News


చిన్న పొదుపు పథకాలపై తగ్గిన వడ్డీ

Saturday 29th June 2019
news_main1561780672.png-26673

  • 10 బేసిస్‌ పాయింట్లు కుదింపు
  • ఆర్‌బీఐ సరళతర విధానమే కారణం

న్యూఢిల్లీ: చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీరేట్లను ప్రభుత్వం 10 బేసిస్‌ పాయింట్లు (0.1 శాతం) తగ్గించింది. జూలై- సెప్టెంబర్‌ మధ్య కాలానికి సవరించిన తాజా రేట్లు వర్తిస్తాయని ఆర్థిక మంత్రిత్వశాఖ తెలిపింది. 2019- 20 ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికానికి తాజా రేట్లను నోటిఫై చేసింది. ద్రవ్య, పరపతి విధాన ప్రాతిపదికన ప్రతి మూడు నెలలకు ఒకసారి చిన్న పథకాలపై పొదుపురేట్లను కేంద్రం సమీక్షించి, మార్పులు, చేర్పులు లేదా యథాతథస్థితిపై ఒక నిర్ణయం తీసుకునే సంగతి తెలిసిందే. తాజాగా తగ్గిన రేట్ల వివరాలను క్లుప్తంగా చూస్తే...

  • వార్షికంగా 4 శాతంగా ఉన్న పోస్టల్‌ పొదుపు డిపాజిట్ల రేట్ల మినహా, ఇతర అన్ని పథకాలపై రేట్లు 10 బేసిస్‌ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒక శాతం) తగ్గాయి. 
  • పబ్లిక్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ (పీపీఎఫ్‌), నేషనల్‌ సేవింగ్స్‌ సర్టిఫికేట్‌ (ఎన్‌ఎస్‌సీ) వడ్డీరేట్లు 8 శాతం నుంచి 7.9 శాతానికి తగ్గాయి. 
  • కిసాన్‌ వికాస్‌ పత్ర (కేవీపీ) రేటు 113 నెలల మెచ్యూరిటీకి 7.6 శాతంగా ఉంది. ఇప్పుడు 112 నెలలకు ఈ రేటు 7.7 శాతంగా ఉంది. 
  • బాలికా పొదుపు పథకం- సుకన్య సమృద్ధి యోజన అకౌంట్‌పై రేటు 8.5  శాతం నుంచి 8.4 శాతానికి తగ్గుతోంది. 
  • ఏడాది నుంచి మూడేళ్ల టర్మ్‌ డిపాజిట్ల రేటు 6.9 శాతంగా ఉంది. వడ్డీని మూడు నెలలకు ఒకసారి కలుపుతారు. ఐదేళ్ల డిపాజిట్‌ రేటు 7.7 శాతంగా ఉంది. 
  • రికరింగ్‌ డిపాజిట్‌ రేటు ప్రస్తుత 7.3 శాతం నుంచి 7.2 శాతానికి తగ్గుతుంది. 
  • సీనియర్‌ సిటిజన్ల ఐదేళ్ల డిపాజిట్‌కు వచ్చేరేటు 8.7 శాతం నుంచి 8.6 శాతానికి తగ్గుతుంది. 

ఆర్‌బీఐ నిర్ణయాల నేపథ్యం...
ఆర్థిక వ్యవస్థలో మందగమనం నేపథ్యంలో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు- రెపో (ప్రస్తుతం 5.75 శాతం) రేటును తగ్గిస్తూ వస్తోంది. జూన్‌ 6వ తేదీన ఆర్‌బీఐ పరపతి విధాన కమిటీ తీసుకున్న నిర్ణయంతో రెపో రేటు 6 శాతం నుంచి 5.75 శాతానికి తగ్గింది. రెపో రేటు తగ్గించడం జనవరి నుంచీ ఇది మూడవసారి. రెండు నెలలకోసారి జరిగే సమీక్షలో గడిచిన ఆరు నెలల్లో మూడు సార్లు 0.25 శాతం చొప్పున రేటును ఆర్‌బీఐ తగ్గిస్తూ వస్తోంది. జూన్‌ 6 రేటు తగ్గింపుతో రెపో తొమ్మిదేళ్ల కనిష్ట స్థాయికి చేరినట్లయింది. దీనికితోడు వ్యవస్థలో వడ్డీరేట్లు మరింత తగ్గుతాయనీ సంకేతాలను ఇచ్చింది. You may be interested

ఎస్‌బీఐ ఎగవేతదారులు వీరే...

Saturday 29th June 2019

పది బడా ఉద్దేశపూర్వక డిఫాల్టర్ల వివరాల వెల్లడి ముంబై: ప్రభుత్వరంగంలోని అతిపెద్ద బ్యాంకు ఎస్‌బీఐ, ఉద్దేశపూర్వకంగా రుణాలు ఎగ్గొట్టిన పది పెద్ద ఖాతాదారుల వివరాలను వెల్లడించింది. ఇందులో ఫార్మా కంపెనీలు, జెమ్స్‌, జ్యుయలరీ సంస్థలు, విద్యుత్‌ రంగ కంపెనీలు ఉన్నాయి. ఈ కంపెనీలతోపాటు, వీటికి సంబంధించి కొంత మంది డైరెక్టర్లను ఉద్దేశపూర్వక ఎగవేతదారులుగా ప్రకటించింది. ఈ పది ఖాతాల నుంచి ఎస్‌బీఐకి రూ.1,500 కోట్ల మేర రుణాలు వసూలు కావాల్సి ఉంది.

జెట్‌ కోసం ఉద్యోగుల కన్సార్షియం బిడ్‌

Saturday 29th June 2019

ఆది గ్రూప్‌తో కలిసి 75 శాతం వాటా కొనుగోలుకు ప్రకటన న్యూఢిల్లీ: దివాలా ప్రక్రియలో ఉన్న జెట్‌ ఎయిర్‌వేస్‌ను కొనుగోలు చేసేందుకు ఆ సంస్థ ఉద్యోగులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. జెట్‌లో 75 శాతం వాటా దక్కించుకోవడానికి బిడ్‌ వేస్తామని.. ఇందుకోసం బ్రిటన్‌కు చెందిన ఆది గ్రూప్‌తో జట్టు కట్టామని జెట్‌ ఎయిర్‌వేస్‌ ఉద్యోగుల కన్సార్షియం శుక్రవారం ప్రకటించింది. ఎస్‌బీఐ నేతృత్వంలోని 26 బ్యాం‍కుల కన్సార్షియం దాఖలు చేసిన దివాలా

Most from this category