News


ఎయిరిండియా వాటా విక్రయానికి సిద్ధమైన కేంద్రం

Monday 27th January 2020
Markets_main1580120392.png-31242

తీవ్ర నష్టాలతో సంక్షోభంలో కూరుకుపోయిన ఎయిర్ ఇండియా సంస్థను అమ్మేందుకు కేంద్రం సిద్ధమైంది. సంస్థలో 100శాతం వాటా విక్రయానికి ఇన్వెస్టర్ల నుంచి ప్రభుత్వం సోమవారం ప్రిలిమినరీ బిడ్లను ఆహ్వానించింది. పెట్టుబడుల ఉపసంహరణలో భాగంగా ఈ నిర్ణయం తీసుకుని బిడ్లను ఆహ్వానించింది. ఎయిర్‌లైన్‌ వ్యాపారం నుంచి పూర్తిగా తప్పుకోవాలని భావిస్తుండటంతో కొనుగోలుదారులు లేవనెత్తే డిమాండ్లను అంగీకరించి విక్రయ ప్రక్రియను పూర్తిచేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. బిడ్డింగ్‌ ప్రక్రియలో భాగంగా కాంట్రాక్టులకు సంబంధించిన ఎలాంటి చట్టపరమైన, సాంకేతిక సమస్యలు తలెత్తకుండా ఆయా రంగాల్లో నిష్ణాతుడైన సలహాదారుడిని నియమించనుంది. "డేటా రూమ్" మరియు ఎస్‌పీఏ బిడ్డింగ్‌లను కోరుకునే సంస్థలు రూ .కోటి జమ చేయాల్సి ఉంటుంది. వాటాను కొనుగోలు చేసుకోవాల‌నుకునేవారు బిడ్డింగ్‌కు మార్చి 17వ తేదీ వ‌ర‌కు డెడ్‌లైన్ విధించారు.  

ఎయిర్‌ఇండియా ప్రస్తుతం రోజుకు నష్టంతో నడుస్తోంది. ఈ నష్టాన్ని పూడ్చడం కేంద్రానికి భారంగా మారింది. దీంతో అమ్మేయడం ద్వారా బయటపడాలని భావిస్తోంది. వాస్తవానికి  2018లో బిడ్‌ల‌కు ఆహ్వానం ప‌లికినా.. ఆ సంస్థలో వాటాను కొనేందుకు ఎవ‌రూ ముందుకు రాలేదు. సుమారు 76 శాతం వాటాను అమ్మాల‌ని ప్రయత్నించినప్పటికీ.. ఆ ప్రయత్నం స‌క్సెస్ కాలేదు. దీంతో ఎయిర్ ఇండియాలో నూరు శాతం వాటాను కేంద్రం అమ్మకానికి పెట్టింది. 

ఎయిర్‌ఇండియాను చేజిక్కించుకునేందుకు టాటా గ్రూప్‌, హిందూజాలు, ఇండిగో, స్పైస్‌జెట్‌ సహా కొన్ని ప్రైవేట్‌ ఈక్విటీ సంస్థలు పోటీ పడనున్నాయి. మరోవైపు దేశీ విమానయాన సంస్థలతో కలిసి కొన్ని విదేశీ ఎయిర్‌లైన్స్‌ కూడా సంయుక్త బిడ్ల ద్వారా బిడ్డింగ్‌ ప్రక్రియలో పాలుపంచుకుంటున్నాయి. తాను మంత్రిని కాకుంటే ఎయిర్ ఇండియాను తానే కొనుగోలు చేసేవాడినని కేంద్ర మంత్రి పీయూష్ గోయెల్ కామెంట్ చేసిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో సంస్థను ఎవరు దక్కించుకుంటారోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 



You may be interested

చైనాకు జలుబు- ప్రపంచ మార్కెట్లకు వణుకు

Monday 27th January 2020

సెన్సెక్స్‌ 458 పాయింట్లు పతనం 129 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ 2 శాతం పతనమైన యూరప్‌ మార్కెట్లు ఎన్‌ఎస్‌ఈలో ఫార్మా రంగం ఎదురీత అమెరికాకు జలుబు చేస్తే.. ప్రపంచ మార్కెట్లకు తుమ్ములొస్తాయన్నది స్టాక్‌ మార్కెట్లలో పాత సామెత. అయితే ప్రస్తుతం చైనాలోని మారుమూల వుహాన్‌లో పుట్టిన కరోనా వైరస్‌ ప్రపంచ మార్కెట్లను వణికిస్తోంది. వెరసి దేశీయంగానూ ఆందోళనకులోనైన ఇన్వెస్టర్లు తొలి నుంచీ అమ్మకాలకు ఎగబడ్డారు. ఫలితంగా మార్కెట్లు రోజంతా నష్టాలమధ్యే కదిలాయి. సెన్సెక్స్‌ 458 పాయింట్లు

మారుతీ సుజుకీ ఫలితాలు ఎలా ఉండొచ్చు?

Monday 27th January 2020

బ్రోకరేజ్‌ల అంచనాలు డిసెంబర్‌ త్రైమాసికంలో మారుతీ సుజుకీ ఇండియా రెండంకెల లాభాల వృద్ధి ప్రకటించవచ్చని బ్రోకరేజ్‌లు అంచనా వేస్తున్నాయి. అల్ప బేస్‌ ‍ప్రభావం, వాల్యూంల స్థిరీకరణతో లాభాలు పెరుగుతాయని అభిప్రాయపడుతున్నాయి. సరాసరి అమ్మక ధరల పెరుగుదల కంపెనీ ఆదాయాలను పెంచవచ్చని భావిస్తున్నాయి. మంగళవారం మారుతీ తన క్యు3 ఫలితాలు ప్రకటించనుంది. డిమాండ్‌ అవుట్‌లుక్‌పై అంచనాలు, పండుగ సీజన్‌ అనంతర ట్రెండ్స్‌ తదితరాలను ఫలితాల సందర్భంగా నిశితంగా పరిశీలించాలని అనలిస్టులు చెబుతున్నారు. ఎకానమీలో

Most from this category