News


ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ సంక్షోభ ప్రభావం పెద్దగా పడదు

Friday 5th October 2018
news_main1538713961.png-20879

నిరోధానికి ప్రభుత్వం చర్యలు తీసుకుందన్న జైట్లీ న్యూఢిల్లీ: ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ సంస్థలో సంక్షోభాన్ని మొదట్లోనే నిరోధించాలని ప్రభుత్వం నిర్ణయించిందని, కనుక ఇదేమంత తీవ్ర ప్రభావం చూపదని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ తెలిపారు. రూ.91,000 కోట్ల రుణాలను తీసుకుని, ఇటీవల పలు చెల్లింపుల్లో ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ సంస్థ విఫలం కావడంతో, బోర్డును ప్రభుత్వం సస్పెండ్‌ చేసి తన ఆధీనంలోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఐఎల్‌ఎఫ్‌ఎస్‌లో సంక్షోభం మార్కెట్లలో నిధుల సమస్యకు దారితీస్తుందన్న ఆందోళనలు తలెత్తడంతో ప్రభుత్వం రంగంలోకి దిగింది. ప్రముఖ బ్యాంకర్‌ ఉదయ్‌కోటక్‌ నేతృత్వంలో ఐఎల్‌ఎఫ్‌ఎస్‌కు కొత్త బోర్డును ఏర్పాటు చేసింది. ‘‘ఇది దేశ అంతర్గత అంశం. వేగంగా దీనికి అడ్డుకట్ట వేయడం జరుగుతుంది. కనుక ఏమంత తీవ్ర ప్రభావం ఉండదు​’’అని జైట్లీ పేర్కొన్నారు. 



You may be interested

15 రోజుల్లోపు ఎయిర్‌ ఇండియా పునరుద్ధరణ ప్యాకేజీ: చౌబే

Friday 5th October 2018

న్యూఢిల్లీ: ఎయిర్‌ఇండియా పునరుద్ధరణ ప్యాకేజీని 10-15 రోజుల్లో ప్రభుత్వం ఖరారు చేయనున్నట్టు కేంద్ర పౌర విమానయాన శాఖ కార్యదర్శి ఆర్‌ఎన్‌ చౌబే తెలిపారు. రూ.50,000 కోట్లకు పైగా రుణ భారంతో, తీవ్ర నష్టాల మధ్య నడుస్తున్న ఎయిర్‌ఇండియాలో వాటాలను అమ్మేయాలని ప్రభుత్వం లోగడ ప్రయత్నించినప్పటికీ కొనుగోలుకు ఎవరూ ఆసక్తి చూపించలేదు. దీంతో ఈ సంస్థను ఒడ్డున పడేసే బాధ్యత ప్రభుత్వంపైనే పడింది. అధిక చమురు ధరలు, రూపాయి విలువ క్షీణత

శుక్రవారం వార్తల్లోని షేర్లు

Friday 5th October 2018

ముంబై:- వివిధ వార్తలకు అనుగుణంగా శుక్రవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు టైటాన్‌ కంపెనీ:- ఈ ఆర్థిక సంవత్సరం తొలి సంవత్సరం వ్యాపార లావాదేవీల సమాచారాన్ని ఎక్స్సేంజ్‌లకు నివేదించింది.  క్యుపిడ్:- బోనస్‌ షేర్ల ఇష్యూతో పాటు ఇతర వ్యాపార విషయాలను చర్చించేందుకు ఈ అక్టోబర్‌ 13న బోర్డు సమావేశం నిర్వహించనుంది. భూషణ్‌ స్టీల్‌:- ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో 1.05 మిలియన్‌ టన్నుల స్టీల్‌ను ఉత్పత్తిని చేయగా, 1.14 మిలియన్‌ టన్నుల స్టీల్‌ను విక్రయించింది. ఇండియాబుల్స్‌హౌసింగ్‌ఫైనాన్స్‌:- నాన్‌

Most from this category