News


మరో కేజీఎఫ్‌! రూ.12 లక్షల కోట్ల బంగారం గనులు!

Saturday 22nd February 2020
news_main1582349688.png-32003

బంగారం ధరలు ఆకాశనంటుతున్న తరుణంలో జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా(జీఎస్‌ఐ)బంగారు నిక్షేపాల్ని గుర్తించినట్లు తీపి కబురు చెప్పింది. ఉత్తర ప్రదేశ్‌లోని నక్సలైట్‌ ప్రభావిత ప్రాంతమైన సోన్‌భద్ర జిల్లాలో 3,000 టన్నులకు పైగా బంగారు నిక్షేపాలు ఉన్నట్టు జీఎస్‌ఐ, ఉత్తరప్రదేశ్‌ భూగర్భ, గనుల శాఖ అధికారులు నిర్ధారించారు. వీటి విలువ సుమారు రూ12 లక్షల కోట్లు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. జిల్లాలోని సోన్‌ పహాడీ, హార్దీ ప్రాంతాలలో ఈ బంగారు గనులు విస్తరించి ఉన్నయని మైనింగ్‌ అధికారులు వెల్లడించారు. సోన్‌పహాడీలో 2,943.26 టన్నులు, హార్దీ బ్లాక్‌లో 646.16 టన్నుల బంగారు నిల్వలు ఉన్నట్లు జీఎస్‌ఐ అధికారులు అంచనా వేస్తున్నారు. వరల్డ్‌ గోల్డ్‌ కౌన్సిల్‌ అంచనా ప్రకారం భారత దేశంలో 626 టన్నుల బంగారం నిక్షేపాల నిల్వలున్నాయి. ఈ నిల్వలకంటే తాజాగా ఉత్తరప్రదేశ్‌లో గుర్తించిన బంగారు నిక్షేపాలు  5 రెట్లు ఎక్కువ అని జిల్లా మైనింగ్‌ అధికారి కేకే రాయ్‌ వెల్లడించారు. ఈ నిక్షేపాల కోసం దాదాపు రెండు దశాబ్దాలుగా (1992-93)అన్వేషిస్తున్నామని జీఎస్‌ఐ తెలిపింది. కాగా ఈ నిక్షేపాలను తవ్వితీసే మైనింగ్‌ పనులను లీజుకు ఇవ్వాలనీ యూపీ ప్రభుత్వం భావిస్తోంది.  ఇప్పటికే ఈ-టెండరింగ్‌  ద్వారా వేలం నిర్వహణకు ఏడుగురు సభ్యుల బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ గనుల్లో  బంగారంతో పాటు యురేనియం నిల్వలు కూడా ఉండే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. కాగా ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో సోన్‌భద్ర రెండో అతి పెద్ద జిల్లాగా ఉంది. అంతేగాకుండా దేశంలోనే నాలుగు రాష్ట్రాలతో సరిహద్దులు(మధ్యప్రదేశ్‌, చత్తీస్‌ఘడ్‌, జార్ఖండ్‌, బీహార్‌) కలిగిన ఏకైక జిల్లా కావడం విశేషం. 



You may be interested

టెక్నికల్స్‌తో ఇబ్బందా?.. ఇలా చేయండి...

Saturday 22nd February 2020

అనలిస్టు సీకే నారాయణ్‌ సూచనలు టెక్నికల్‌ విశ్లేషణ నేర్చుకునేవాళ్లు వివిధ రకాల సాధనాలను విశ్లేషించడం ద్వారా పెట్టుబడి నిర్ణయాలు తీసుకుంటారు. ఎన్ని పుస్తకాలు చదివి ఎన్ని టెక్నికల్స్‌ పరిశీలించినా చివరకు అవన్నీ స్వల్ప వ్యాలిడిటీ ఉన్నవేనని అర్ధమవుతుంది. అయితే వీటిలో కొన్ని దీర్ఘకాలిక వాలిడిటీ ఉంటుందని మనం భావిస్తుంటాం. మనం నేర్చుకునేటప్పుడే కొన్ని టెక్నికల్స్‌పై గురి ఎక్కువగా పెంచకుంటాం. ఇక అనాలసిస్‌లో భాగంగా ఎవరమైనా ముందుగా చార్టుల విశ్లేషణ చేస్తారు. ఇందులో

జీవితకాల గరిష్టస్థాయికి ఫారెక్స్ నిల్వలు

Saturday 22nd February 2020

476.092 బిలియన్ డాలర్లుగా నమోదు ముంబై: విదేశీ మారక నిల్వలు (ఫారెక్స్ రిజర్వ్స్) ఆల్‌టైం హైకి చేరాయి. ఆర్‌బీఐ తాజాగా వెల్లడించిన సమాచారం ప్రకారం.. ఈఏడాది ఫిబ్రవరి 14తో ముగిసిన వారంలో 3.091 బిలియన్‌ డాలర్ల పెరుగుదలతో 476.092 బిలియన్ డాలర్లకు ఎగశాయి. అంతక్రితం వారం 1.701 బిలియన్‌ డాలర్లు పెరిగి 473 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి. ఇక తాజా వారంలో.. మొత్తం మారక నిల్వల్లో ప్రధాన భాగంగా డాలర్ల రూపంలో

Most from this category