News


ఎయిర్‌టెల్‌లో 100 శాతం ఎఫ్‌డీఐలకు అనుమతి

Wednesday 22nd January 2020
news_main1579661410.png-31081

న్యూఢిల్లీ: టెలికం సంస్థ భారతీ ఎయిర్‌టెల్‌లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పరిమితిని 49 శాతం నుంచి 100 శాతానికి పెంచే ప్రతిపాదనకు టెలికం శాఖ (డాట్) ఆమోదముద్ర వేసింది. దాదాపు రూ.35,586 కోట్ల మేర లైసెన్సు ఫీజు, స్పెక్ట్రం యూసేజీ చార్జీ బాకీలు ప్రభుత్వానికి కట్టాల్సిన గడువు దగ్గరపడుతున్న తరుణంలో ఈ పరిణామం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. కంపెనీలో విదేశీ ఇన్వెస్టర్లు 74 శాతం దాకా వాటాలు పొందే ప్రతిపాదనకు ఆర్‌బీఐ నుంచి ఇప్పటికే అనుమతులు లభించినట్లు స్టాక్ ఎక్స్చేంజీలకు ఎయిర్‌టెల్ తెలిపింది. You may be interested

నేడు క్యూ3 ఫలితాలను ప్రకటించే కొన్ని ప్రధాన కంపెనీలు

Wednesday 22nd January 2020

లార్సెన్‌ అండ్‌ టుబ్రో, యాక్సిస్‌ బ్యాంక్‌, ఏషియన్‌ పెయింట్స్‌, ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌, ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్సూరెన్స్‌, ఏయూ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌, ఉజ్జీవన్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌, వీఎస్‌టీ ఇండస్ట్రీస్‌, సియట్‌, అలెంబిక్‌ ఫార్మా, రేమండ్‌, హిందుస్తాన్‌ మీడియా వెంచర్స్‌ కంపెనీలు నేడు తమ ఆర్థిక సంవత్సరపు మూడో త్రైమాసిక ఫలితాలను విడుదలు చేయనున్నాయి. 

బడా ఇన్వెస్టర్ల కొనుగోళ్లు చూద్దామా..?

Tuesday 21st January 2020

రాకేశ్‌ జున్‌జున్‌వాలా, డాలీఖన్నా, రాధాకిషన్‌ దమానీ, ఆశిష్‌ కచోలియా, అనిల్‌ కుమార్‌ గోయల్‌ వీరంతా విజయవంతమైన బడా స్టాక్‌ ఇన్వెస్టర్లు. వందలు, వేల కోట్ల రూపాయల సంపదను వీరు స్టాక్‌ మార్కెట్లో సృష్టించుకున్న విజేతలు. వీరు ఎప్పటికప్పుడు తమ పోర్ట్‌ఫోలియో పరంగా మార్పులు, చేర్పులు చేస్తుంటారు. సాధారణ రిటైల్‌ ఇన్వెస్టర్లు వీరిని గుడ్డిగా అనుసరించడం సరికాదు. అలా అని అస్సలు పట్టించుకోకుండా ఉండాల్సిన అవసరం కూడా లేదు. వీరంతా తాము

Most from this category