News


బడ్జెట్‌- డిజిన్వెస్ట్‌మెంట్‌ లక్ష్యం రూ. 1.2 లక్షల కోట్లు

Sunday 2nd February 2020
news_main1580621247.png-31437

కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించిన బడ్జెట్‌లో వచ్చే ఆర్థిక సంవత్సరానికి(2020-21) డిజిన్వెస్ట్‌మెంట్‌ ద్వారా రూ. 1.2 లక్షల కోట్లను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2019-20)లో డిజిన్వెస్ట్‌మెంట్‌ ద్వారా సమీకరించనున్న రూ. 65,000 కోట్లతో పోలిస్తే ఇది దాదాపు రెట్టింపుకావడం గమనార్హం! కాగా.. నిజానికి ప్రభుత్వం ఈ ఏడాది ప్రభుత్వ రంగ కంపెనీలలో వాటాల విక్రయం(డిజిన్వెస్ట్‌మెంట్‌) ద్వారా రూ. 1.05 లక్షల కోట్లను సమీకరించాలని భావించింది. అయితే ఇప్పటివరకూ ప్రభుత్వం రూ. 18,000 కోట్లను మాత్రమే సమకూర్చుకోగలిగింది. దీంతో ఈ ఏడాది డిజిన్వెస్ట్‌మెంట్‌ లక్ష్యాన్ని రూ. 65,000 కోట్లకు ప్రభుత్వం సవరించింది. 



You may be interested

అన్నం లేదు.. ఆవకాయ మాత్రమే!!

Sunday 2nd February 2020

ఆదాయపు పన్ను రేట్లు తగ్గించిన ఆర్థికమంత్రి నాలుగు శ్లాబుల స్థానంలో కొత్తగా ఏడు శ్లాబులు కానీ కొత్త విధానంలో 70 రకాల మినహాయింపులు తొలగింపు దీంతో పన్ను రేటు తగ్గినా భారం మాత్రం తగ్గదంటున్న నిపుణులు పాత విధానమా? కొత్త విధానమా? అనేది చెల్లింపుదారు ఇష్టం రెండు విధానాల్లోనూ రూ.5 లక్షల లోపు ఆదాయానికి పన్ను లేదు కొత్త విధానంలో రూ.5- 7.5 లక్షల ఆదాయం ఉంటే 20 నుంచి 10 శాతానికి 10-12.5 లక్షల ఆదాయం ఉన్న వారికి

కొంచెం పెరిగిన సబ్సిడీ బిల్లు

Sunday 2nd February 2020

ఆహార, ఇంధన, ఎరువులపై కేంద్ర సబ్సిడీల బిల్లు స్వల్పంగా 0.23 శాతం పెరిగి 2020-21లో రూ.2,27,793.89 లక్షల కోట్లకు చేరింది. సవరించిన అంచనాల ప్రకారం- ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ బిల్లు దాదాపు రూ.2,27,255 కోట్లు.  ఆహారధాన్యాలకు సంబంధించి సబ్సిడీ 6.33 శాతం పెరుగుదలతో రూ.1,08,688.35 కోట్ల నుంచి రూ.1,15,569.68 కోట్లకు పెరగనుంది.  ఎల్‌పీజీ, కిరోసిన్‌సహా ఫ్యూయెల్‌ సబ్సిడీల భారం రూ.38,568.86 కోట్ల నుంచి రూ.40,915.21 కోట్లకు చేరుతుందని అంచనా. ఒక్క ఎల్‌పీజీ

Most from this category