కాంట్రాక్టు తయారీలో 100% ఎఫ్‌డీఐలు
By Sakshi

న్యూఢిల్లీ: కాంట్రాక్ట్ తయారీ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (ఎఫ్‌డీఐ) ఆకర్షించేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ఈ రంగంలో 100 శాతం ఎఫ్‌డీఐలను అనుమతించే ప్రతిపాదనపై కసరత్తు చేస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం తయారీ రంగంలో ఆటోమేటిక్ మార్గంలో 100 శాతం ఎఫ్‌డీఐలకు అనుమతులు ఉన్నాయి. భారత్‌లో తయారైన ఉత్పత్తులను హోల్‌సేల్, రిటైల్ మార్గాల్లో ప్రభుత్వ అనుమతుల అవసరం లేకుండా తయారీదారు విక్రయించుకునేందుకు ఇది వెసులుబాటు కల్పిస్తోంది. అయితే ఇందులో కాంట్రాక్ట్ ప్రాతిపాదికన ఇతర సంస్థలకు ఉత్పత్తులు తయారు చేసి ఇచ్చే సంస్థల గురించి స్పష్టత లేదు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా బడా టెక్నాలజీ కంపెనీలు ఇలా కాంట్రాక్టు తయారీపైనే ఆధారపడుతున్న నేపథ్యంలో దీనిపై స్పష్టతనివ్వాల్సిన పరిస్థితి ఏర్పడిందని, ప్రభుత్వం ఈ అంశాన్ని సానుకూలంగా పరిశీలిస్తోందని సంబంధిత వర్గాలు వివరించాయి. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ ఈ ప్రతిపాదనపై కసరత్తు చేస్తోందని, త్వరలోనే ఖరారు చేసి కేంద్ర క్యాబినెట్ ఆమోదానికి పంపనుందని పేర్కొన్నాయి. ఒకవేళ ఈ ప్రతిపాదనకు గానీ ఆమోదం లభిస్తే తయారీ రంగానికి మరింత ఊతం లభించగలదని కన్సల్టెన్సీ సంస్థ డెలాయిట్ ఇండియా పార్ట్నర్ రజత్ వాహి అభిప్రాయపడ్డారు. "యాపిల్ వంటి టెక్నాలజీ సంస్థలకు ఇది ఉపయోగకరంగా ఉంటుంది" అని ఆయన చెప్పారు.
You may be interested
దివీస్ సీఎండీ వేతనం రూ.58.8 కోట్లు
Monday 12th August 2019హైదరాబాద్: గత ఆర్థిక సంవత్సరంలో భారత ఔషధ రంగంలో అత్యధికంగా రూ.58.8 కోట్ల వేతనం అందుకున్న వ్యక్తిగా దివీస్ ల్యాబొరేటరీస్ సీఎండీ మురళి కె దివి నిలిచారు. ఇదే కంపెనీకి చెందిన ఈడీ ఎన్వీ రమణ రూ.30 కోట్లు, హోల్ టైం డైరెక్టర్ కిరణ్ ఎస్ దివి రూ.20 కోట్లు వేతనం పొందారు. సిప్లా ఎండీ ఉమాంగ్ వోరా రూ.15.03 కోట్లు, అరబిందో ఎండీ ఎన్.గోవిందరాజన్ రూ.14.6 కోట్లు, డాక్టర్
వంట నూనెను బయోడీజిల్‌గా మార్చే పథకం ఆరంభం
Monday 12th August 2019న్యూఢిల్లీ: వాడేసిన వంటనూనె నుంచి ఉత్పత్తి చేసిన బయోడీజిల్‌ను కొనుగోలు చేసే పథకాన్ని ప్రభుత్వరంగ ఇండియన్ ఆయిల్, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్ ప్రారంభించాయి. ప్రపంచ బయోడీజిల్ దినోత్సవ సందర్భంగా పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ అధికారికంగా ప్రారంభించిన ఈ పథకం కింద... 100 పట్టణాల్లో వినియోగించిన మిగిలిన వంట నూనె నుంచి బయోడీజిల్ ఉత్పత్తి చేసే ప్లాంట్ల ఏర్పాటుకు ఆసక్తి కలిగిన వారి నుంచి దరఖాస్తులను ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఆహ్వానించనున్నాయి.