News


ప్రత్యేక సంస్థగా పోస్టల్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌?

Friday 15th November 2019
news_main1573788421.png-29600

అధ్యయనం చేస్తున్న తపాలా శాఖ కోల్‌కతా: భారతీయ తపాలా శాఖ తన బీమా వ్యాపార విభాగం ‘పోస్టల్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌’ను (పీఎల్‌ఐ) ప్రత్యేక సంస్థగా ఏర్పాటు చేసే ప్రతిపాదనను సీరియస్‌గా పరిశీలిస్తోంది. ఈ విషయాన్ని పశ్చిమబెంగాల్‌ సర్కిల్‌ చీఫ్‌ పోస్ట్‌మాస్టర్‌ జనరల్‌ గౌతమ్‌ భట్టాచార్య గురువారం కోల్‌కతాలో మీడియాకు చెప్పారు. పీఎల్‌ఐ పథకాలు గతంలో ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులకే పరిమితం కాగా, ఇప్పుడు లిస్టెడ్‌ కార్పొరేట్‌ సంస్థలు, వృత్తి నిపుణులు సైతం వీటిని తీసుకునే అవకాశం కల్పించినట్టు చెప్పారు. పీఎల్‌ఐ మార్కెట్‌ వాటా 3 శాతంగా ఉండగా, పాలసీదారులకు బోనస్‌ మాత్రం ఇతర బీమా సంస్థలతో పోలిస్తే అధికంగా ఇస్తోంది. కమిషన్‌ చెల్లింపులు తక్కువగా ఉండడంతోపాటు నిర్వహణ వ్యయాలు కూడా తక్కువగా ఉండడమే అధిక బోనస్‌ చెల్లింపులకు కారణమని భట్టాచార్య తెలిపారు. ప్రస్తుతం తలాపాశాఖ ఆదాయంలో 60 శాతం సేవింగ్స్‌ పథకాల ద్వారానే వస్తోందని, పార్సెల్‌ మెయిల్స్‌ నుంచి వచ్చే ఆదాయన్ని పెంచుకోవడంపై దృష్టి పెట్టామని చెప్పారు.  



You may be interested

ఉద్యోగంలో సంతృప్తి.. కానీ, వేతనంపైనే..

Friday 15th November 2019

మాన్‌స్టర్‌ వేతన సూచీలో ఆసక్తికర విషయాలు ముంబై: వేతన జీవులు తాము చేస్తున్న ఉద్యోగం పట్ల సంతృప్తికరంగానే ఉన్నప్పటికీ, తాము పొందుతున్న వేతనం విషయంలో మాత్రం అంత సంతోషంగా లేరని ‘మాన్‌స్టర్‌ వేతన సూచీ’ నివేదిక పేర్కొంది. తాము చేస్తున్న ఉద్యోగం పట్ల 75 శాతం మంది సంతృప్తికరంగా ఉన్నారు. కానీ, చెల్లింపుల పట్ల సంతోషం కనిష్ట స్థాయికి చేరిందని, 21.6 శాతం తగ్గిందని ఈ నివేదిక తెలిపింది. 2016

నాట్కో వైజాగ్‌ ప్లాంట్‌లో ఉత్పత్తి ప్రారంభం

Friday 15th November 2019

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: నాట్కో ఫార్మా విశాఖపట్నలోని ప్లాంట్‌లో వాణిజ్య కార్యకలాపాలను ప్రారంభించింది. ప్లాంట్‌ సామర్థ్య విస్తరణలో ఇది అత్యంత కీలకమని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. అమెరికా, ఇతర అంతర్జాతీయ మార్కెట్‌ అవసరాలను తీర్చడానికి ఈ ప్లాంట్‌ను విస్తరించామని పేర్కొంది. ఈ ప్లాంట్‌ నుంచి ప్రధానంగా ట్యాబ్లెట్స్, క్యాప్సూల్స్‌లతో పాటూ అంకాలజీ విభాగంలో సైటోటాక్సిక్‌ బ్లాక్స్‌ను ఉత్పత్తి చేస్తామని తెలిపారు. సైట్‌ బదిలీ, రెగ్యులేటరీ ఆడిట్‌ కోసం ఇప్పటికే

Most from this category