png-30401

త్వరలో ప్రభుత్వ ప్రకటన
టెలికం కంపెనీల లైసెన్సు ఫీజులను ప్రభుత్వం త్వరలో 8 నుంచి 6- 5 శాతానికి తగ్గించనుంది. టెలికం కంపెనీలకు ఊరట కలిగించే దిశగా ప్రభుత్వం ఈ నిర్ణయానికి వచ్చినట్లు సీనియర్‌ అధికారులు తెలిపారు. ఈ మేరకు ప్రభుత్వ ఉన్నతస్థాయి కమిటీ ఒకటి లైసెన్సుఫీజుల తగ్గింపుపై చర్చిస్తున్నట్లు తెలిపారు. ఫీజుల తగ్గింపుతో మూడు టెలికం కంపెనీలకు కలిపి దాదాపు రూ.4-5 వేల కోట్ల ప్రయోజనం చేకూరనుంది. అయితే ఇది తాత్కాలిక ఉపశమనమే కానీ, వొడాఫోన్‌ఐడియా, ఎయిర్‌టెల్‌కు పెద్దగా ప్రయోజనం చేకూర్చే చర్య కాదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ రెండు కంపెనీలు ఏజీఆర్‌ బకాయిల రూపంలో పెద్ద మొత్తాలు ప్రభుత్వానికి చెల్లించాల్సిఉంది. ఏజీఆర్‌ అంశంలో ప్రభుత్వం ఏమీ చేయలేదని, ఈ విషయంలో ఏ నిర్ణయమైనా సుప్రీంకోర్టు నుంచి రావాల్సిఉందని ప్రభుత్వ అధికారి ఒకరు చెప్పారు. ఏజీఆర్‌ మినహా ఇతర ఊరట నిర్ణయాల్లో భాగంగా లైసెన్స్‌ ఫీజు తగ్గించాలని నిర్ణయించారని, ఇప్పటికే స్పెక్ట్రం చెల్లింపులపై మారిటోరియం విధించారని తెలిపారు. లైసెన్స్‌ ఫీజు తగ్గింపుపై కేబినెట్‌ తుది నిర్ణయం తీసుకోవాల్సిఉంది.

యూఎస్‌ఓఎఫ్‌(యూనివర్సల్‌ సర్వీస్‌ ఆబ్లికేషన్‌ ఫండ్‌) అనేది లైసెన్స్‌ ఫీజులో భాగం. దీన్ని తగ్గించడం ద్వారా పరోక్షంగా ఏజీఆర్‌ భారం తగ్గించినట్లు అవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఎందుకంటే ఏజీఆర్‌ లైసెన్స్‌ ఫీజు బకాయిల్లో యూఎస్‌ఓఎఫ్‌ వాటా కూడా తగ్గుతుంది. ఈ ఫీజుల తగ్గింపుతో ఎయిర్‌టెల్‌కు రూ. 2వేల కోట్లు, జియోకు రూ. 1500 కోట్లు, వీఐఎల్‌కు దాదాపు రూ. 800 కోట్ల మేర ప్రయోజనం చేకూరవచ్చని అంచనా. ఏజీఆర్‌ తీర్పుపై ఎయిర్‌టెల్‌, వీఐఎల్‌ రివ్యూ పిటీషన్‌ వేశాయి. దీనిపై ఇంకా ఎలాంటి నిర్ణయం వెలువడలేదు. ఈ అంశం టెలికం రంగంపై పెను ప్రభావం చూపేది కావడం వల్ల సుప్రీం కోర్టు తప్పక తీర్పును పునఃపరిశీలించవచ్చని నిపుణుల అంచనా. ఈలోపు ఫీజుల తగ్గింపు, స్పెక్ట్రం చెల్లింపులపై మారిటోరియం, టారిఫ్‌ల పెంపు వంటివి టెలికం రంగం అవుట్‌లుక్‌ను మెరుగుపరిచేందుకు దోహదం చేస్తాయని భావిస్తున్నారు. ఇవన్నీ టెల్కోల ఫండ్‌రైజింగ్‌ ప్రణాళికలు విజయవంతమయ్యేందుకు సాయం చేయవచ్చని అభిప్రాయపడుతున్నారు. 



You may be interested

జీఎస్‌టీ కౌన్సిల్‌ పరిశీలనలో 66.79 లక్షల రిజిస్ట్రేషన్లు

Tuesday 24th December 2019

బిహార్‌ ఉప ముఖ్యమంత్రి సుశీల్‌కుమార్‌ మోదీ బెంగళూరు: పన్ను చెల్లింపుదారుల నుంచి వచ్చిన 66.79 లక్షల నూతన రిజిస్ట్రేషన్లు నకిలీవా లేక షెల్‌ కంపెనీలకు సంబంధించినవా అన్నది జీఎస్‌టీ కౌన్సిల్‌ పరిశీలిస్తోందని బిహార్‌ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి సుశీల్‌ కుమార్‌ మోదీ తెలిపారు. ఇంటెగ్రేటెడ్‌ జీఎస్‌టీకి సంబంధించి మంత్రుల బృందానికి ఆయన కన్వీనర్‌గా ఉన్న విషయం తెలిసిందే. ‘‘నూతన పన్ను చెల్లింపుదారులు (వీరి సంఖ్య 66.7 లక్షలు ఉంటుంది) 15 శాతమే

ప్రెస్టీజ్‌ ఎస్టేట్స్‌లో జీఐసీ పెట్టుబడులు

Tuesday 24th December 2019

 రూ.434 కోట్లు ఇన్వెస్ట్‌చేసిన సింగపూర్‌ వెల్త్‌ఫండ్‌  న్యూఢిల్లీ: బెంగళూరుకు చెందిన రియల్టీ కంపెనీ ప్రెస్టీజ్‌ ఎస్టేట్స్‌లో సింగపూర్‌కు చెందిన సావరిన్‌ వెల్త్‌ ఫండ్‌ జీఐసీ రూ.434 కోట్లు ఇన్వెస్ట్‌ చేయనున్నది. ఈ పెట్టుబడులకు గాను ప్రెస్టీజ్‌ ఎస్టేట్స్‌ కంపెనీ 1.34 కోట్ల ఈక్విటీ షేర్లను జీఐసీ అనుబంధ సంస్థ గామ్నాట్‌ పీటీఈ లిమిటెడ్‌కుకి జారీ చేయనున్నది. ఒక్కో షేర్‌ను రూ.323 ధరకు జారీ చేస్తామని, ఈ షేర్ల జారీకి డైరెక్టర్ల బోర్డ్‌

Most from this category