News


హోం శాఖకు 1.19 లక్షల కోట్లు

Saturday 6th July 2019
news_main1562394791.png-26846

మౌలిక వసతుల కల్పన, ఆధునీకరణకు పెద్దపీట
కేంద్ర సాయుధ బలగాలకు రూ. 71 వేల కోట్లు
2021 జనగణన సన్నాహకాలకు రూ. 621 కోట్లు
న్యూఢిల్లీ: హోం మంత్రిత్వ శాఖకు మొత్తంగా రూ. 1,19,025 కోట్లను ఈ బడ్జెట్‌లో కేంద్రం కేటాయించింది. గత ఆర్థిక సంవత్సరపు బడ్జెట్‌తో పోలిస్తే ఇది రూ. 5,858 కోట్లు ఎక్కువ. మౌలిక వసతులను మెరుగుపర్చడం, పోలీసు వ్యవస్థను ఆధునీకరించడం, సరిహద్దు ప్రాంతాల్లో మెరుగైన రక్షణ కల్పించడంపై కేంద్రం ఎక్కువగా దృష్టిపెట్టింది. 2018-19 బడ్జెట్‌కు సంబంధించి సవరించిన అంచనా (రూ. 1,13,167 కోట్లు) కంటే 5.17 శాతం ఎక్కువగా ఈ సారి హోం శాఖకు నిధులు అందనున్నాయి. దేశ రాజధానిలో చట్టాన్ని అమలు చేసే ఢిల్లీ పోలీసు విభాగానికి రూ. 7,496.91 కోట్లను కేంద్రం కేటాయించింది. ఇండో-పాక్‌, ఇండో-చైనా సహా అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి మౌలిక వసతుల అభివృద్ధి కోసం రూ. 2,129 కోట్లను ఖర్చు చేయనున్నట్లు బడ్జెట్‌లో తెలిపింది. నక్సల్‌, ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొనటంతోపాటు అవసరమైనప్పుడు ఇతర విధులను కూడా నిర్వర్తించే సీఆర్‌పీఎఫ్‌కు తాజా బడ్జెట్‌లో రూ. 23,963.66 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. ఇండో-పాక్‌, ఇండో-బంగ్లాదేశ్‌ సరిహద్దుల్లో కాపలాకాసే సరిహద్దు భద్రతా దళం (బీఎస్‌ఎఫ్‌)కు రూ. 19,650.74 కోట్ల నిధులను కేంద్రం అందించనుంది. మొత్తంగా అన్ని కేంద్ర సాయుధ పోలీసు బలగాలకు (సీఆర్‌పీఎఫ్‌, బీఎస్‌ఎఫ్‌, ఐటీబీపీ, సీఐఎస్‌ఎఫ్‌, ఎస్‌ఎస్‌బీ, ఎన్‌ఎస్‌జీ, అస్సాం రైఫిల్స్‌) కలిపి మొత్తంగా రూ. 71,713.9 కోట్లను కేంద్రం కేటాయించింది. 2018-19 బడ్జెట్‌లో ఈ మొత్తం రూ. 67,779.75 కోట్లు మాత్రమే. దేశం లోపల నిఘా కోసం పనిచేసే నిఘా విభాగం (ఐబీ)కి ప్రస్తుత బడ్జెట్‌లో రూ. 2,384.1 కోట్లు ఇచ్చారు. ప్రధాని, మాజీ ప్రధానులు, వారి కుటుంబీకులకు రక్షణ కల్పించే ప్రత్యేక రక్షణ దళం (ఎస్పీజీ)కు రూ. 535.45 కోట్లను కేటాయించారు.

మౌలిక వసతులకు 4 వేల కోట్లు...
బ్యారక్‌లు, నివాస గృహాల నిర్మాణం, ఆధునిక వాహనాలు, ఆయుధాల కొనుగోలు తదితరాల వంటి మౌలిక వసతుల కోసం రూ. 4,757 కోట్లను కేంద్రం ఈ బడ్జెట్‌లో కేటాయించింది. పోలీసు దళాల ఆధునీకరణకు రూ. 3,462 కోట్లు, సరిహద్దు ప్రాంతాల అభివృద్ధికి రూ. 825 కోట్లు, జమ్మూ కశ్మీర్‌లో వలసదారులు, ఇంకా వలస వెళ్లి మళ్లీ వెనక్కు వచ్చిన వారికి పునరావాసం కోసం రూ. 842 కోట్లు, స్వాతంత్ర్య సమరయోధుల పింఛన్‌ కోసం రూ. 953 కోట్లను బడ్జెట్‌లో కేంద్రం కేటాయించింది. నిర్భయ నిధి కోసం రూ. 50 కోట్లను, జాతీయ తుపాను ప్రమాద తగ్గింపు ప్రాజెక్టు కోసం రూ. 296 కోట్లను అందించనుంది. 2021 జనగణనకు సన్నాహక ఏర్పాట్లు ఇప్పటికే ప్రారంభమవడంతో జనగణన, సర్వే, గణాంకాల నమోదు కోసం రిజిస్ట్రార్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియాకు రూ. 621.33 కోట్లను కేంద్రం కేటాయించింది. హిందీ భాష వ్యాప్తి కోసం రూ. 78.09 కోట్లను, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు గ్రాంట్ల రూపంలో రూ. 4,895 కోట్లను కేంద్రం ఖర్చు చేయనుంది. ఢిల్లీ, పుదచ్చేరి మినహా మిగిలిన కేంద్ర పాలిత ప్రాంతాలకు అదనంగా కూడా నిధులను ప్రభుత్వం కేటాయించింది. 



You may be interested

ఎఫ్‌డీఐ ఇక రయ్‌రయ్‌!

Saturday 6th July 2019

మీడియా, ఏవియేషన్‌, బీమా, సింగిల్‌ బ్రాండ్ రిటైల్‌లో వెసులుబాటు విదేశీ పెట్టుబడుల ఆకర్షణకు ప్రతిపాదనలు న్యూఢిల్లీ: బీమా, మీడియా, ఏవియేషన్‌, సింగిల్‌ బ్రాండ్ రిటైల్‌ రంగంలో మరిన్ని విదేశీ పెట్టుబడులు ఆకర్షించే దిశగా కేంద్రం బడ్జెట్‌లో చర్యలు ప్రతిపాదించింది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) నిబంధనలను సడలించనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. 2018-19లో ఎఫ్‌డీఐలు 6 శాతం వృద్ధితో 64.37 బిలియన్ డాలర్లకు పెరిగినట్లు ఆమె వివరించారు. "భారత్‌ను

పరిశోధనల పాఠశాల

Saturday 6th July 2019

నూతన విద్యా విధానానికి కేంద్రం శ్రీకారం జాతీయ పరిశోధన ఫౌండేషన్‌ ఏర్పాటుకు ప్రతిపాదన విద్యా రంగానికి రూ. 94,853.64 కోట్లు కేటాయింపు ప్రపంచస్థాయి విద్యాసంస్థల కోసం రూ. 400 కోట్లు త్వరలో కేంద్ర ఉన్నత విద్యా కమిషన్‌ ముసాయిదా బిల్లు విదేశీ విద్యార్థులను ఆకర్షించేలా ‘స్టడీ ఇన్‌ ఇండియా’ పథకం గాంధీజీ సిద్ధాంతాలపై యువతలో అవగాహనకు గాంధీపీడియా న్యూఢిల్లీ: దేశ విద్యా వ్యవస్థను ప్రపంచస్థాయి ప్రమాణాలతో తీర్చదిద్దేందుకు నూతన జాతీయ విద్యా విధానాన్ని తీసుకొస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా

Most from this category