News


ఎఫ్‌డీఐ సవరణలు నోటిఫై

Thursday 19th September 2019
news_main1568864862.png-28421

న్యూఢిల్లీ: విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(ఎఫ్‌డీఐ)లకు సంబంధించి ఇటీవలి సవరణ నిబంధనలను ప్రభుత్వం నోటిఫై చేసింది. కోల్‌ మైనింగ్‌, కాంట్రాక్ట్‌ మ్యాన్యుఫాక్చరింగ్‌, సింగిల్‌ బ్రాండ్‌ రిటైల్‌ ట్రేడింగ్‌లో ఇటీవలి నిర్ణయాలను డీపీఐఐటీ నోటిఫై చేసింది. వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో కార్యకలాపాలు నిర్వహించే డీపీఐఐటీ(డిపార్ట్‌మెంట్‌ ఫర్‌ ప్రమోషన్‌ ఆఫ్‌ ఇండస్ట్రీ అండ్‌ ఇంటర్నల్‌ ట్రేడ్‌) ఎఫ్‌డీఐలకు సంబంధించిన విషయాలను చూస్తోంది. డిజిటల్‌ మీడియా రంగంలో 26 శాతం మేర ఎఫ్‌డీఐలను అనుమతించే నిర్ణయా‍న్ని కూడా డీపీఐఐటీ నోటిఫై చేసింది. అయితే ఈ విషయమై పరిశ్రమ వర్గాలు, నిపుణుల నంఉచి అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. కోల్‌ మైనింగ్‌, కాంట్రాక్ట్‌ మ్యాన్యుఫాక్చరింగ్‌ రంగాల్లో వంద శాతం ఎఫ్‌డీఐలను అనుమతిస్తూ గత నెల 28న ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. 



You may be interested

ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌పై రూ.10 లక్షల జరిమానా

Thursday 19th September 2019

45 రోజుల్లో చెల్లించాలి  ఆదేశించిన సెబీ  న్యూఢిల్లీ: ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌(ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లీజింగ్‌ అండ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌) కంపెనీపై మార్కెట్‌ నియంత్రణ సంస్థ, సెబీ రూ.10 లక్షల జరిమానా విధించింది. రైట్స్‌ ఇష్యూ ద్వారా పెట్టుబడుల సమీకరణ, ఆస్తుల విక్రయానికి సంబంధించిన సమాచారాన్ని బీఎస్‌ఈకి వెల్లడించనందుకు సెబీ ఈ జరిమానా విధించింది. ఈ మొత్తాన్ని 45 రోజుల్లో చెల్లించాలని ఆదేశించింది. గత ఏడాది జూలైలో రైట్స్‌ ఇష్యూ ద్వారా రూ.4,500 కోట్లు సమీకరించాలని ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ డైరెక్టర్ల​

నష్టాల ప్రారంభం

Thursday 19th September 2019

రెండు రోజుల పతనం తర్వాత క్రితం రోజు స్వల్పంగా కోలుకున్న భారత్‌ స్టాక్‌ సూచీలు గురువారం తిరిగి నష్టాలతో మొదలయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 75 పాయింట్ల నష్టంతో 36,500 పాయింట్ల సమీపంలోనూ, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 30 పాయింట్ల నష్టంతో 10,810 పాయింట్ల సమీపంలోనూ మొదలయ్యాయి. గత రాత్రి అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ పావుశాతం మేర వడ్డీ రేట్లు తగ్గించినప్పటికీ, ఈ ఏడాది ఇక రేట్ల కోత వుండబోదని సంకేతాలివ్వడంతో ఆసియా

Most from this category