News


బంగారం ధర పెరగడానికి కరోనా ఒక్కటే కారణం కాదు...!

Saturday 7th March 2020
news_main1583567123.png-32349

వరల్డ్‌ గోల్డ్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ పీఆర్‌ సోమసుందరం

చైనాలో కరోనా వైరస్‌ వ్యాపించి వందల్లో మరణాలు సంభవిస్తుండడంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఇన్వెస్టర్లంతా రక్షణాత్మక పెట్టుబడులపై పరుగులు పెడుతూ ఎక్కువమంది బంగారం కొనుగోళ్లు చేపట్టడం చూశామని ప్రముఖ విశ్లేషకులు వరల్డ్‌ గోల్డ్‌ కౌన్సిల ఇండియా ఎండీ పీఆర్‌ సోమసుందరం అన్నారు. తన కాలంలో సోమసుందరం ఈ విధంగా వ్యాఖ్యానించారు. కరోనా భయంతో బంగారం ఒక్కసారిగా ఏడేళ్ల గరిష్టానికి చేరింది. ఇంకా పైకి వెళ్లడానికి దానికి పైన స్థలం లేదా అని ప్రశ్నించారు. పరిస్థితులు తీవ్ర అనిశ్చితిలో ఉండడంతో బంగారం ప్రధాన పాత్ర పోషించిందని, అందువల్లే రక్షణాత్మక పెట్టుబడుల వైపు ఇన్వెస్టర్లు మొగ్గుచూపారన్నారు. అంతేగాకుండా కేం‍ద్ర బ్యాంకుల సైతం గోల్డ్‌ను ఏ విధంగా కొంటున్నాయో చూస్తున్నాము. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాతో కలిపి 650 టన్నుల బంగారాన్ని బ్యాంకులు కొనుగోలు చేశాయి. ఒక్క ఇండియా, చైనాలోనే గాక ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆయా సంస్థల ఇన్వెస్టర్లు అంతా గోల్డ్‌ కొనుగోళ్లు చేపట్టారు. దీంతో గత కొన్నేళ్లుగా నిధులు మళ్లీంచబడ్డాయని, గత 15 ఏళ్లలో ఇండియాలో 9 శాతం గోల్డ్‌ రిటర్న్‌లు వచ్చాయన్నారు. ప్రస్తుతం బంగారం ధర  ఆతృతతో ర్యాలీ చేస్తుందన్నారు. బంగారం ధర ర్యాలీ చేయడానికి వడ్డీ రేట్లు , వ్యూహాత్మక కారకాలు, స్వల్పకాల వ్యవధిలో చోటు చేసుకునే ఆతృతలే కారణమన్నారు. 

బంగారం ధరలు ఎప్పటి నుంచి పెరుగుతున్నాయో తెలుసా?
ఈ ప్రశ్నకు అందరూ కరోనా వైరస్‌ ప్రభావంతో పెరిగాయని చెబుతుంటారు. కానీ గతేడాది జూలై నుంచే పెరగడం ప్రారంభమయిందన్నారు.అప్పుడు అమెరికా వడ్డీ రేటు సినారియోతో నడుస్తుంది. ప్రపంచ వృద్ధి, ప్రపంచ బ్యాంకుల కొనుగోళ్లు కూడా పెరగడంతో జూలైలోనే బంగారం ధరలు పెరగడం ప్రారంభమైందన్నారు. ఈ మధ్యకాలంలో వచ్చిన కరోనా ప్రభావం దీనికి తోడవడం, ఇంకా ఇతర కారణాలతో బంగారం ధరలు పెరిగాయని చెప్పుకొచ్చారు. కాగా సోవర్జీన్‌ డెబిట్‌ నెగిటివ్‌ ప్రభావం పడడంతో 16 ట్రిలియన్‌ డాలర్లకు చేరింది. ప్రస్తుతం ఇది 12 ట్రిలియన్‌ డాలర్లకు చేరవచ్చని అంచనా వేస్తున్నారు. ఇవన్నీ బంగారం ధరలు పెరగడానికి కారణమయ్యాయని అన్నారు. ఇది ఒక్క కరోనా ప్రభావంతో చూడకూడదని, ఇది ఈ మధ్య ఎదురైన సమస్యేనని దీర్ఘకాలంగా ఉన్న కారకాలు బంగారం రేటును ప్రభావితం చేస్తున్నాయన్నారు. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు చైనా తీసుకున్న నిర్ణయం కూడా బంగారాన్ని  ప్రభావితం చేసిందన్నారు. అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్లను ఎలా నిర్ణయిస్తుందనకుంటున్నారు అని ప్రశ్నిస్తూ... బంగారం ధర పెరగడానికి ఒక్క వైరస్‌ ప్రభావం కాకుండా, ప్రపంచ వ్యాప్తంగా వృద్ధి పడిపోవడంతో అంతా బంగారవైపు పరుగులు పెట్టారన్నారు. దీంతో మార్కెట్లు ప్రస్తుతానికి పడిపోయినప్పటికీ, మరికొన్ని త్రైమాసికాలలో పుంజుకుంటాయన్నారు. అందుకే పసిడి ధరలు పెరగడానికి కారణాలపై దృష్టిపెట్టాలనీ, తాత్కాలికంగా వచ్చే కారకాలవల్ల పెద్ద నష్ట ఉండదని స్పష్టం చేశారు. 

