News


ఎయిర్‌ ఇండియా, బీపీసీఎల్‌ డిజిన్వెస్ట్‌మెంట్‌ ఈ మార్చిలోగా లేనట్లే!

Friday 3rd January 2020
news_main1578020929.png-30628

  • కంటైనర్‌ కార్పొల్లో కూడా 
  • దీపమ్‌ ఉన్నతాధికారి వెల్లడి 

ముంబై: ఎయిర్‌ ఇండియాలో వాటా విక్రయం ఈ ఆర్థిక సంవత్సరంలో ఉండకపోవచ్చు. ఎయిర్‌ ఇండియాతో పాటు బీపీసీఎల్‌, కంటైనర్‌ కార్పొరేషన్‌ల్లో కూడా వాటా విక్రయం ఈ ఆర్థిక సంవత్సరంలోనే పూర్తి కాకపోవచ్చని ప్రభుత్వ ఉన్నతాధికారొకరు చెప్పారు. ఫలితంగా డిజిన్వెస్ట్‌మెంట్‌ లక్ష్యం వెనకబడి ద్రవ్యలోటుపై ప్రతికూల ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయని అంచనా. 

వాటా విక్రయ ప్రయత్నాల్లో జాప్యం...
ఎయిర్‌ ఇండియా, బీపీసీఎల్‌, కంటైనర్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా కంపెనీల్లో వ్యూహాత్మక వాటా విక్రయ ప్రయత్నాలు జరుగుతున్నాయని  డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అండ్‌ పబ్లిక్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ (దీపమ్‌) ఉన్నతాధికారొకరు పేర్కొన్నారు. అయితే, కొన్ని కారణాల వల్ల జాప్యం జరుగుతోందని తెలిపారు. ఈ కంపెనీల వాటా విక్రయానికి సంబంధించి ఆర్థిక వివరాలను సిద్ధం చేస్తున్నామని, దీనికి కొంత సమయం పడుతుందని పేర్కొన్నారు. పలు కంపెనీల నుంచి మంచి స్పందన లభిస్తోందని, అదనపు వివరాలను అడుతున్నాయని వివరించారు. మరోవైపు ఎన్‌ఎస్‌ఈలో భారత్‌ బాండ్‌ ఈటీఎఫ్‌ స్వల్ప నష్టంతో ఎన్‌ఎస్‌ఈలో లిస్టయింది. 

సగం కూడా సాకారం కాని లక్ష్యం...
ఈ ఆర్థిక సంవత్సరంలో డిజిన్వెస్ట్‌మెంట్‌ ద్వారా రూ.1.05 లక్షల కోట్లు సమీకరించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఇప్పటివరకూ దీంట్లో సగం కూడా సమీకరించలేకపోయింది. గత ఏడాది సెప్టెంబర్‌ నాటికి రూ.12,359 కోట్లు మాత్రమే సమీకరించగలిగింది. మరోవైపు ద్రవ్యలోటు బడ్జెట్‌ అంచనాలను మించి పోయింది. మరో నాలుగు నెలల్లో ఆర్థిక సంవత్సరం ముగియనున్నప్పటికి, ఇప్పటికే ద్రవ్యలోటు 115 శాతానికి ఎగబాకింది. 

బీపీసీఎల్‌ వాటా రూ.60,000 కోట్లు...
బీపీసీఎల్‌(భారత్‌ పెట్రోలియమ్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌)లో కేంద్రానికి 53 శాతం వాటా ఉంది. ఈ వాటా విక్రయం కారణంగా ఖజానాకి రూ.60,000 కోట్లు లభిస్తాయి.  షిప్పింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియాలో వాటా విక్రయం ద్వారా రూ.2,000 కోట్లు లభించనున్నాయి. ఇక కంటైనర్‌ కార్పొ డిజిన్వెస్ట్‌మెంట్‌ ద్వారా రూ.13,000 కోట్లు లభించే అవకాశాలున్నాయి.

