News


డీహెచ్‌ఎఫ్‌ఎల్‌పై ఎస్‌ఎఫ్‌ఐవో దర్యాప్తు

Saturday 2nd November 2019
news_main1572667529.png-29298

న్యూఢిల్లీ: రుణాల సంస్థ దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ (డీహెచ్‌ఎఫ్‌ఎల్‌)లో ఆర్థిక అవకతవకల ఆరోపణలపై కేంద్రం దృష్టి సారించింది. నిధుల మళ్లింపు ఆరోపణలకు సంబంధించి ఆధారాలు బైటపడుతుండటంతో.. ఈ వ్యవహారంపై విచారణ జరపాలంటూ తీవ్ర ఆర్థిక నేరాల దర్యాప్తు సంస్థ (ఎస్‌ఎఫ్‌ఐవో)ను ఆదేశించింది. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాల్లో దాదాపు రూ. 31,000 కోట్లను డొల్ల కంపెనీల ద్వారా డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ ప్రమోటర్లు మళ్లించేశారని ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. వీటిని క్షుణ్నంగా పరిశీలించిన మీదట ఎస్‌ఎఫ్‌ఐవోకు.. కార్పొరేట్ వ్యవహారాల శాఖ తాజా ఆదేశాలిచ్చింది. 



You may be interested

గూగుల్ చేతికి ఫిట్‌బిట్‌

Saturday 2nd November 2019

2.1 బిలియన్ డాలర్ల డీల్‌ వాషింగ్టన్‌: టెక్ దిగ్గజం గూగుల్ తాజాగా వేరబుల్ టెక్నాలజీ సంస్థ ఫిట్‌బిట్‌ను కొనుగోలు చేయనున్నట్లు ప్రకటించింది. ఈ డీల్ విలువ 2.1 బిలియన్ డాలర్లుగా ఉంటుందని ఇరు సంస్థలు ఒక ప్రకటనలో తెలిపాయి. ఆరోగ్యవంతమైన జీవనం సాగించేందుకు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 2.8 కోట్ల మంది యాక్టివ్ యూజర్లు తమ ఉత్పత్తులను విశ్వసిస్తున్నారని ఈ సందర్భంగా ఫిట్‌బిట్‌ సహ-వ్యవస్థాపకుడు, సీఈవో జేమ్స్ పార్క్ తెలిపారు. అత్యుత్తమమైన హార్డ్‌వేర్‌,

మొత్తం బాకీలన్నీ మాఫీ చేయండి

Saturday 2nd November 2019

లేకపోతే జరిమానాలు, వడ్డీల భారమైనా తగ్గించండి బకాయిల చెల్లింపునకు 2 ఏళ్ల మారటోరియం ఇవ్వండి స్పెక్ట్రం, లైసెన్సు ఫీజులపై కేంద్రానికి సీవోఏఐ మరో లేఖ న్యూఢిల్లీ: లైసెన్సు ఫీజులు, స్పెక్ట్రం యూసేజీ చార్జీల బకాయిలపై టెలికం సంస్థల సమాఖ్య సీవోఏఐ తాజాగా మరోసారి కేంద్రానికి లేఖ రాసింది. టెలికం రంగం తీవ్ర ఆర్థిక సంక్షోభ పరిస్థితుల్లో ఉన్న నేపథ్యంలో ఎయిర్‌టెల్, వొడాఫోన్‌-ఐడియాలతో పాటు మిగతా టెల్కోల మొత్తం పాత బకాయీలు (సుమారు రూ. 1.42

Most from this category