News


చిన్న వ్యాపారం.. తక్కువ అనుమతులు!

Thursday 20th June 2019
news_main1561027496.png-26453

కిరాణా, తినుబండార షాపులు పెట్టుకోడానికి  తీసుకోవలసిన అనుమతులను తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఏకగవక్షా విధానాన్ని అమలు చేసి చిన్న వ్యాపారాలకు తొందరగా అనుమతులు లభించే విధంగా చర్యలు చేపట్టనుంది. సింగపూర్‌, చైనా వంటి దేశాలలో రెస్టారెంట్‌ ప్రారంభించడానికి కేవలం నాలుగు అనుమతులు తీసుకుంటే చాలు. కాగా ఇండియాలో ప్రస్తుతం రెస్టారెంట్‌కు ప్రారంభించడానికి 17, కిరాణా షాపును ప్రారంభించడానికి 28 అనుమతులు తీసుకోవలసి ఉంది. రెస్టారెంట్‌ను నిర్వహించేవాళ్లు ఫైర్‌, వాణిజ్య ప్రకటనలు ప్రదర్శించుకోడానికి నో-అబ్జెక్సన్‌ సర్టిఫికేట్‌, మూజిక్‌ను ఫ్లే చేయడానికి లైసెన్స్‌లు  ఆహార నియంత్రణ సంస్థ నుంచి ఖచ్చితంగా తీసుకోవాలి. 
       చిన్న వ్యాపారాలు నిర్వహించడానికి అడ్డంకిగా ఉన్న లైసెన్స్‌  పునరుద్ధరణను తొలగించాలని ప్రమోషన్‌ ఇండస్ట్రీ, ఇంటర్నల్‌ ట్రేడ్‌(డీపీఐఐటీ) మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. తాజాగా కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పియూష్‌ గోయల్‌తో చిన్న వ్యాపారాల ప్రతి నిధులు కలిసినప్పుడు ఈ విషయాన్ని ప్రస్తావనకు తీసుకొచ్చారు.   అధికంగా ఉద్యోగాలను కల్పించి తక్కువ పెట్టుబడులు అవసరమయ్యే రంగాలలోని వ్యాపారాలకు అనుమతులను తగ్గించడానికి డీపీఐఐటీ ప్రయత్నాలు చేస్తుంది. ‘రెస్టారెంట్‌ యజమానులకు ఈ నియమాలు అవరోధాలుగా  ఉన్నాయి.  రెస్టారెంట్‌ నడపాలంటే ప్రతి మున్సిపాలిటీ వివిధ రకాల నియమాలను విధిస్తోంది. దేశం మొత్తం మీద ఒకే రకమైన నిబంధనలు ఉండి డిజిటల్‌ తరహాలో వ్యాపారాలు చేసుకోడానికి కుదరదా? ’ అని నేషనల్‌ రెస్టారెంట్‌ అసోషియేషన్‌(ఎన్‌ఆర్‌ఏఐ) ప్రెసిడెంట్‌  రాహుల్‌ సింగ్‌ అన్నారు. 



You may be interested

ఎంఅండ్‌ఎం ఫైనాన్స్‌కు కొత్త భాగస్వామి!

Friday 21st June 2019

మహింద్రా అండ్‌ మహింద్రా ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ తన అస్సెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ (ఏఎంసీ/మ్యూచువల్‌ ఫండ్స్‌ సేవల సంస్థ) కోసం విదేశీ వ్యాపార భాగస్వామిని ఎంపిక చేసుకుందని సమాచారం. సంబంధిత భాగస్వామి ఇండోనేషియాకు చెందిన కంపెనీ అని, ఈ నిర్ణయాన్ని శుక్రవారం మీడియా ముఖంగా కంపెనీ ప్రకటించనున్నట్టు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వర్గాలు తెలిపాయి.    మహింద్రా మ్యూచువల్‌ ఫండ్‌ నిర్వహణలో ఆస్తులు ఈ ఏడాది మార్చి నాటికి రూ.4,748 కోట్లుగా ఉన్నాయి.

జూలైలో ఫెడ్‌ రేట్‌ కట్‌?!

Thursday 20th June 2019

 గోల్డ్‌మన్‌ సాక్స్‌ అంచనా యూఎస్‌ ఫెడరల్‌ బ్యాంకు వచ్చే జూలై, సెప్టెంబర్‌లో వడ్డీరేట్లను తగ్గిస్తుందని గోల్డ్‌మన్‌సాక్స్‌ అనలిస్టులు తాజాగా అంచనాలు వేస్తున్నారు. నిజానికి గత అంచనాల్లో జూన్‌16నే ఫెడ్‌ రేట్‌ కట్‌ ఉంటుందని సంస్థ అభిప్రాయపడింది. అయితే తాజాగా తన అంచనాలను పునఃసమీక్షించుకుంది. ఫెడ్‌తో నేరుగా డీల్‌ చేసే 24 ప్రైమరీ డీలర్లలో గోల్డ్‌మన్‌ సాక్స్‌ ఒకటి. ఇతర నిపుణులు మాత్రం ఈ ఏడాది చివరకు మూడు సార్లు రేట్ల తగ్గింపు

Most from this category