News


టెలికామ్‌కు బెయిలవుట్‌?

Wednesday 30th October 2019
Markets_main1572406621.png-29221

  • సాధ్యాసాధ్యాలపై సెక్రటరీల కమిటీ ఏర్పాటు

న్యూఢిల్లీ:  టెల్కోల నుంచి భారీగా రూ. 92,000 కోట్లు రాబట్టుకోవడానికి సుప్రీంకోర్డు డాట్‌ (టెలకమ్యూనిషన్ల శాఖ)కు అనుమతించిన నేపథ్యంలో- ఆయా కంపెనీల ఆర్థిక స్థితిగతులపై సమీక్షించి, తగిన సలహాలు ఇవ్వడానికి కేంద్రం మంగళవారం ఒక సెక్రటరీల కమిటీ (సీఓఎస్‌)ని ఏర్పాటు చేసింది. సుప్రీం రూలింగ్‌ నేపథ్యంలో- టెలికం రంగం తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి జారే అవకాశం ఉందన్న ఆందోళనల నేపథ్యంలో కేంద్రం ఈ కమిటీని ఏర్పాటు చేయడం గమనార్హం. టెలికంకు భారీ బెయిలవుట్‌ ప్యాకేజీ ఇవ్వడానికి కేంద్రం మొగ్గు చూపుతోందని, ఇందుకు సంబంధించి సాధ్యాసాధ్యాలపై సెక్రటరీల కమిటీ దృష్టి సారిస్తుందని వార్తలు వస్తున్నాయి. కమిటీకి క్యాబినెట్‌ కార్యదర్శి రాజీవ్‌ గౌబా నేతృత్వం వహిస్తారు. భారతీ ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌-ఐడియాల వంటి సర్వీస్‌ ప్రొవైడర్లు ఎదుర్కొంటున్న ‘‘ఆర్థిక ఒత్తిడి’’ని ‘‘అన్ని కోణాల్లో’’ పరిశీలించి,  తీవ్రతను తగ్గించడానికి సూచనలు ఇవ్వడానికి కమిటీ ఏర్పాటయినట్లు టెలికం వర్గాలు తెలిపాయి.  ఆర్థిక, న్యాయ, టెలికం కార్యదర్శులు కమిటీలో సభ్యులుగా ఉన్నారు. కమిటీ త్వరలో సమావేశమై, ఒక నిర్దిష్ట కాల వ్యవధిలో తన సిఫారసులను కేంద్రానికి సమర్పిస్తుందని సమాచారం. 

ప్యాకేజ్‌లో ఏముంటాయ్‌?

  • స్పెక్ర్టమ్‌ చార్జీల తగ్గింపు
  • ఉచిత మొబైల్‌ ఫోన్‌ కాల్స్‌కు ముగింపు
  • చౌక డేటా టారిఫ్‌లకు సెలవు చెప్పడం
  • నగదు లభ్యతలో ఇబ్బందులు తలెత్తకుండా 2020-21, 2021-22కు సంబంధించి స్పెక్ర్టమ్‌ వేలం చెల్లింపుల వాయిదా వేయడం. 
  • యూఎస్‌ఓఎఫ్‌ (యూనివర్షల్‌ సర్వీస్‌ ఆబ్లిగేషన్‌ ఫండ్‌) చార్జ్‌ని 3 శాతానికి తగ్గించడం. 