మరికొన్ని నెలల్లో పసిడి పరిస్థితి ఎలా ఉండనుందంటే..
రాబోయే రోజుల్లో ఇండియాలో మంచి ముహుర్తాల్లో పెళ్లిళ్లు జరుగుతాయి. అప్పుడు ఆభరణాల డిమాండ్‌ 80-85 శాతం వరకు ఉంటుంది. వినియోగదారులు బంగారం కొనక తప్పని పరిస్థితి. దాని వల్ల పెద్దగా రేట్లు ఏమి పెరగవు. కాకాపోతే దశల వారిగా రేటు పెరిగే అవకాశం ఉంటుంది. వినియోగదారుల నుంచి డిమాండ్‌ తగ్గితే రేటు కూడా నిదానంగా పడిపోతుంది. గతేడాది చైనా, ఇండియాలలో డిమాండ్‌ పెరగడంతో ఈటీఎఫ్‌ 400టన్నులకు చేరుకుంది. అయితే అప్పుడు చైనా వృద్ధి15 శాతాగా ఉంటే, ఇండియాలో 9 శాతంగా ఉంది. గోల్డ్‌ రేటు అధికంగా ఉండడంతో ఇండియా 3 శాతం మాత్రమే బంగారం మీద ఇన్వెస్ట్‌ చేసింది. ఇండియాలో ఏదైనా ఇన్వెస్ట్‌ మెంట్‌ మార్కెట్‌ను గనుక అభివృద్ధి చేయగలిగితే  గోల్డ్‌ రేట్లు తగ్గుతాయని సోమసుందరం సూచించారు.
 You may be interested

ఎస్‌బీఐ చేతిలో యస్‌బ్యాంక్‌ సురక్షితం: రాణా కపూర్‌

Saturday 7th March 2020

యస్‌బ్యాంక్‌లో ఎస్‌బీఐ వ్యూహాత్మక వాటా కొనుగోలును యస్‌బ్యాంక్‌ వ్యవస్థాపకుడు రాణా కపూర్‌ స్వాగతించారు. యస్‌ బ్యాంకు ఎస్‌బీఐ చేతుల్లోకి వెళ్లడంతో సరైన ప్రాంతంలో సురక్షితంగా ల్యాండ్‌ అయిందని, వాటా కొనుగోలుకు ప్రక్రియ విధానం, అందుకు తీసుకున్న కాలవ్యవధి సరైన పద్ధతిలోనే ఉన్నట్లు రాణాకపూర్‌ చెపుతున్నారు. ఒక ఆంగ్లఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలను ఆయన పంచుకున్నారు. వివరాలు... యస్‌బ్యాంక్‌ ఇటీవల చేపట్టిన భారీ నిధుల సమీకరణ ఇష్యూ (లేదా) క్యూఐపీ కంటే

ఎస్‌బీఐ చేతిలో యస్‌బ్యాంక్‌ సురక్షితం: రాణా కపూర్‌

Saturday 7th March 2020

యస్‌బ్యాంక్‌లో ఎస్‌బీఐ వ్యూహాత్మక వాటా కొనుగోలును యస్‌బ్యాంక్‌ వ్యవస్థాపకుడు రాణా కపూర్‌ స్వాగతించారు. యస్‌ బ్యాంకు ఎస్‌బీఐ చేతుల్లోకి వెళ్లడంతో సరైన ప్రాంతంలో సురక్షితంగా ల్యాండ్‌ అయిందని, వాటా కొనుగోలుకు ప్రక్రియ విధానం, అందుకు తీసుకున్న కాలవ్యవధి సరైన పద్ధతిలోనే ఉన్నట్లు రాణాకపూర్‌ చెపుతున్నారు. ఒక ఆంగ్లఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలను ఆయన పంచుకున్నారు. వివరాలు.... యస్‌బ్యాంక్‌ ఇటీవల చేపట్టిన భారీ నిధుల సమీకరణ ఇష్యూ (లేదా) క్యూఐపీ కంటే

Most from this category