ఎయిరిండియా ప్రైవేటీకరణ తప్పదు: యూనియన్లకు స్పష్టం చేసిన కేం‍ద్ర మంత్రి హర్‌దీప్ సింగ్ పురి

దాదాపు రూ. 80,000 కోట్ల పైగా రుణభారం పేరుకుపోయిన ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియాను ప్రైవేటీకరించడం తప్ప మరో మార్గం లేదని పౌర విమానయాన శాఖ మంత్రి హర్‌దీప్ సింగ్‌ పురి స్పష్టం చేశారు. ప్రైవేటీకరణ ప్రక్రియకు ఉద్యోగులంతా సహకరించాలని పేర్కొన్నారు. ఎయిరిండియాకు చెందిన కొన్ని యూనియన్ల నేతలతో గురువారం జరిగిన సమావేశంలో ఆయన ఈ విషయాలు స్పష్టం చేశారు. అయితే, ప్రైవేటీకరణ ప్రణాళికలపై యూనియన్లు అభ్యంతరం వ్యక్తం చేశాయి. ప్రభుత్వం కొంత మద్దతునిస్తే కంపెనీని నిర్వహించుకోగలిగే సామర్థ్యం ఉద్యోగులకు ఉందని పేర్కొన్నాయి.

 
ప్రైవేటీకరించినా.. ఉద్యోగ భద్రత వంటి విషయాల్లో ఉ‍ద్యోగుల్లో నెలకొన్న ఆందోళనలను పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మంత్రి చెప్పినట్లు దాదాపు గంటపైగా సాగిన సమావేశం అనంతరం యూనియన్ ప్రతినిధి ఒకరు తెలిపారు. "ఎయిరిండియా రుణభారం రూ. 80,000 కోట్ల పైగా ఉందని, ఏ నిపుణుడి దగ్గరా దీనికి పరిష్కార మార్గాలు లేవని మంత్రి చెప్పారు. ఈ పరిస్థితుల్లో కంపెనీని ప్రైవేటీకరించడం ఒక్కటే ప్రభుత్వం ముందున్న మార్గమని తెలిపారు" అని ప్రతినిధి వివరించారు. మరోవైపు, ప్రైవేటీకరణపై యూనియన్ల ప్రతినిధులతో సుదీర్ఘంగా, ఉపయోగకరమైన విధంగా చర్చలు జరిగాయని మైక్రోబ్లాగింగ్ సైటు ట్విటర్‌లో మంత్రి పోస్ట్ చేశారు. మరో 10 రోజుల్లో మళ్లీ సమావేశం కానున్నట్లు పేర్కొన్నారు. You may be interested

అనంతపురంలో 30 ఎకరాల్లో లాజిస్టిక్‌ పార్క్‌

Friday 3rd January 2020

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ముంబైకి చెందిన గ్రేడ్‌–ఏ ఇండస్ట్రియల్, లాజిస్టిక్‌ పార్క్స్‌ డెవలపర్‌ ఇండోస్పేస్‌ ఆంధ్రప్రదేశ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. అనంతపురంలో 30 ఎకరాల్లో  భారీ లాజిస్టిక్‌ పార్క్‌ను ఏర్పాటు చేయనుంది. ఇది బెంగళూరు – హైదరాబాద్‌ జాతీయ రహదారి–44కు సమీపంలో ఉండటంతో పాటూ కృష్ణపట్నం నౌకాశ్రయానికి కనెక్టివిటీతో ఉంటుందని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. ఇండోస్పేస్‌ను సింగపూర్‌ ప్రధాన కేంద్రంగా ఉన్న రియల్‌ ఎస్టేట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ కంపెనీ ఎవర్‌స్టోన్‌ గ్రూప్‌ ప్రమోట్‌

చౌకగా మరిన్ని చానళ్లు..

Friday 3rd January 2020

(అప్‌డేటెడ్‌...) ట్రాయ్ కొత్త టారిఫ్ ఆర్డరు ఉచిత చానళ్ల సంఖ్య పెంపు మార్చి నుంచి అందుబాటులోకి న్యూఢిల్లీ: కేబుల్ టీవీ చార్జీల భారాన్ని కాస్త తగ్గించేలా టెలికం రంగ నియంత్ర౾ణ సంస్థ ట్రాయ్ తాజాగా కొత్త టారిఫ్ ఆర్డరు ప్రకటించింది. దీంతో మరిన్ని చానళ్లు.. ఇంకాస్త చౌక రేటుకు అందుబాటులోకి రానున్నాయి. ట్రాయ్ తన వెబ్‌సైట్‌లో ఉంచిన ఆర్డరు ప్రకారం.. ఉచిత చానళ్ల సంఖ్య పెరగనుండగా, పే చానళ్ల చార్జీలు తగ్గనున్నాయి. అలాగే, వివిధ చానళ్లను

Most from this category