News


పాస్‌వర్డ్‌లు చోరీ ‍అయ్యాయి.. జాగ్రత్త..

Friday 20th December 2019
news_main1576813913.png-30328

  • భారత్‌లో యూజర్లను అప్రమత్తం చేసిన గూగుల్‌

న్యూఢిల్లీ: నిర్దిష్ట వెబ్‌సైట్లను ఉపయోగించే వారి పాస్‌వర్డ్‌లు చోరీకి గురై ఉంటాయని, వాటిని తక్షణమే మార్చుకోవాలని భారత్‌లోని యూజర్లను టెక్ దిగ్గజం గూగుల్‌ అప్రమత్తం చేసింది. మీడియా సంస్థలు మొదలుకుని సామాన్య యూజర్ల దాకా చాలా మంది ల్యాప్‌టాప్‌లు, డెస్క్‌టాప్‌లు, మొబైల్‌ స్క్రీన్‌లపై గురువారం ఈ మేరకు నోటిఫికేషన్లు ప్రత్యక్షమయ్యాయి. డేటా లీకేజీ కారణంగా పాస్‌వర్డ్‌లు చోరీకి గురై ఉంటాయని వీటిల్లో గూగుల్ పేర్కొంది. ఆహారోత్పత్తులు విక్రయించే ఫ్రెష్‌హోమ్ అనే ఈ-కామర్స్‌ పోర్టల్‌లోకి లాగిన్ అయ్యేందుకు ప్రయత్నించగా వార్నింగ్ పాప్ అప్ వచ్చినట్లు ఓ యూజరు వెల్లడించారు. అలాగే తమ గ్రూప్‌నకు చెందిన ఓ పోర్టల్‌లో లాగిన్ అయ్యే క్రమంలో ఇలాంటి నోటిఫికేషన్‌ ప్రత్యక్షమైనట్లు ఓ మీడియా సంస్థ వర్గాలు తెలిపాయి. క్రోమ్‌ 79లో బగ్‌ను గూగుల్‌ అతికష్టం మీద సరిచేయగా ఇంతలోనే మళ్లీ పాస్‌వర్డ్‌ల చోరీ అలర్ట్‌లు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. పాస్‌వర్డ్‌లకు మరింత భద్రత కల్పించే విధంగా క్రోమ్‌ 79 బ్రౌజరును గూగుల్ తీర్చిదిద్దింది. 



You may be interested

చర్చలో ప్రధానాంశం ఉల్లిపాయే!

Friday 20th December 2019

ఆర్‌బీఐ ద్రవ్య సమీక్షా సమావేశ మినిట్స్‌ వివరాలు వెల్లడి న్యూఢిల్లీ: రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) ఈ నెల మొదటి వారంలో మూడు (3-5 తేదీల మధ్య) రోజులు నిర్వహించిన ద్రవ్య, పరపతి సమీక్షా సమావేశ మినిట్స్‌ వివరాలు గురువారం వెల్లడయ్యాయి. భారీగా పెరిగిన ఉల్లి ధరలపైనే ఈ సమావేశంలో ప్రధానంగా చర్చ జరిగినట్లు మినిట్స్‌ వెల్లడించాయి. సెప్టెంబర్‌ నుంచీ ఉల్లి ధరలు తీవ్రంగా ఉన్నాయి. ప్రస్తుతం దేశంలోని పలు

యమహా నుంచి 125 సీసీ స్కూటర్లు

Friday 20th December 2019

ఫ్యాసినో125ఎఫ్‌ఐ @ రూ.67,430 110 సీసీ స్కూటర్లకు మంగళం  చెన్నై: యమహా మోటార్‌ ఇండియా కంపెనీ 125 సీసీ స్కూటర్‌ సెగ్మెంట్లోకి ప్రవేశించింది. ఈ సెగ్మెంట్లో రెండు కొత్త మోడళ్లు- ఫ్యాసినో 125ఎఫ్‌ఐ, రేజర్‌125ఎఫ్‌ఐలను అందుబాటులోకి తెచ్చింది. ఫ్యాసినో స్కూటర్‌ ధరను రూ.67,430(ఎక్స్‌ షోరూమ్‌)గా నిర్ణయించామని కంపెనీ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ (స్ట్రాటజీ అండ్‌ ప్లానింగ్‌ గ్రూప్‌) రవీందర్‌ సింగ్‌ తెలిపారు. త్వరలో స్ట్రీట్‌ ర్యాలీ 125ఎఫ్‌ఐ మోడల్‌ స్కూటర్‌ను కూడా మార్కెట్లోకి

Most from this category