News


బిల్లు తీసుకుంటే రూ. 1 కోటి దాకా నజరానా

Wednesday 5th February 2020
news_main1580873335.png-31515

  • జీఎస్‌టీని ప్రోత్సహించేందుకు కేంద్రం ప్లాన్‌
  • రూ. 10 లక్షల నుంచి రూ. 1 కోటి దాకా లాటరీ

న్యూఢిల్లీ: వస్తు, సేవల పన్నుల (జీఎస్‌టీ) విధానాన్ని మరింత పకడ్బందీగా అమలు చేయడంపై కేంద్రం దృష్టి పెట్టింది. కొన్న ప్రతీ వస్తువుకు విక్రేతల నుంచి కచ్చితంగా బిల్లు తీసుకునేలా కొనుగోలుదారులను ప్రోత్సహించే చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా రూ. 10 లక్షల నుంచి రూ. 1 కోటి దాకా బహుమతులు ఇచ్చేలా లాటరీని ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. కేంద్రీయ పరోక్ష పన్నులు, కస్టమ్స్‌ బోర్డు (సీబీఐసీ) సభ్యుడు జాన్ జోసెఫ్ ఈ విషయాలు తెలిపారు. జీఎస్‌టీ కింద తీసుకునే ప్రతీ బిల్లుతోనూ కస్టమర్లు.. లాటరీలో పాల్గొనేందుకు అవకాశం ఉంటుందని ఆయన వివరించారు. "కొనుగోలుదారులను ఆకట్టుకునేందుకే లాటరీ బిల్లు భారీ స్థాయిలో పెడుతున్నాం. కాబట్టి బిల్లు తీసుకోకుండా 28 శాతం (గరిష్ట జీఎస్‌టీ) పొదుపు చేయడం కన్నా రూ. 10 లక్షలో లేదా రూ. 1 కోటి దాకా గెలవడానికి అవకాశం ఉంటుంది కదా అని కొనుగోలుదారులు ఆలోచించడానికి ఆస్కారం ఉంటుంది. పన్నుల చెల్లింపుపై కొనుగోలుదారుల ఆలోచనా ధోరణులను మార్చేందుకు ఇలాంటివి ఉపయోగపడగలవు" అని ఆయన పేర్కొన్నారు. ప్రణాళిక ప్రకారం లాటరీలో పాల్గొనాలంటే కనీస బిల్లు మొత్తం ఉంటుంది. వినియోగదారుల సంక్షేమ నిధి నుంచి లాటరీ మొత్తాన్ని చెల్లిస్తారు. కొనుగోలుదారుల నుంచి అధిక మొత్తాలు వసూలు చేసి లాభాలు ఆర్జించిన వ్యాపార సంస్థలపై విధించిన జరిమానాలను ఈ నిధికి బదలాయిస్తున్నారు. You may be interested

12000 పైన ప్రారంభమైన నిఫ్టీ

Wednesday 5th February 2020

ప్రపంచమార్కెట్లను నుంచి సానుకూల సంకేతాలను అందిపుచ్చకున్న దేశీయ మార్కెట్‌ బుధవారం వరుసగా మూడోరోజూ లాభంతో మొదలైంది. సెన్సెక్స్‌ 132.33 పాయింట్ల​లాభంతో 40,921.71 వద్ద, నిఫ్టీ 26.2 పాయింట్లు పెరిగి 12వేలపై 12,005.85 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. కరోనా వైరస్‌తో కారణంగా గాడి తప్పిన ఆర్థిక వ్యస్థను చక్కదిద్దేందుకు పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా ఈ ఫిబ్రవరి 20న జరిగే సమావేశంలో కీలక రుణ రేటును తగ్గిస్తుందని, రాబోయే వారాల్లో బ్యాంకుల

సంశయం వద్దు... పెట్టుబడులు పెట్టు!

Wednesday 5th February 2020

 పారిశ్రామిక రంగానికి ఆర్థికమంత్రి విజ్ఞప్తి న్యూఢిల్లీ: ఆర్థికాభివృద్ధికి పెట్టుబడులు పెట్టాలని, ఈ విషయంలో ఎటువంటి సంశయాలకూ తావివ్వవద్దని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ పారిశ్రామిక రంగానికి విజ్ఞప్తి చేశారు. 2020-21 వార్షిక బడ్జెట్‌పై సీఐఐ మంగళవారం ఇక్కడ నిర్వహించిన ఒక చర్చాగోష్టిలో ఆమె ప్రసంగించారు. పారిశ్రామిక రంగం పురోగతికి ప్రభుత్వం తగిన అన్ని చర్యలూ తీసుకుంటుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు.  కేవలం ప్రభుత్వ వ్యయాలే వృద్ధికి తోడ్పాటును అందిస్తాయని తాను భావించడం

Most from this category