News


ట్రిలియన్‌ డాలర్ల క్లబ్‌లో గూగుల్‌

Friday 17th January 2020
news_main1579256628.png-30995

ఇంటర్‌నెట్‌ సెర్చింజన్‌ దిగ్గజం గూగుల్‌ మాతృసంస్థ అల్ఫాబెట్‌ గురువారం ఆర్థికంగా అరుదైన ఘనతను సాధించింది. కంపెనీ మార్కెట్‌ మొత్తం విలువ తొలిసారి 1ట్రిలియన్‌ డాలర్లకు చేరుకుంది. ఈ ఘనతను సాధించిన నాలుగో అమెరికా కంపెనీగా చరిత్ర పుటలకెక్కింది. గురువారం రాత్రి అమెరికా మార్కెట్లో టెక్నాలజీ షేర్లలో భాగంగా అల్ఫాబెట్‌ షేరు విలువ 0.76శాతం పెరగడంతో దాని మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ విలువ 1ట్రిలియన్‌ డాలర్లకు చేరుకుంది. టెక్‌ దిగ్గజం ఆపిల్‌ కంపెనీ 2018లో తొలిసారి ఈ మార్కును అందుకుంది. తర్వాత మెక్రోసాఫ్ట్‌, అమెజాన్‌ కంపెనీలు కూడా ఈ ఘనతకు సాధించాయి. ఆపిల్‌, మైక్రోసాఫ్ట్‌ కంపెనీలు మార్కెట్‌ క్యాప్‌ ట్రిలియన్ డాలర్లపైనే కొనసాగుతున్నాయి. అయితే అమెజాన్‌, గూగుల్‌ మార్కెట్‌ క్యాప్‌ల ప్రస్తుతం 1ట్రిలియన్‌ డాలర్ల దిగువున ఉన్నాయి. ప్రకటనల ఆదాయం పెరగడటం, యూట్యూబ్‌ ఆదాయ ఆర్జన, క్లౌడ్‌ కంప్యూటరింగ్‌, సెల్ప్‌ డ్రెవింగ్‌ కార్ల మార్కెటింగ్‌ విస్తృతి పెరగడం తదితర కారణాలు ఆల్ఫాబెట్‌ మార్కెట్‌ క్యాప్‌ను 1ట్రిలియన్‌ డాలర్ల వైపు నడిపించాయని మార్కెట్‌ నిపుణులంటున్నారు. గతేడాది డిసెంబర్‌లో కంపెనీ నూతన సీవోఓగా సుందర్‌ పిచాయ్‌ను ప్రకటించారు. పిచాయ్‌ ప్రమోషన్‌తో గూగుల్‌ సహ వ్యవస్ధాపకులు లారీ పేజ్‌, సెర్జీ బ్రిన్‌లు కంపెనీ రోజువారీ వ్యవహారాల నుంచి వైదొలిగారు. 



You may be interested

అటూఇటుగా ముగిసిన మార్కెట్లు

Friday 17th January 2020

స్వల్ప లాభాంతో సెన్సెక్స్‌ నిఫ్టీకి నామమాత్ర నష్టం 3 వారాల గరిష్టానికి ఆర్‌ఐఎల్‌ భారతీ ఎయిర్‌టెల్‌ దూకుడు ఏజీఆర్‌ బకాయిలపై టెలికం రంగం దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌ను సుప్రీం కోర్టు తోసిపుచ్చిన నేపథ్యంలో నీరసంగా ప్రారంభమైన దేశీ స్టాక్‌ మార్కెట్లు చివరికి అటూఇటుగా ముగిశాయి. ఆద్యంతం స్వల్ప హెచ్చుతగ్గుల మధ్య కదిలాయి. సెన్సెక్స్‌ స్వల్పంగా 13 పాయింట్లు బలపడి 41,945 పద్ద నిలవగా.. నిఫ్టీ 3 పాయింట్ల నామమాత్ర నష్టంతో 12,352 వద్ద స్థిరపడింది.

మొబైల్‌ టెలికం జోష్‌- బ్యాంక్స్‌ వీక్‌

Friday 17th January 2020

ఎయిర్‌టెల్‌, ఆర్‌ఐఎల్‌ దూకుడు కుప్పకూలిన వొడాఫోన్‌ ఐడియా  భారతీ ఇన్‌ఫ్రాటెల్‌ పతనం ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌, యస్‌ బ్యాంక్‌ డీలా ఇండస్‌ఇండ్‌, ఎస్‌బీఐ నేలచూపు సవరించిన స్థూల ఆదాయ(ఏజీఆర్‌) బకాయిలపై టెలికం కంపెనీలు దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌ను సుప్రీం కోర్టు తోసిపుచ్చిన నేపథ్యంలో మొబైల్‌ టెలికం, బ్యాంకింగ్‌ రంగ కౌంటర్లలో మిశ్రమ ధోరణి కనిపిస్తోంది. మొబైల్‌ టెలికం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్‌, రిలయన్స్‌ జియో ద్వారా మొబైల్‌ సర్వీసులను అందిస్తున్న రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ కౌంటర్లకు ఓవైపు డిమాండ్‌

Most from this category