STOCKS

News


బీపీసీఎల్‌, కాంకర్‌ విక్రయానికి బిడ్లకు ఆహ్వానం

Saturday 23rd November 2019
news_main1574481240.png-29802

న్యూఢిల్లీ: ప్రభుత్వరంగంలోని బీపీసీఎల్‌, కంటెయినర్‌ కార్పొరేషన్‌ (కాంకర్‌)లో వ్యూహాత్మక వాటాల విక్రయానికి సంబంధించి పెట్టుబడులు, ప్రజా ఆస్తుల విభాగం (దీపమ్‌) ఆసక్తి కలిగిన సంస్థల నుంచి ప్రతిపాదనలకు ఆహ్వానం పలికింది. బీపీసీఎల్‌లో ప్రభుత్వం పూర్తి వాటాను విక్రయించనుండగా, కాంకర్‌లో మాత్రం 24 శాతం మేర వాటాను తన వద్దే అట్టిపెట్టుకుని మిగిలిన వాటాను, యాజమాన్య నియంత్రణను ప్రైవేటు సంస్థకు కట్టబెట్టనుంది. బీపీసీఎల్‌కు అసోంలో ఉన్న నుమాలిగఢ్‌ రిఫైనరీని మాత్రం ప్రభుత్వరంగ సంస్థకే విక్రయించాలని కేంద్ర కేబినెట్‌ రెండు రోజుల క్రితం నిర్ణయించిన విషయం తెలిసిందే. దీంతో నుమాలిగఢ్‌ రిఫైనరీకి సైతం బిడ్లను ఆహ్వానించింది. ప్రభుత్వరంగంలోని ఐవోసీ లేదా ఆయిల్‌ ఇండియా ఆసక్తి వ్యక్తీకరించే అవకాశం ఉన్నట్టు సమాచారం. 



You may be interested

జీవితకాల గరిష్టస్థాయికి ఫారెక్స్ నిల్వలు

Saturday 23rd November 2019

448.2 బిలియన్ డాలర్లుగా నమోదు ముంబై: విదేశీ మారక నిల్వలు (ఫారెక్స్ రిజర్వ్స్) జీవితకాల గరిష్టస్థాయికి చేరాయి. ఆర్‌బీఐ తాజాగా వెల్లడించిన సమాచారం ప్రకారం.. ఈఏడాది నవంబర్‌ 15తో ముగిసిన వారంలో 441 మిలియన్‌ డాలర్ల పెరుగుదలతో 448.249 బిలియన్ డాలర్లకు ఎగశాయి. జీవితకాల గరిష్ట స్థాయిని తిరగరాశాయి. అంతక్రితం వారం 1.71 బిలియన్‌ డాలర్లు పెరిగి 447.808 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి. ఇక తాజా వారంలో.. మొత్తం మారక నిల్వల్లో

భారత రాజకీయాలపై ఆర్థిక అభద్రతా ప్రభావం

Saturday 23rd November 2019

యువత నిరుద్యోగ సమస్యపై ఈఐయూ విశ్లేషణ న్యూఢిల్లీ: భారత్‌ యువతలో ఆర్థిక అభద్రతాభావం నెలకొందనీ, దేశ రాజకీయాలపై దీని ప్రభావం పెరుగుతోందని ఎకనమిస్ట్‌ ఇంటిలిజెన్స్‌ యూనిట్‌ (ఈఐయూ) పరిశోధనా నివేదిక ఒకటి పేర్కొంది. దేశాభివృద్ధిలో మందగమన ధోరణులు, నిరుద్యోగ సమస్యలను నివేదిక ఈ సందర్భంగా ప్రస్తావించింది. భారత్‌ నిరుద్యోగ సమస్య దేశ రాజకీయాలతో విడదీయరాని అంశంగా రూపొందుతోందని నివేదిక పేర్కొంది, ఒక రకంగా చెప్పాలంటే యువత ఆర్థిక అభద్రతాభావమే దేశ రాజకీయాలకు

Most from this category