News


పీఎస్‌యూ బ్యాంకులకు రూ.30,000 కోట్లు!

Monday 17th June 2019
news_main1560749380.png-26339

  • బడ్జెట్‌లో ప్రకటించే అవకాశం

న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ (పీఎస్‌యూ) బ్యాంకుల అవసరాలు ఏ మేరకు అన్న విషయంపై కేంద్ర ఆర్థిక శాఖ కసరత్తు చేస్తోంది. జూలై 5న ప్రకటించే పూర్తి స్థాయి బడ్జెట్‌లో పీఎస్‌యూ బ్యాంకులకు రూ.30,000 కోట్ల నిధుల సాయాన్ని ప్రకటించే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపిన సమాచారం. దీనివల్ల ఆయా బ్యాంకుల కనీస మూలధన అవసరాలు తీరతాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ 2019-20 ఆర్థిక సంవత్సరానికి పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఒకవేళ బ్యాంకుల మధ్య మరో విలీన నిర్ణయం కనుక ఉంటే అదనపు నిధులు అవసరమవుతాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. దేనా, విజయాబ్యాంకులను బీవోబీ  విలీనం చేసుకోవడం వల్ల చేరుకోవాల్సిన అదనపు మూలధన అవసరాల కోసం కేంద్రం రూ.5,042 కోట్లను ఇచ్చిన విషయం తెలిసిందే. 2018-19 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వరంగ బ్యాంకులకు కేంద్రం భారీగా రూ.1,06,000 కోట్ల నిధుల సాయాన్ని అందించడం గమనార్హం. ఎన్‌పీఏలకు కేటాయింపులు అధికంగా చేయడం కారణంగా సమస్యలను ఎదుర్కొంటున్న బ్యాంకులు ప్రభుత్వ నిధులతో ఊపిరిపీల్చుకున్నాయి.

డెవలపర్లకు బ్యాంకులు నిధులందించాలి: క్రెడాయ్‌
అందుబాటు ధరల గృహ ప్రాజెక్టులకు భూమిని కొనుగోలు చేసేందుకు బ్యాంకులు రియల్టర్లకు నిధుల సాయాన్ని అందించాలని క్రెడాయ్‌ డిమాండ్‌ చేసింది. అన్ని చట్టాల్లోనూ అందుబాటు ధరల దృహాలకు ఒకటే నిర్వచనం ఉండేలా చూడాలని బడ్జెట్‌ ముందస్తు ప్రతిపాదనల్లో భాగంగా సూచించింది. 



You may be interested

పెద్ద టీవీల విక్రయాలకు క్రికెట్‌ జోష్‌..

Monday 17th June 2019

100 శాతం పెరిగిన అమ్మకాలు మెట్రోలతో పాటు చిన్న పట్టణాల్లోనూ భారీ విక్రయాలు ధర రూ. 50 వేల పైనే న్యూఢిల్లీ: క్రికెట్‌ వరల్డ్‌ కప్‌ మ్యాచ్‌లు వర్షాల దెబ్బతో అభిమానులను నిరాశపరుస్తున్నా.. టీవీల అమ్మకాలకు మాత్రం బాగానే ఉపయోగపడుతున్నాయి. క్రికెట్‌ వరల్డ్‌ కప్‌ పుణ్యమాని పెద్ద టీవీల అమ్మకాలు మాత్రం భారీగా పెరుగుతున్నాయి. క్రికెట్‌ అభిమానులు భారీ స్క్రీన్‌లపై మ్యాచ్‌లను చూసేందుకు ఆసక్తి కనపరుస్తుండటమే ఇందుకు కారణం. గతేడాది ఇదే వ్యవధితో పోలిస్తే

ఈ ఏడాది క్యాపెక్స్‌ రూ.1,400 కోట్లు:అరబిందో

Monday 17th June 2019

హైదరాబాద్‌: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మూలధన వ్యయం సుమారు రూ.1,400 కోట్లు ఉంటుందని ఔషధ సంస్థ అరబిందో ఫార్మా వెల్లడించింది. అలాగే టర్నోవర్‌లో పరిశోధన, అభివృద్ధికి చేసే వ్యయం 5-6 శాతం ఉండొచ్చని కంపెనీ ఎండీ ఎన్‌.గోవిందరాజన్‌ తెలిపారు. మూలధన వ్యయంలో ఎక్కువ మొత్తం ఫినిష్డ్‌ డోసేజెస్‌, ఏపీఐల తయారీ సామర్థ్యం పెంపు కోసం వినియోగిస్తామన్నారు. బయోసిమిలర్లకు సంబంధించి రెండు మూడింటికి ఫేజ్‌-1, ఒకదానికి ఫేజ్‌-3 ప్రారంభిస్తామని చెప్పారు. అరబిందో

Most from this category