విక్రయించినా దేశీ సంస్థల చేతుల్లోనే ఎయిరిండియా
By Sakshi

న్యూఢిల్లీ: భారీ రుణభారంతో కుంగుతున్న ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియాలో వాటాల వ్యూహాత్మక విక్రయానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి తెలిపారు. అయితే, వాటాలు విక్రయించినప్పటికీ ఎయిరిండియా భారతీయుల చేతుల్లోనే ఉండాలని కేంద్రం భావిస్తోందని ఆయన చెప్పారు. ౾గతంలో ఎయిరిండియా డిజిన్వెస్ట్‌మెంట్ కోసం చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయని, ఈ నేపథ్యంలో ఇందుకోసం ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేస్తున్నామని మంత్రి వివరించారు. ఎయిరిండియా పనితీరు చాలా బాగా ఉందని, కాకపోతే అధిక రుణభారం, వడ్డీలే పెద్ద సమస్యగా మారాయని గురువారం లోక్‌సభలో ఆయన చెప్పారు. "ఎయిరిండియా ఒక అత్యుత్తమ అసెట్లాంటింది. దానికి 125 విమానాలు ఉన్నాయి. దాదాపు సగం విమానాలు 40 అంతర్జాతీయ రూట్లలో, 80 విమానాలు దేశీయంగా వివిధ రూట్లలో నడుస్తున్నాయి. కంపెనీ పనితీరు చాలా బాగుంది. కానీ మోయలేనంత రుణభారమే పెద్ద సమస్య. ఆ రుణాలపై భారీగా వడ్డీలు కట్టాల్సి వస్తుండటం మరో సమస్య" అని పురి వివరించారు. దేశీ విమానయాన మార్కెట్ క్షీణిస్తోందన్న వార్తలన్నీ అపోహలేనని ఆయన కొట్టి పారేశారు. వాస్తవానికి ఇది 17 శాతం వార్షిక వృద్ధి నమోదు చేస్తోందని చెప్పారు.
You may be interested
కళ్యాణి రఫేల్‌కు భారీ కాంట్రాక్టు
Friday 12th July 2019రఫేల్ నుంచి రూ.685 కోట్ల ఆర్డరు తెలంగాణలో మరో ప్లాంటు పెడతాం కళ్యాణి గ్రూప్ చైర్మన్ బాబా కళ్యాణి హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కళ్యాణి రఫేల్ అడ్వాన్స్డ్ సిస్టమ్స్ భారీ కాంట్రాక్టును చేజిక్కించుకుంది. ఇజ్రాయెల్‌కు చెందిన రఫేల్ నుంచి సుమారు రూ.685 కోట్ల విలువైన ఆర్డరును దక్కించుకుంది. ఇందులో భాగంగా బరాక్-8 మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైల్ కోసం 1,000 కిట్లను సరఫరా చేయాల్సి ఉంటుంది. వీటిని రఫేల్.. బీడీఎల్‌కు అప్పగిస్తుంది.
భూముల అమ్మకంతో బీఎస్ఎన్ఎల్కు ఊపిరి!
Friday 12th July 2019అమ్మదగిన భూముల గుర్తింపు విలువ రూ.20,000 కోట్లుగా అంచనా న్యూఢిల్లీ: తీవ్ర రుణ భారంతో ఉన్న ప్రభుత్వరంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్, దేశవ్యాప్తంగా తన ఆధీనంలో ఉన్న భూముల విక్రయంపై దృష్టి సారించింది. ఈ భూముల విలువ రూ.20,000 కోట్లు ఉంటుందని అంచనా. విక్రయించాల్సిన భూముల జాబితాను పెట్టుబడులు, ప్రజా ఆస్తుల నిర్వహణ విభాగానికి (దీపమ్) పంపింది. ఏటేటా ఆదాయాలు పడిపోతూ, నష్టాలు పెరిగిపోతున్న క్లిష్ట పరిస్థితుల్లో... భూములు, మొబైల్ టవర్లు, ఫైబర్