News


నెలకు రూ.64,167 కోట్ల లావాదేవీలు

Thursday 7th November 2019
news_main1573096590.png-29403

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో:- డిజిటల్‌ పేమెంట్‌ యాప్‌ ‘గూగుల్‌ పే’ వినియోగదార్ల సంఖ్య భారత్‌లో 6.7 కోట్లకు చేరుకుంది. 2018 సెప్టెంబరుతో పోలిస్తే ఈ ఏడాది సెప్టెంబరు నాటికి యాక్టివ్‌ యూజర్లు మూడు రెట్లు పెరిగారని గూగుల్‌ పే ఎండీ సజిత్‌ శివానందన్‌ బుధవారం తెలిపారు. వ్యాపారస్తుల కోసం గూగుల్‌ పే యాప్‌ను ఇక్కడ అందుబాటులోకి తెచ్చిన సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ‘2017 సెప్టెంబరులో గూగుల్‌ పే యాప్‌ను భారత్‌లో పరిచయం చేశాం. ఎనమిది భారతీయ భాషల్లో రూపొందించాం. 3 లక్షల నగరాలు, పట్టణాలు, గ్రామాల నుంచి మాకు కస్టమర్లున్నారు. మూడింట రెండొంతుల వినియోగదార్లు టాప్‌-7 నగరాల వెలుపల ఉన్నారు. మా కస్టమర్లంతా నెలకు సుమారు రూ.64,167 కోట్ల విలువైన లావాదేవీలు జరుపుతున్నారు. ఇక యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌ (యూపీఐ) లావాదేవీల సంఖ్య దేశంలో ఒక్క అక్టోబరులో 100 కోట్లు దాటాయి. రెండేళ్లలో యూపీఐ లావాదేవీలు 60 రెట్లు పెరిగాయి’ అని వివరించారు. కాగా, గ్లోబల్‌ పేమెంట్‌ కంపెనీలు భారతీయ కస్టమర్ల లావాదేవీల సమాచారాన్ని దేశీయంగానే భద్రపరచాలని ఆర్‌బీఐ గతంలో ఆదేశించింది. ఈ ఆదేశాలను అనుసరించి అందుకు తగ్గ ఏర్పాట్లు చేస్తున్నట్టు గూగుల్‌ పే వెల్లడించింది. 



You may be interested

గోప్యతకు వాట్సాప్‌లో మరో ఫీచర్‌

Thursday 7th November 2019

న్యూఢిల్లీ: యూజర్ల వివరాల గోప్యతకు సంబంధించి మెసేజింగ్ యాప్‌.. వాట్సాప్‌ కొత్త అప్‌డేట్‌ ప్రవేశపెట్టింది. దీనితో యూజరు అనుమతించిన వారు తప్ప మిగతావారెవరు సదరు యూజరు అనుమతి లేకుండా వారి పేర్లను గ్రూప్స్‌లో చేర్చే వీలుండదు. ఇందుకు సంబంధించి ప్రస్తుతం యాప్‌లో ఉన్న 'నోబడీ' ఆప్షన్‌ స్థానంలో 'మై కాంటాక్ట్స్ ఎక్సెప్ట్‌' అనే ఆప్షన్‌ను వాట్సాప్ ప్రవేశపెట్టింది. దీనితో గ్రూప్స్‌లో తనను చేర్చేందుకు ఎవరెవరికి అనుమతి ఇవ్వొచ్చు, ఎవరికి ఇవ్వొద్దు

బీఎస్‌ఎన్‌ఎల్‌లో వీఆర్ఎస్‌..

Thursday 7th November 2019

50 ఏళ్లు పైబడిన ఉద్యోగులకు వర్తింపు 80,000 మంది దాకా వినియోగించుకుంటారని అంచనా డిసెంబర్ 3 దాకా అవకాశం సంస్థకు రూ. 7,000 కోట్ల ఆదా న్యూఢిల్లీ: కేంద్రం అందిస్తున్న పునరుద్ధరణ ప్యాకేజీ ప్రకారం ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌ తమ ఉద్యోగులకు స్వచ్ఛంద పదవీ విరమణ పథకం (వీఆర్‌ఎస్‌) ప్రకటించింది. నవంబర్ 4 నుంచి డిసెంబర్ 3 దాకా ఈ పథకం అమల్లో ఉంటుంది. సుమారు 70,000-80,000 మంది దాకా ఉద్యోగులు దీన్ని

Most from this category