News


ఎయిర్‌ ఇండియా వాటా విక్రయ ఒప్పందానికి ఆమోదం

Wednesday 8th January 2020
news_main1578455275.png-30748

  • ఈఓఐలకు కూడా ఆమోదం తెలిపిన జీఓఎమ్‌

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ విమానయాన సం‍స్థ, ఎయిర్‌ ఇండియాలో వాటా విక్రయానికి మరో అడుగు ముందుకు పడింది. ఎయిర్‌ ఇండియాలో వాటా కొనుగోలు చేయడానికి అసక్తి గల సంస్థల నుంచి  ఆసక్తి వ్యక్తీకరణ (ఈఓఐ)దరఖాస్తులను స్వీకరించడానికి జీఓఎమ్‌(మంత్రుల సంఘం-గ్రూప్‌ ఆఫ్‌ మినిస్టర్స్‌) పచ్చజెండా ఊపింది. అంతే కాకుండా వాటా కొనుగోలు ఒప్పందానికి కూడా ఆమోదం తెలిపింది. హోమ్‌ మంత్రి అమిత్‌ షా అధ్యక్షతన గల జీఓఎమ్‌ మంగళవారం ఈ మేరకు నిర్ణయాలు తీసుకుందని ప్రభుత్వ ఉన్నతాధికారొకరు చెప్పారు. ఎయిర్‌ ఇండియా వాటా విక్రయానికి సంబంధించి ఈఓఐ, వాటా కొనుగోలు ఒప్పందాలను ఈ నెలలోనే జారీ చేస్తామని పేర్కొన్నారు. ఎయిర్‌ ఇండియా ఉద్యోగులకు సంబంధించి ఒక స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్‌ఎస్‌) పథకాన్ని, రుణ పునర్వ్యస్థీకరణ ప్రణాళికను కూడా ఎయిర్‌ ఇండియా స్పెసిఫిక్‌ ఆల్టర్నేటివ్‌ మెకానిజమ్‌ (ఏఐఎస్‌ఏఎమ్‌) రూపొందించిందని వివరించారు. 


వాటా కొనుగోలు ఒప్పందంలో భాగంగా  ఎయిర్‌ ఇండియాకు చెందిన మొత్తం  రుణాన్ని ఒక ప్రత్యేక కంపెనీకి (ఎస్‌పీవీ-స్పెషల్‌ పర్పస్‌ వెహికల్‌)కు బదిలీ చేస్తారు.  ఇప్పటికే ఎయిర్‌ ఇండియాకు చెందిన రూ.29,400 కోట్ల రుణాన్ని ఎస్‌పీవికి బదిలీ చేశారు. గత ఆర్థిక సంవత్సరంలో ఎయిర్‌ ఇండియాకు రూ.8,556 కోట్ల నికర నష్టాలు రాగా, రుణ భారం రూ.80,000 కోట్ల మేర ఉంటుందని అంచనా. 


మంగళవారం నాటి మంత్రుల సంఘం(జీఓఎమ్‌) సమావేశానికి  అమిత్‌ షా తో పాటు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌, వాణిజ్య శాఖ  మంత్రి పీయుష్‌ గోయల్‌, విమానయాన శాఖ మంత్రి హర్దీప్‌ సింగ్‌ పురి, విమానయాన శాఖ కార్యదర్శి ప్రదీప్‌ సింగ్‌ కరోలా హాజరయ్యారు. You may be interested

మళ్లీ పసిడి మెరుపు- చమురు మంట

Wednesday 8th January 2020

1603 డాలర్లను తాకిన ఔన్స్‌ బంగారం  70 డాలర్లకు బ్రెంట్‌ చమురు బ్యారల్‌  అమెరికా సైన్యంపై ఇరాన్‌ ప్రతిదాడుల ఎఫెక్ట్‌ హెచ్చరించిన విధంగానే ఇరాక్‌లోని అమెరికన్‌ సైనిక స్థావరాలపై తాజాగా ఇరాన్‌ మిస్సైళ్లను ప్రయోగిచడం ద్వారా ప్రతిదాడులకు దిగడంతో ఉన్నట్టుండి పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం నెలకొంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు ముదిరాయి. వెరసి అటు బంగారం, ఇటు ముడిచమురు ధరలు మరోసారి రివ్వుమని పైకెగశాయి. తొలుత న్యూయార్క్‌ కామెక్స్‌లో ఔన్స్‌(31.1 గ్రాములు) పసిడి ధర

ఫార్మా ఎగుమతులు రెండంకెల వృద్ధి

Wednesday 8th January 2020

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత తయారీ రంగం వృద్ధి 6.2 శాతం నుంచి 2 శాతానికి పడిపోనుందని నేషనల్‌ స్టాటిస్టికల్‌ ఆఫీస్‌ వెల్లడించింది. వ్యవసాయం, నిర్మాణం, విద్యుత్‌, సహజవాయువు వంటి రంగాల వృద్ధికి స్పీడ్‌ బ్రేకర్స్‌ పడనున్నాయని తెలిపింది. అయితే ఫార్మా రంగం మాత్రం పరుగు పెడుతోంది. రెండంకెల వృద్ధితో ఆశాజనకంగా ఉంది. భారత్‌ నుంచి ఔషధ ఎగుమతులు 2019 నవంబరులో రూ.12,530 కోట్లు నమోదు చేశాయి. అంత క్రితం

Most from this category