News


బంగారు ఆభరణాలకు హాల్‌మార్కింగ్‌ తప్పనిసరి !

Wednesday 21st August 2019
Markets_main1566363098.png-27910

మళ్లీ వెలుగులోకి కేంద్రం ప్రతిపాదన 
-అందరితో చర్చించి నిర్ణయం తీసుకుంటాం 
-బీఐఎస్‌ డైరెక్టర్‌ జనరల్‌ వెల్లడి 

కోల్‌కత: బంగారు ఆభరణాలకు హాల్‌మార్కింగ్‌ను తప్పనిసరి చేయాలన్న తన ప్రతిపాదనను కేంద్రం మళ్లీ వెలుగులోకి తెచ్చింది.  ప్రపంచ వాణిజ్య సంస్థ(డబ్ల్యూటీఓ)నోటిఫై చేయడం కోసం వారం రోజుల్లోనే దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను  జారీ చేస్తామని బీఐఎస్‌(బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్డాండర్డ్స్‌) డైరెక్టర్‌ జనరల్‌ సురైనా రాజన్‌ పేర్కొన్నారు. దీనితో సంబంధమున్న ముఖ్యంగా పుత్తడి వర్తకులతో సంప్రదింపులు అనంతరమే ఈ ప్రక్రియ కార్యరూపం దాలుస్తుందని ఆమె వివరించారు. డబ్ల్యూటీఓలో భారత్‌ సభ్యదేశమైనందున ఎలాంటి తప్పనిసరి నిబంధన అయినా, డబ్ల్యూటీఓ నోటిఫై చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. గోల్డ్‌ హాల్‌మార్కింగ్‌కు సంబంధించి డిజిటైజేషన్‌ కార్యక్రమాన్ని ఐఐటీ-ముంబై అమలు చేస్తోందని, ఈ ప్రక్రియ పూర్తి కావడానికి ఏడాది పడుతుందని తెలిపారు. ఈ ప్రక్రియలో భాగంగా హాల్‌మార్కింగ్‌ సెంటర్లను బీఐఎస్‌ కంట్రోల్‌తో అనుసంధానం చేస్తామని, పూర్తి స్థాయిలో ఈ వ్యవస్థ సిద్దమైన తర్వాతనే హాల్‌మార్కింగ్‌ కోడ్‌ జనరేట్‌ అవుతుందని వివరించారు. ప్రస్తుతం దేశంలో 800 హాల్‌మార్కింగ్‌ సెంటర్లు ఉన్నాయని, మొత్తం బంగారు ఆభరణాల్లో 40 శాతానికి మాత్రమే హాల్‌మార్కింగ్‌ ఉందని తెలిపారు. 



You may be interested

క్లాసిక్‌ పోలో మరో 65 ఔట్‌లెట్లు

Wednesday 21st August 2019

గ్రూప్‌ టర్నోవర్‌ రూ.1,000 కోట్లు అంచనా నూతన కలెక్షన్‌ను ఆవిష్కరించిన కంపెనీ హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో:- రెడీమేడ్స్‌ తయారీలో ఉన్న రాయల్‌ క్లాసిక్‌ మిల్స్‌ ‘క్లాసిక్‌ పోలో’ ఫ్రాంచైజీ విధానంలో రిటైల్‌ ఔట్‌లెట్ల సంఖ్యను 200లకు చేర్చనుంది. ప్రస్తుతం సంస్థకు పలు రాష్ట్రాల్లో ఇటువంటి స్టోర్లు 135 ఉన్నాయి. వీటిలో అత్యధికం దక్షిణాదిన ఉన్నాయి. కొత్త కేంద్రాలు తూర్పు, పశ్చిమ భారత్‌లో రానున్నాయని క్లాసిక్‌ పోలో రిటైల్‌ డైరెక్టర్‌ రమేశ్‌ వి ఖేని

ఫిన్‌టెక్‌ కంపెనీల ‘కంటెంట్‌’ మంత్రం

Wednesday 21st August 2019

స్టాక్‌ మార్కెట్లు, ఫండ్స్‌పై విస్తృత సమాచారం చార్ట్‌లు, గ్రాఫ్‌లు, వీడియో, టెక్ట్స్‌ సందేశాలు అస్థిరతల సమయాల్లో నడుచుకోవడంపై అవగాహన పెట్టుబడుల అవకాశాల పట్ల సూచనలు తద్వారా ఇన్వెస్టర్లు దూరం కాకుండా చర్యలు న్యూఢిల్లీ: స్టాక్స్‌, మ్యూచువల్‌ ఫండ్స్‌ల్లో పెట్టుబడుల సేవలు అందిస్తున్న నవతరం ఫిన్‌టెక్‌ స్టార్టప్‌లు.. అల్లకల్లోల సమయాల్లో కస్టమర్లను కాపాడుకునేందుకు, వారు మార్కెట్లకు దూరంగా వెళ్లకుండా ఉండేందుకు పలు రకాల సేవలతో ఆకర్షించే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందులో ప్రత్యేకమైన కంటెంట్‌ కూడా ఒకటి. స్టాక్‌ మార్కెట్లు

Most from this category