News


త్వరలో పెట్రో, డీజిల్‌ బాదుడు..!?

Tuesday 24th December 2019
news_main1577178897.png-30409

వాహన వినియోగదారులపై త్వరలో పెట్రో, డీజిల్‌ ధరల భారం పిడుగుపడుతుందా.!? అవుననే అంటున్నాను వార్తాసంస్థల కథనాలు. బీఎస్‌-VI నిబంధనలకు అనుగుణమైన ఇంధనం ఉత్పత్తికి అయ్యే వ్యయాలను భరించేందుకు ఆయిల్‌ కంపెనీలకు ఐదేళ్ల కాలానికి పెట్రోల్, డీజిల్ రిటైల్ ధరలను పెంచుకునే ప్రతిపాదనను కేంద్రం పరిశీలిస్తున్నది.  ఒ‍కవేళ ఈ ప్రతిపాదనకు కేంద్రం ఆమోదం తెలిపితే.., లీటరు పెట్రోల్‌ ధర రూ.0.80పైసలు, లీటరు డీజిల్‌పై రూ.1.50పైసల భారాన్ని వినియోగదారులు భరించాల్సి ఉంటుందని ఏఎన్‌ఐ వార్తా సంస్థ ఒక కథనాన్ని వెలువరించింది. బీఎస్-VI వాహన ప్రమాణాలకు అనుగుణంగా ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు రీఫైనరీలను అప్‌గ్రేడ్‌ చేసేందుకు పెద్ద మొత్తం పెట్టుబడులు పెట్టాయి. ఇప్పుడు సొమ్మును తిరిగి పొందేందుకు ఆటో ఇంధనాలపై ప్రీమియం వసూలు చేయడానికి అనుమతి కోరుతూ పెట్రోలియం మంత్రిత్వ శాఖకు విజ్ఞప్తి చేశాయి.  ఏదిఏమైనప్పటికీ.., పెట్రోల్, డీజిల్ ధరలు ప్రతి రోజు మారుతూ వస్తుంటాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరల ప్రాతిపదికన ఇంధన రిటైల్ కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను సవరిస్తూ వస్తుంటాయి. వచ్చే ఏడాది ఏప్రిల్‌ నాటికి దేశవ్యాప్తంగా బీఎస్-VI వాహనాలను మార్కెట్‌లోకి తీసుకురావాలని సుప్రీం కోర్టు కేంద్రానికి ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. 



You may be interested

డిష్‌మ్యాన్‌ పతనం- స్టెర్లింగ్‌ టూల్స్‌ జూమ్‌

Tuesday 24th December 2019

కుప్పకూలిన డిష్‌మ్యాన్‌ కార్బొజెన్‌ స్టెర్లింగ్‌ టూల్స్‌ లాభాల హైజంప్‌ ఆదాయపన్ను శాఖ సోదాల నేపథ్యంలో ఫార్మా కంపెనీ డిష్‌మ్యాన్‌ కార్బొజెన్‌ ఎమిక్స్‌ కౌంటర్లో అమ్మకాలు కొనసాగుతున్నాయి. ఈ కౌంటర్లో వరుసగా మూడో రోజు అమ్మకాలు ఊపందుకున్నాయి. కాగా.. మరోవైపు చైనీస్‌ కంపెనీతో భాగస్వామ్య సంస్థ(జేవీ)ను నెలకొల్పేందుకు ఒప్పందం కుదుర్చుకున్న వార్తలతో ఆటో విడిభాగాల కంపెనీ స్టెర్లింగ్‌ టూల్స్‌ కౌంటర్‌కు భారీ డిమాండ్‌ కనిపిస్తోంది. వివరాలు చూద్దాం..  డిష్‌మ్యాన్‌ కార్బొజెన్‌ కంపెనీ కార్యాలయాలలో ఈ నెల 19న ఆదాయపన్ను శాఖ

విస్తృత ర్యాలీ కొనసాగుతుంది!

Tuesday 24th December 2019

ఎమ్‌కే ఇన్వెస్ట్‌మెంట్‌ మేనేజర్‌ సచిన్‌ షా ప్రభుత్వం తీసుకువస్తున్న సంస్కరణలు దేశీయ వినిమయ రంగంలో వృద్దిని ఊపందుకునేలా చేస్తాయని, దీంతో అన్ని రంగాల్లో పునరుజ్జీవం కనిపిస్తుందని ఎమ్‌కే ఇన్వెస్ట్‌మెంట్‌ మేనేజర్‌ సచిన్‌ షా ఆశాభావం వ్యక్తం చేశారు. దీంతో వచ్చే ఏడాది మార్కెట్‌ ర్యాలీ విస్తృతమవుతుందని అంచనా వేశారు. చిన్న, మధ్యతరహా స్టాకుల్లో అప్‌ట్రెండ్‌ ఆరంభమవుతుందన్నారు. వీటిలో మంచి మేనేజ్‌మెంట్‌ ఉన్న నాణ్యమైన కంపెనీల షేర్లు ఇతరాల కన్నా ముందంజలో ఉంటాయని,

Most from this category