News


క్రిప్టోకరెన్సీ అంటే కఠిన చర్యలు

Tuesday 23rd July 2019
news_main1563864453.png-27250

  • అంతర్‌ మంత్రిత్వశాఖల కమిటీ సిఫార్సు

న్యూఢిల్లీ: బిట్‌ కాయిన్‌, ఎథేరియం, రిపిల్‌, కార్డోనో వంటి క్రిప్టోకరెన్సీ  కార్యకలాపాలు ఏవైనా భారత్‌లో కఠిన చర్యలు తీసుకోవాలని అంతర్‌ మంత్రిత్వశాఖల కమిటీ ప్రభుత్వానికి సిఫారసు చేసింది. ప్రైవేటు క్రిప్టోకరెన్సీలను దేశంలో నిషేధించాలని సూచించిన కమిటీ, దేశంలో ఈ తరహా కార్యకలాపాలు నిర్వహించే వారిపై జరిమానాలు విధించాలని, కఠిన చర్యలు తీసుకోవాలని పేర్కొంది. క్రిప్టోకరెన్సీల నియంత్రణ, నిషేధానికి సంబంధించి ఒక చట్టాన్ని తీసుకురావాలని కూడా కమిటీ సిఫారసు చేసింది. ఇందుకు సంబంధించి ‘ది బ్యానింగ్‌ ఆఫ్‌ క్రిప్టోకరెన్సీ అండ్‌ రెగ్యులేషన్‌ ఆఫ్‌ అఫీషియల్‌ డిజిటల్‌ కరెన్సీ బిల్లు, 2019’ పేరుతో ఒక ముసాయిదా బిల్లును కూడా కమిటీ సిఫారసు చేసింది.    క్రిప్టోకరెన్సీపై ఎటువంటి విధానాలను అవలంభించాలనే అంశంపై సిఫారసులు చేయడానికి కేంద్రం 2017 నవంబర్‌ 2న ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి నేతృత్వంలో ఏర్పాటు చేసిన ఈ కమిటీలో ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ మంత్రిత్వశాఖ కార్యదర్శి, సెబీ చైర్మన్‌, రిజర్వ్‌ బ్యాం‍క్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) డిప్యూటీ గవర్నర్‌ సభ్యులుగా ఉన్నారు. ‘‘ప్రైవేటు క్రిప్టోకరెన్సీతో ఎంతో ఇబ్బందులు పొంచి ఉన్నాయి. వాటి ధరల్లో తీవ్ర ఒడిదుడుకులు ఉంటాయి. సామాన్యులను ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టే అవకాశం అధికంగా ఉంది’’ అని సోమవారం విడుదలైన నివేదిక తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 2,116 క్రిప్టోకరెన్సీలు ఉన్నాయి. వీటి మార్కెట్‌ విలువ 119.46 బిలియన్‌ డాలర్లు. తాజాగా కమిటీ సమర్పించిన నివేదిక, ముసాయిదా బిల్లులను సంబంధిత అన్ని శాఖలు పరస్పర సంప్రతింపుల ద్వారా సమీక్షిస్తాయి. తమ అభిప్రాయాలను ప్రభుత్వానికి తెలియజేస్తాయి. కేంద్రం తుది నిర్ణయం తీసుకుంటుంది.



You may be interested

వరుసగా నాలుగో క్వార్టర్‌లోనూ ఓబీసీకి లాభాలు

Tuesday 23rd July 2019

మెరుగుపడిన రుణ నాణ్యత తగ్గిన మొండి బకాయిలు పెరిగిన ట్రెజరీ ఆదాయం  న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ ఓరియంటల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ కామర్స్‌ (ఓబీసీ) ఈ ఆర్థిక సంవత్సరం జూన్‌ క్వార్టర్‌లో రూ.113 కోట్ల నికర లాభం సాధించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో రూ.393 కోట్ల నికర నష్టాలు వచ్చాయని ఓబీసీ తెలిపింది. సీక్వెన్షియల్‌గా చూస్తే, గత క్యూ4లో రూ.202 కోట్ల నికర లాభం సాధించామని పేర్కొంది.  రుణ నాణ్యత మెరుగుపడటం, మొండి

వన్‌ప్లస్‌ అతిపెద్ద స్టోర్‌ హైదరాబాద్‌లో..

Tuesday 23rd July 2019

16,000 చదరపు అడుగుల విస్తీర్ణం కంపెనీ జీఎం వికాస్‌ అగర్వాల్‌ హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో:- స్మార్ట్‌ఫోన్స్‌ తయారీలో ఉన్న చైనా కంపెనీ వన్‌ప్లస్‌ అతిపెద్ద​ఔట్‌లెట్‌ను హైదరాబాద్‌లో నిర్మిస్తోంది. 16,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో హిమాయత్‌నగర్‌లో ఇది ఏర్పాటవుతోంది. కంపెనీకి ప్రపంచంలో ఇదే అతిపెద్ద, సొంత స్టోర్‌. ఈ ఏడాది చివరినాటికి నిర్మాణం పూర్తి కావొచ్చని సంస్థ భావిస్తోంది. వన్‌ప్లస్‌ ఉత్పత్తులను ఇక్కడ ప్రదర్శిస్తారు. ఆరు అంతస్తుల్లో సిద్ధమవుతున్న ఈ కేంద్రంలో రెస్టారెంట్‌, ప్లే

Most from this category