News


ఎయిర్‌ ఇండియా విక్రయానికి గడువు పొడిగింపు

Friday 13th March 2020
news_main1584091078.png-32463

ఎయిర్‌ ఇండియా విక్రయాన్ని ప్రభుత్వం మరో నెలరోజులు పాటు పొడిగించింది. ఎయిర్‌ ఇండియాలో 100 శాతం వాటాను విక్రయించేందుకు బిడ్స్‌ను ఏప్రిల్‌ 30 వరకు స్వీకరించనున్నట్లు హోమంత్రి అమిత్‌ షా తో కూడిన మంత్రిత్వ ప్యానల్‌ తెలిపింది. కోవిడ్‌-19తో పరిస్థితులు అనుకూలంగా లేనందున బిడ్స్‌ సమర్పణకు గడువు పొడిగించాలని ఆసక్తిగల కొనుగోలు దారులు కోరడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్యానెల్‌ వెల్లడించింది. కాగా జనవరిలో ఎయిర్‌ ఇండియాలో 100 శాతం వాటాను విక్రయించేందుకు ప్రభుత్వం ప్రక్రియను ప్రారంభించింది. ఎయిర్‌ ఇండియాలో 100 శాతం వాటాను విక్రయించేందుకు జనవరి 27న ప్రాథమిక మెమోరాండమ్‌ను జారీ చేసింది. ఫిబ్రవరి 21న ఆసక్తి గల బిడ్డర్ల సందేహాలకు సమాధానాలు ఇచ్చింది. ఎయిర్‌ ఇండియాను కొనాలనుకున్న బిడ్డర్ల నికర విలువ రూ.3,500 కోట్లుగా నిర్ణయించింది. ఈ క్రమంలోనే మొదట మార్చి 17ను బిడ్లు స్వీకరించడానికి ఆఖరి తేదీగా నిర్ణయించారు. కాగా 2018లో ఎయిర్‌ ఇండియాలో 76 శాతం వాటాను విక్రయానికి పెట్టగా ఎవరూ ఆసక్తి చూపకపోవడంతో ఈ సారి 100 శాతం వాటాను విక్రయానికి ఉంచింది.



You may be interested

సరికొత్త కనిష్టానికి రుపీ- ఆపై ప్లస్‌

Friday 13th March 2020

తొలి సెషన్‌లో 74.50కు 2018 అక్టోబర్‌ రికార్డ్‌కు చెక్‌ తదుపరి 74 దిగువకు రికవరీ దేశీ స్టాక్‌ మార్కెట్లతోపాటు తొలి సెషన్‌లో కరెన్సీకి సైతం షాక్‌ తగిలింది. ఇంటర్‌బ్యాంక్‌ ఫారెక్స్‌ మార్కెట్లో డాలరుతో మారకంలో రూపాయి 18 పైసలు క్షీణించి 74.39 వద్ద ప్రారంభమైంది. తదుపరి ఫారెక్స్‌ మార్కెట్లో తొలిసారి దేశీ కరెన్సీ విలువ 74.50కు జారింది. వెరసి ఇంతక్రితం 2018 అక్టోబర్‌లో నమోదైన చరిత్రాత్మక కనిష్టం 74.48 రికార్డును సవరించింది. ఆపై ఈక్విటీ

స్టాక్‌ మార్కెట్‌ భారీ పతనం ఇందుకే..!

Friday 13th March 2020

నేడు మార్కెట్లో అమ్మకాలు సునామిలా వెల్లువెత్తాయి. ట్రేడింగ్‌ ప్రారంభంలోనే సెన్సెక్స్‌ నిఫ్టీలు 10శాతం పతనం కావడంతో లోయర్‌ సర్క్యూట్‌ విధించారు. దీంతో 45నిమిషాల పాటు ట్రేడింగ్‌ను నిలిపివేశారు. ఈ తర్వాత తిరిగి ట్రేడింగ్‌ను కొనసాగించారు. సూచీలు నష్టాలను పూడ్చుకుంటున్నప్పటికీ.. మార్కెట్లో అమ్మకాల భయాలు ఇంకా మిగిలే ఉన్నాయి.  గత కొన్ని రోజులుగా, కోవిడ్‌ -19 అంటువ్యాధికి సంబంధించిన ఆందోళనలు, ఆర్థిక మందగమన భయం, ప్రపంచవ్యాప్తంగా క్రూడాయిల్‌ ధర అనూహ్యంగా పతనం కావడం

Most from this category