News


మరిన్ని విమానాశ్రయాల ప్రైవేటీకరణ

Saturday 27th July 2019
news_main1564203107.png-27352

  • రెండో దశలో 20-25 ఎయిర్‌పోర్టులపై దృష్టి
  • ఏఏఐ చైర్మన్ గురుప్రసాద్ వెల్లడి

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం మరిన్ని విమానాశ్రయాలను ప్రైవేటీకరించడంపై కసరత్తు చేస్తోంది. ఇప్పటికే ఆరు విమానాశ్రయాలను ప్రైవేటీకరించగా రెండో విడతలో మరో 20-25 ఎయిర్‌పోర్టులను ప్రైవేటీకరించాలని భావిస్తోంది. ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) చైర్మన్ గురుప్రసాద్ మహాపాత్ర శుక్రవారం జరిగిన విలేఖరుల సమావేశంలో ఈ విషయాలు వెల్లడించారు. ఏటా 15 లక్షల మంది పైగా విమాన ప్రయాణీకులు ఉండే ఈ ఎయిర్‌పోర్టుల పేర్లను త్వరలోనే ఖరారు చేసి, కేంద్ర పౌర విమానయాన శాఖకు ఏఏఐ పంపనున్నట్లు ఆయన వివరించారు. ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షించడానికి అవకాశాలు ఉన్న విమానాశ్రయాల జాబితాను సిద్ధం చేసేందుకు ప్రత్యేకంగా కన్సల్టెంట్‌ను నియమించినట్లు మహాపాత్ర చెప్పారు. "తొలి రౌండు విజయవంతంగా పూర్తయిన నేపథ్యంలో రెండో విడత కూడా విజయవంతం కాగలదని ఆశిస్తున్నాం. పలు విదేశీ ఎయిర్‌పోర్టులు కూడా బిడ్డింగ్‌లో పాల్గొనవచ్చని అంచనా వేస్తున్నాం" అని ఆయన తెలిపారు. డబ్లిన్‌, మ్యూనిక్ ఎయిర్‌పోర్టులు ఇక్కడి విమానాశ్రయాల్లో ఇన్వెస్ట్ చేయడానికి ఆసక్తిగా ఉన్నా.. తొలి విడత ప్రైవేటీకరణ ప్రక్రియ ఏ విధంగా జరుగుతుందనేది వేచి చూడాలనే ఉద్దేశంతో అవి ముందుకు రాలేదని మహాపాత్ర చెప్పారు. "మొదటి రౌండు విజయవంతంగా పూర్తవడాన్ని అంతా చూశారు. కాబట్టి రెండో రౌండులో ఆ తరహా విదేశీ ఎయిర్‌పోర్ట్స్ మరిన్ని ముందుకు వచ్చే అవకాశం ఉంది" అని ఆయన చెప్పారు. తొలి దశలో ప్రైవేటీకరించిన లక్నో, అహ్మదాబాద్, జైపూర్, మంగళూరు, తిరువనంతపురం, గువాహతిల్లోని ఆరు ఎయిర్‌పోర్టుల నిర్వహణ, అభివృద్ధి బిడ్స్‌ను అదానీ గ్రూప్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఉన్నతాధికారుల బదిలీల పర్వంలో పారిశ్రామిక, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగానికి (డీపీఐఐటీ) మహాపాత్ర బదిలీ అయ్యారు. ఆగస్టు 1 నుంచి కొత్త బాధ్యతలు చేపట్టనున్నట్లు ఆయన చెప్పారు. 



You may be interested

విజిల్‌తో కంపెనీలకు రవాణా సేవలు

Saturday 27th July 2019

విజిల్‌ డ్రైవ్‌లో ఉద్యోగుల రవాణా, టెక్నాలజీ సేవలు రోజుకు 2,500 ట్రిప్స్‌; 12 వేల మంది వినియోగం ఏడాదిలో రూ.70 కోట్ల నిధుల సమీకరణ పూర్తి ‘స్టార్టప్‌ డైరీ’తో ఫౌండర్‌ అండ్‌ సీఈఓ రాకేశ్‌ హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఉద్యోగుల ట్రాన్స్‌పోర్టేషన్‌ కంపెనీలకు పెద్ద సవాలే. వ్యాపార కార్యకలాపాల కంటే ఎక్కువగా ఉద్యోగుల రవాణా సేవల నిర్వహణ కష్టం. ఎంప్లాయిస్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌ థర్డ్‌ పార్టీకి ఇద్దామంటే? వాహనాలు మాత్రమే ఉంటే సరిపోదు. టెక్నాలజీ, నిర్వహణ కూడా

జీఎంఆర్‌ సంస్థల విలీనానికి ఎన్‌సీఎల్‌టీ ఆమోదం

Saturday 27th July 2019

హైదరాబాద్‌: జీఎంఆర్‌ గ్రూప్ సంస్థల విలీనం, విభజనకు సంబంధించిన ప్రతిపాదనలకు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ప్రతిపాదనల ప్రకారం జీఎంఆర్ ఏరోస్పేస్ ఇంజినీరింగ్‌ లిమిటెడ్‌లో జీఎంఆర్‌ హైదరాబాద్ ఎయిర్‌ కార్గో అండ్ లాజిస్టిక్స్‌ను విలీనం చేయనున్నారు. అలాగే, జీఎంఆర్‌ ఏరోటెక్నిక్‌కి చెందిన మెయింటెనెన్స్‌, రిపేర్‌, ఓవరాలింగ్ (ఎంఆర్‌వో) వ్యాపార విభాగాన్ని జీఎంఆర్ ఏరోస్పేస్ ఇంజినీరింగ్‌ సంస్థ కింద విడగొట్టనున్నారు. మూడు సంస్థల వాటాదారులకు

Most from this category