News


దివాలా కంపెనీలకు 330 రోజుల్లో పరిష్కారం

Thursday 18th July 2019
news_main1563431629.png-27146

  • సత్వర పరిష్కారం దిశగా చర్యలు
  • ఐబీసీ చట్టంలో సవరణలకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం

న్యూఢిల్లీ: దివాలా చట్టంలో ఏడు రకాల కీలక సవరణలు చేసేందుకు ఉద్దేశించిన ఇన్‌సాల్వెన్సీ అండ్‌ బ్యాంక్రప్టసీ కోడ్‌ (సవరణ) బిల్లు, 2019కు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. కార్పొరేట్‌ పరిష్కార ప్రక్రియకు 330 రోజుల గడువును నిర్ణయించడం ఇందులో ప్రధాన సవరణ. ప్రస్తుతానికి ఈ గడువు 270 రోజులే ఉన్పపటికీ చాలా కేసుల్లో ఎక్కువ సమయమే తీసుకుంటోంది. దరఖాస్తులను ఎన్‌సీఎల్‌టీ బెంచ్‌లు ఆమోదించడంలోనూ జాప్యం నెలకొంటున్న పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. అందుకే వివాద, న్యాయ ప్రక్రియలు అన్నీ కలుపుకుని 330 రోజుల్లోపు పరిష్కారం కావాలంటూ గడువును తాజాగా నిర్ణయించారు. పరిష్కార ప్రణాళికకు భాగస్వాములు అందరూ కట్టుబడి ఉండేలా చేయడాన్ని కూడా సవరణ ద్వారా పొందుపరిచారు. పరిష్కార ప్రక్రియ ద్వారా గరిష్ట విలువను పొందడం, కార్పొరేట్‌ దివాలా పరిష్కార ప్రక్రియలో అంతరాలను నివారించడం ఈ సవరణల ఉద్దేశ్యమని ఓ అధికారి తెలిపారు. దివాలా పరిష్కార కేసులు సకాలంలో నమోదుకు, సకాలంలో పరిష్కారానికి ఇవి వీలు కల్పిస్తాయని పేర్కొన్నాయి. కాగా, ఈ సవరణలు పరిష్కార ప్రక్రియలో ఉన్న ఎన్నో అడ్డంకులను తొలగించి, సాఫీగా జరిగేలా చేస్తాయని నిపుణులు సైతం అభిప్రాయం వ్యక్తం చేశారు. ముఖ్యంగా పరిష్కార ప్రణాళికకు రుణమిచ్చిన అందరూ... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహా భాగస్వాములు కట్టుబడి ఉండాలనేది ఒకానొక సవరణ. రుణాలు చెల్లించడంలో విఫలమైన కార్పొరేట్‌ సంస్థకు పరిష్కార ప్రణాళిక రూపొందించడానికి ముందే, లిక్విడేషన్‌పై రుణదాల కమిటీ నిర్ణయం కూడా తీసుకోవచ్చు. పరిష్కారంలో భాగంగా విలీనాలు, కంపెనీల విభజనకు సంబంధించి మరింత స్పష్టత వస్తుందని అధికార వర్గాలు తెలిపాయి. 



You may be interested

కేజీ-డీ6లో రూ. 35 వేల కోట్ల పెట్టుబడులు

Thursday 18th July 2019

2022 నాటికి రిలయన్స్, బీపీ ప్రణాళిక న్యూఢిల్లీ: కేజీ-డీ6 బ్లాక్‌లో సహజ వాయువు ఉత్పత్తికి సంబంధించి రిలయన్స్ ఇండస్ట్రీస్‌, బ్రిటీష్ భాగస్వామ్య సంస్థ బీపీ 2022 నాటికి  రూ. 35 వేల కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నాయి. కేజీ-డీ6 బ్లాక్‌లో మూడు గ్యాస్ ప్రాజెక్టులను అభివృద్ధి చేసేందుకు ఈ నిధులను వెచ్చించనున్నట్లు బీపీ సీఈవో (అప్‌స్ట్రీమ్ విభాగం) బెర్నార్డ్ లూనీ తెలిపారు. 2022 నాటికి కొత్తగా రోజుకు వంద కోట్ల ఘనపుటడుగుల గ్యాస్‌

తెలంగాణలో బ్యాటరీ తయారీ కంపెనీలు

Thursday 18th July 2019

మొత్తం రూ.6,000 కోట్ల పెట్టుబడులు 15 నెలల్లో ఉత్పత్తి ప్రక్రియ ప్రారంభం హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: లిథియం అయాన్‌ బ్యాటరీల తయారీ ప్లాంట్లు తెలంగాణలో ఏర్పాటు చేసేందుకు మూడు కంపెనీలు ముందుకొచ్చాయి. హైదరాబాద్‌లోని శంషాబాద్‌ వద్ద రానున్న ఈ కేంద్రాల్లో తొలి దశలో రూ.1,500 కోట్ల పెట్టుబడి పెట్టనున్నాయి. ఒక గిగావాట్‌తో ప్రారంభమై మూడు దశల్లో 10 గిగావాట్‌ సామర్థ్యానికి చేరుకుంటాయని తెలంగాణ రాష్ట్ర ఎలక్ట్రానిక్స్‌ విభాగం డైరెక్టర్‌ సుజయ్‌ కారంపూరి తెలిపారు.

Most from this category