News


పీఎన్‌బీ ఎండీ, సీఈఓగా మల్లిఖార్జున రావు

Wednesday 2nd October 2019
news_main1569993459.png-28670

న్యూఢిల్లీ: పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (పీఎన్‌బీ) మేనేజింగ్‌ డైరెక్టర్‌ (ఎండీ) చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ (సీఈఓ)గా సీహెచ్‌ ఎస్‌ఎస్‌ మల్లిఖార్జున రావు నియమితులయ్యారు. 57 సంవత్సరాల ఆయన ప్రస్తుతం అలహాబాద్‌ బ్యాంక్‌ ఎండీ, సీఈఓగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. తాజాగా నియమితులైన బాధ్యతల్లో 2021 సెప్టెంబర్‌ 18 వరకూ లేదా తదుపరి ఉత్తర్వ్యులు వెలువడేవరకూ కొనసాగుతారు. ‘‘మల్లిఖార్జునరావు పోస్టింగ్‌కు సంబంధించి ఆర్థిక సేవల శాఖ చేసిన ప్రతిపాదనను నియామక వ్యవహారాల క్యాబినెట్‌ కమిటీ (ఏసీసీ) ఆమోదించింది. బాధ్యతలు స్వీకరించిననాటి నుంచీ ఈ నియామకం అమల్లోకి వస్తుంది’’ అని అధికారిక ప్రకటన ఒకటి తెలిపింది. పీఎన్‌బీలో యునైటెడ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, ఓరియెంటల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ కామర్స్‌ విలీన నిర్ణయం నేపథ్యంలో మల్లిఖార్జున రావు నియామకం జరిగింది. 



You may be interested

కాగ్నిజంట్‌లో మహిళా ఉద్యోగుల సంఖ్య లక్షకు

Wednesday 2nd October 2019

న్యూఢిల్లీ: అమెరికాకు చెందిన ప్రముఖ ఐటీ కంపెనీ కాగ్నిజంట్‌లో మహిళా ఉద్యోగుల సంఖ్య లక్ష మార్క్‌ను దాటింది. ఇందులో 75వేల మందికి పైగా మహిళలు భారత్‌లోనే పనిచేస్తుండడం గమనార్హం. మొత్తం ఉద్యోగులు రూ.2.88 లక్షల మందిలో మహిళలు 34 శాతానికి చేరినట్టు కాగ్నిజంట్‌ తెలిపింది. భారత్‌లోని మొత్తం ఉద్యోగుల పరంగా చూస్తే మహిళా ఉద్యోగులు 35 శాతంగా ఉన్నారు. 100కు పైగా దేశాలకు చెందిన మహిళలు సంస్థలో పనిచేస్తున్నారు. కనీసం

60 డాలర్ల దిగువకు బ్రెంట్‌ క్రూడ్‌!

Wednesday 2nd October 2019

గత వారానికి సంబంధించి యుఎస్‌ చమురు నిల్వలు పడిపోవడంతో బుధవారం చమురు ధరలు లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 10.07 సమయానికి బ్రెంట్‌ క్రూడ్‌ 0.70  శాతం లాభపడి బారెల్‌ 59.30 డాలర్ల వద్ద, డబ్యూటీఐ క్రూడ్‌ 1.12 శాతం లాభపడి బారెల్‌ 54.22 డాలర్ల వద్ద ట్రేడవుతున్నాయి. కానీ యుఎస్‌-చైనా ట్రేడ్‌వార్‌ వలన యుఎస్‌ ఉత్పాదక రంగం 10 ఏళ్ల కనిష్ఠానికి పడిపోవడంతో అంతర్జాతీయ మార్కెట్‌లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ట్రేడ్‌వార్‌

Most from this category