News


బడ్జెట్లో పీఎస్‌బీలకు నిధులు కేటాయింపులు ఉండకపోవచ్చు

Monday 6th January 2020
Markets_main1578280559.png-30686

న్యూఢిల్లీ: రానున్న 2020-21 ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో ప్రభుత్వరంగ బ్యాంకులకు (పీఎస్‌బీలు) నిధుల కేటాయింపును ప్రకటించకపోవచ్చని, బదులుగా మొండి బకాయిలు (ఎన్‌పీఏలు) వసూలుకు, మార్కెట్ల నుంచి నిధుల సమీకరణ దిశగా వాటిని ప్రోత్సహించొచ్చని అధికార వర్గాల ద్వారా తెలుస్తోంది. అలాగే, ప్రభుత్వరంగ బ్యాంకులు తమకు అనుబంధ కంపెనీల్లో, జాయింట్‌ వెంచర్లలో ఉన్న వాటాల విక్రయం ద్వారా నిధులు సమీకరించొచ్చని ఆ వర్గాలు తెలిపాయి. ప్రభుత్వరంగ బ్యాంకులు కొన్నింటికి బీమా, మ్యూచువల్‌ ఫండ్స్‌, క్రెడిట్‌కార్డుల వ్యాపారంతోపాటు ఎన్‌ఎస్‌ఈ తదితర సంస్థల్లో వాటాలు సైతం ఉన్నాయి. ఫిబ్రవరి 1న పార్లమెంటుకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ సమర్పించనున్నారు. 



You may be interested

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 57 పాయింట్లు డౌన్‌

Monday 6th January 2020

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 57 పాయింట్లు మైనస్‌ ఇరాన్‌, అమెరికా మధ్య చెలరేగిన ఉద్రిక్తతల నేపథ్యంలో సోమవారం దేశీ స్టాక్‌ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ఉదయం 8.30 ప్రాంతంలో ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 57 పాయింట్ల నష్టంతో 12,203 పాయింట్ల  వద్ద  కదులుతోంది. క్రితం రోజు ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ జనవరి ఫ్యూచర్‌ 12,260 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక్కడి ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఫ్యూచర్‌ను ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ప్రతిఫలించే సంగతి తెలిసిందే. ఇరాక్‌ విమానాశ్రయంపై అమెరికా

సెన్సెక్స్‌ 41,700–41,810 శ్రేణిని అధిగమిస్తేనే...

Monday 6th January 2020

అమెరికా–చైనాల వాణిజ్య ఒప్పందంపై జనవరి 15న సంతకాలు జరగనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించడం, చైనా కేంద్ర బ్యాంకు పెద్ద ఎత్తున 115 బిలియన్‌ డాలర్ల నిధుల్ని వ్యవస్థలోకి విడుదల చేయడం వంటి పాజిటివ్‌ వార్తల నేపథ్యంలో పలు ప్రపంచ దేశాల సూచీలు కొత్త రికార్డుల్ని నెలకొల్పినా, భారత్‌ స్టాక్‌ సూచీలు...కొత్త గరిష్టస్థాయిల్ని నమోదు చేయలేకపోయాయి.  ఈ లోపున అమెరికా ద్రోన్‌ దాడులతో మధ్యప్రాచ్యంలో సృష్టించిన సంక్షోభ ఫలితంగా

Most from this category