నేపథ్యం ఇదీ...
కొత్త టెలికం విధానం ప్రకారం.. టెల్కోలు తమ సవరించిన స్థూల రాబడి (ఏజీఆర్‌)లో నిర్దిష్ట వాటాను ప్రభుత్వానికి వార్షిక లైసెన్సు ఫీజుగా కట్టాల్సి ఉంటుంది. దీనితో పాటు స్పెక్ట్రం వినియోగానికి గాను నిర్దిష్ట చార్జీలు (ఎస్‌యూసీ) చెల్లించాలి. అయితే ఈ ఏజీఆర్‌ లెక్కింపు విషయంలో వివాదం నెలకొంది. అద్దెలు, స్థిరాస్తుల విక్రయంపై లాభాలు, డివిడెండు మొదలైన టెలికంయేతర ఆదాయాలు కూడా ఏజీఆర్‌ కిందే వస్తాయని, దానిపైనే లైసెన్సు ఫీజు కట్టాల్సి ఉంటుందని టెలికం వివాదాల పరిష్కార, అపీలేట్‌ ట్రిబ్యునల్‌ (టీడీశాట్‌) గతంలో ఆదేశాలు ఇచ్చింది. దీనివల్ల ప్రభుత్వానికి చెల్లించాల్సిన లైసెన్సు, స్పెక్ట్రం యూసేజీ చార్జీల భారం భారీగా పెరిగిపోనుండటంతో టీడీశాట్‌ ఆదేశాలను సవాల్‌ చేస్తూ టెల్కోలు .. సుప్రీం కోర్టును ఆశ్రయించాయి. దీనిపై జూలైలో అఫిడవిట్‌ దాఖలు చేసిన కేంద్రం తమ వాదనలు వినిపించింది. అప్పటిదాకా టెల్కోలు రూ. 92,000 కోట్ల మేర లైసెన్సు ఫీజులు బకాయి పడ్డాయని తెలిపింది. తాజాగా ప్రభుత్వ వాదనలతో ఏకీభవిస్తూ సుప్రీం కోర్టు ఆదేశాలిచ్చింది. ఈ ఏడాది జూలై నాటికి డాట్‌ లెక్కల ప్రకారం ఎయిర్‌టెల్‌ అత్యధికంగా రూ. 21,682.13 కోట్లు, వొడాఫోన్‌ రూ. 19,823.71 కోట్లు లైసెన్సు ఫీజు కింద బకాయి పడ్డాయి. 
 



You may be interested

హిందుస్తాన్‌ జింక్‌ లాభం రూ.2,081 కోట్లు

Wednesday 30th October 2019

15 శాతం వృద్ధి  రూ.5,101 కోట్లకు మొత్తం ఆదాయం  న్యూఢిల్లీ: వేదాంత గ్రూప్‌నకు చెందిన హిందుస్తాన్‌ జింక్‌ కంపెనీ ఈ ఆర్థిక సంవత్సరం(2019-20) సెప్టెంబర్‌ త్రైమాసికంలో రూ.2,081 కోట్ల నికర లాభం సాధించింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ2లో ఆర్జించిన నికర లాభం, రూ.1,815 కోట్లుతో పోల్చితే 15 శాతం వృద్ధి సాధించామని హిందుస్తాన్‌ జింక్‌ తెలిపింది. మొత్తం ఆదాయం మాత్రం రూ.5,175 కోట్ల నుంచి రూ.5,101 కోట్లకు తగ్గిందని కంపెనీ చైర్మన్‌

సౌదీ ఆరామ్‌కో ఐపీఓ డిసెంబర్‌లో !

Wednesday 30th October 2019

డిసెంబర్‌ 11న సౌదీ స్టాక్‌ మార్కెట్లో లిస్టింగ్‌  దుబాయ్‌: ఇంధన దిగ్గజం సౌదీ ఆరామ్‌కో కంపెనీ ఈ ఏడాది డిసెంబర్‌ 11న రియాద్‌ స్టాక్‌ మార్కెట్లో ఆరంగేట్రం చేయనున్నది. సౌదీ తాదవుల్‌ ఎక్స్చేంజ్‌లో సౌదీ ఆరామ్‌కో కంపెనీ షేర్లు ఆ రోజున లిస్టవుతాయని సౌదీ అరేబియాకు చెందిన అల్‌ అరేబియా టీవీ చానెల్‌ వెల్లడించింది. సౌదీ ఆరామ్‌కో ఐపీఓ(ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌)కు సంబంధించిన టైమ్‌ టైబుల్‌ను వచ్చే నెల 3న సౌదీ

Most from this category