News


ఎయిరిండియా విక్రయానికి త్వరలో బిడ్లు

Monday 21st October 2019
news_main1571631006.png-29019

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియాలో 100 శాతం వాటాల విక్రయానికి బిడ్లు ఆహ్వానించడంపై  కేంద్రం కసరత్తు చేస్తోంది. ఇందుకు సంబంధించిన ఆసక్తి వ్యక్తీకరణ పత్రానికి (ఈవోఐ) తుది మెరుగులు దిద్దుతోంది. ఈ నెలాఖరులో లేదా వచ్చే నెలలో గానీ ప్రాథమికంగా బిడ్లు ఆహ్వానించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి.  ఇప్పటికే కొన్ని సంస్థలు ఎయిరిండియాపై ఆసక్తి కూడా వ్యక్తీకరించినట్లు వివరించాయి. కొత్తగా అభివృద్ధి చేసిన ఈ-బిడ్డింగ్ వ్యవస్థ ద్వారా బిడ్డింగ్ ప్రక్రియ నిర్వహించవచ్చని పేర్కొన్నాయి. ఎయిరిండియా దాదాపు రూ. 58,000 కోట్ల మేర రుణభారంతో పాటు భారీ నష్టాలతో కుదేలవుతోంది. ఈ నేపథ్యంలోనే ఎయిరిండియాను విక్రయించాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీనిపై గత వారమే పౌర విమానయాన శాఖ కార్యదర్శి ప్రదీప్ సింగ్ ఖరోలా.. ఎయిరిండియా యాజమాన్యంతో సమీక్ష సమావేశం నిర్వహించారు. పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు పోతాయన్న ఆందోళనతో విక్రయాన్ని వ్యతిరేకిస్తున్న కార్మిక సంఘాలతో ఎయిరిండియా యాజమాన్యం కూడా ఇటీవలే చర్చలు జరిపింది. మరోవైపు, విక్రయం కొనసాగించే దిశగా గత ఆర్థిక సంవత్సరం లెక్కలను అధికారికంగా ఆమోదించేందుకు అక్టోబర్ 22న ఎయిరిండియా బోర్డు సమావేశం కానుంది. 



You may be interested

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ లాభం రూ.6,638 కోట్లు

Monday 21st October 2019

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ లాభం రూ.6,638 కోట్లు 25 శాతం వృద్ధి  రూ.36,131 కోట్లకు మొత్తం ఆదాయం  స్వల్పంగా పెరిగిన మొండి బకాయిలు  న్యూఢిల్లీ: ప్రైవేట్‌ రంగ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌ క్వార్టర్‌లో రూ.6,638 కోట్ల నికర లాభం సాధించింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ2లో ఆర్జించిన నికర లాభం, రూ. 5,322 కోట్లుతో పోల్చితే 25 శాతం వృద్ధి సాధించామని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ తెలిపింది. నికర వడ్డీ ఆదాయం 15 శాతం

39,440 పైన ర్యాలీ కొనసాగింపు

Monday 21st October 2019

అమెరికా–చైనాల మధ్య ట్రేడ్‌డీల్‌ కుదరడం, ఇప్పటివరకూ  వచ్చిన  కార్పొరేట్‌ ఫలితాలు ఇన్వెస్టర్ల అంచనాలకు తగినట్లే వుండటం, యూరోపియన్‌ యూనియన్‌తో బ్రెగ్జిట్‌ డీల్‌ కుదిరిందంటూ బ్రిటన్‌ ప్రధాని వెల్లడించడం వంటి సానుకూల అంశాల నడుమ గతవారం భారత్‌ స్టాక్‌ సూచీలు 3 శాతం వరకూ ర్యాలీ జరిపాయి. చాలా నెలల తర్వాత అటు విదేశీ ఇన్వెస్టర్లు, ఇటు దేశీయ ఫండ్స్‌ కొనుగోళ్లు జరపడం విశేషం. ముఖ్యంగా విదేశీ ఇన్వెస్టర్లు గత ఐదు

Most from this category