గ్యాస్ ధర 12 శాతం తగ్గింపు
By Sakshi

న్యూఢిల్లీ: దేశీయ సహజ వాయువు ధరను కేంద్ర ప్రభుత్వం 12 శాతం తగ్గించింది. రెండున్నరేళ్ల కాలంలో గ్యాస్ ధరను కేంద్రం తగ్గించడం ఇదే మొదటిసారి. ఓఎన్జీసీ, ఆయిల్ ఇండియాలు ఉత్పత్తి చేసే గ్యాస్ ధరను ఒక్కో మిలియన్బ్రిటిష్ థర్మల్ యూనిట్‌కు 3.69 డాలర్ల నుంచి 3.23 డాలర్లకు తగ్గించింది. అలాగే రిలయన్స్ ఇండస్ట్రీస్ నేతృత్వంలోని కేజీ-డీ6 వంటి కష్ట సాధ్యమైన చమురు క్షేత్రాల్లో ఉత్పత్తయ్యే గ్యాస్ ధరను ఒక్కో మిలియన్ బ్రిటిష్ థర్మల్ యూనిట్‌కు 9.32 డాలర్ల నుంచి 8.43 డాలర్లకు తగ్గించింది. ఈ తగ్గింపు ఈ నెల 1 నుంచి ఆరు నెలల పాటు వర్తిస్తుందని ప్రభుత్వం పేర్కొంది. ప్రతి ఆరు నెలలకు కొకసారి గ్యాస్ ధరలను ప్రభుత్వం నిర్ణయిస్తోంది. ఈ తగ్గింపుతో సీఎన్జీ, పీఎన్జీ ధరలు తగ్గుతాయి. అయితే ఓఎన్జీసీ, రిలయన్స్ ఇండస్ట్రీస్‌ల లాభాలు మాత్రం తగ్గుతాయి.
You may be interested
మంగళవారం వార్తల్లోని షేర్లు
Tuesday 1st October 2019వివిధ వార్తలకు అనుగుణంగా మంగళవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు వాహన కంపెనీలు నేడు ఆగస్ట్ నెల విక్రయ గణాంకాలను విడుదల చేయనున్న నేపధ్యంలో అటో రంగ షేర్లులో యాక్టివిటీ అధికంగా ఉండే అవకాశం ఉంది. బీపీసీఎల్, కంటైనర్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా, షిప్పింగ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా:- గ్రూప్ ఆఫ్ సెక్రటరీస్ ప్యానెల్ బీపీసీఎల్, షిప్పింగ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియాలో మొత్తం వాటాను విక్రయించడంతో సహా 5 కంపెనీలలో పెట్టుబడుల ఉపసంహరణకు ఆమోదం
హైదరాబాద్‌లో 32 శాతం తగ్గిన గృహ విక్రయాలు
Tuesday 1st October 2019హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హైదరాబాద్‌లో గృహాల అమ్మకాలు తగ్గుముఖం పట్టాయి. ఈ ఏడాది జులై– సెప్టెంబర్ త్రైమాసికంలో నగరంలో 3,280 గృహాలు విక్రయమయ్యాయి. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 32 శాతం తక్కువని అనరాక్ ప్రాపర్టీ కన్సల్టెన్సీ నివేదిక తెలిపింది. సబ్ వెన్షన్ స్కీమ్ రద్దు, మార్కెట్ సెంటిమెంట్, ఆర్ధిక మందగమనం వంటి కారణాల వల్ల విక్రయాలు తగ్గాయని అనరాక్ ప్రాపర్టీ కన్సల్టెన్సీ చైర్మన్ అనూజ్ పూరీ తెలిపారు.