News


7 శాతం తగ్గిన పుత్తడి దిగుమతులు

Monday 27th January 2020
Markets_main1580093694.png-31215

న్యూఢిల్లీ: పుత్తడి దిగుమతులు ఈ ఆర్థిక సంవత్సరం తొలి తొమ్మిది నెలల కాలంలో 7 శాతం తగ్గాయి. గత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌-డిసెంబర్‌ కాలానికి 2,473 కోట్ల డాలర్లుగా ఉన్న బంగారం దిగుమతులు ఈ ఆర్థిక సంవత్సరం ఇదే కాలానికి 2,300 కోట్ల డాలర్లకు తగ్గాయని ప్రభుత్వం వెల్లడించింది. దీంతో ​వాణిజ్య లోటు 14,823 కోట్ల డాలర్ల నుంచి 11,800 కోట్ల డాలర్లకు తగ్గిందని పేర్కొంది. కాగా 2018 , జూలై-సెప్టెంబర్‌ కాలానికి 2.9 శాతంగా ఉన్న  కరంట్‌ అకౌంట్‌ లోటు(క్యాడ్‌) గత ఏడాది ఇదే కాలానికి  0.9 శాతానికి తగ్గింది. విలువ పరంగా చూస్తే ఈ లోటు 1,900 కోట్ల డాలర్ల నుంచి 630 కోట్లకు డాలర్లకు చేరింది. ఈ ఏడాది జూలై నుంచి పుత్తడి దిగమతులు ప్రతికూల వృద్ధినే నమోదు చేస్తున్నాయి. 

వార్షిక దిగుమతులు 800-900 టన్నులు 
ప్రపంచంలోనే పుత్తడిని అత్యధికంగా దిగమతి చేసుకునేది మన దేశమే. ఆభరణాల పరిశ్రమ నుంచి డిమాండ్‌ అధికంగా ఉండటమే దీనికి కారణం. వార్షికంగా భారత బంగారం దిగుమతులు 800-900 టన్నుల మేర ఉంటాయని అంచనా. పుత్తడి దిగుమతులు పెరిగితే వాణిజ్య లోటు, కరంట్‌ అకౌంట్‌ లోటు కూడా పెరుగుతుంది. అందుకని పుత్తడి దిగమతులను తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం దిగుమతి సుంకాన్ని 10 శాతం నుంచి 12.5 శాతానికి పెంచింది. ఈ సుంకం పెంపు కారణంగా పలు కంపెనీలు తమ తయారీ కేంద్రాలను పొరుగు దేశాలకు తరలిస్తున్నాయని పుత్తడి పరిశ్రమ పేర్కొంది. దిగుమతి సుంకాన్ని 4 శాతానికి తగ్గించాలని కోరుతోంది. 



You may be interested

5జీ స్మార్ట్‌ఫోన్‌ వస్తోంది

Monday 27th January 2020

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో:- స్మార్ట్‌ఫోన్స్‌ తయారీలో ఉన్న చైనా కంపెనీ ఐకూ భారత్‌కు ఫిబ్రవరిలో ఎంట్రీ ఇస్తోంది. 5జీ స్మార్ట్‌ఫోన్‌తో మార్కెట్లోకి రంగ ప్రవేశం చేయనుంది. భారత్‌లో ఇదే తొలి 5జీ మోడల్‌ కానుంది. 5జీతోపాటు 4జీ మోడళ్లనూ ప్రవేశపెట్టనున్నట్టు ఐకూ మార్కెటింగ్‌ డైరెక్టర్‌ గగన్‌ అరోరా తెలిపారు. 2020లో దేశీయంగా 10 లక్షల యూనిట్లను విక్రయించాలన్న లక్ష్యంతో కంపెనీ దూసుకొస్తోంది. తొలుత ఆన్‌లైన్‌ను వేదికగా చేసుకోనున్న ఈ బ్రాండ్‌,

ఈక్విటీ ఫండ్స్‌ ఏ రేంజ్‌ రాబడులనిస్తాయి ?

Monday 27th January 2020

(ధీరేంద్ర కుమార్‌ సీఈవో, వాల్యూ రీసెర్చ్‌) ప్ర: ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేస్తే రాబడులు ఏ రేంజ్‌లో వస్తాయి ? హిమబిందు, విజయవాడ జ: దీర్ఘకాలం పాటు ఈక్విటీ మ్యూచువల్‌ ఫం‍డ్స్‌లో ఇన్వెస్ట్‌ చేస్తే మంచి రాబడులే పొందవచ్చు. అయితే ఏ శాతం రేంజ్‌లో రాబడులు వస్తాయో అంచనా వేయడం కష్టం. మన ఇన్వెస్ట్‌మెంట్స్‌ మీద ద్రవ్యోల్బణాన్ని తట్టుకునే రాబడులను పొందాలంటే ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయడమే మంచి మార్గం.

Most from this category