News


పుత్తడి ఈటీఎఫ్‌ల్లో పెట్టుబడులు

Wednesday 11th September 2019
news_main1568174582.png-28299

-8 నెలల తర్వాత గోల్డ్‌ ఈటీఎఫ్‌ల్లో పెట్టుబడులు 
-పుత్తడి ధరలు పెరగడమే కారణం 
-యాంఫీ వెల్లడి 

న్యూఢిల్లీ: గోల్డ్‌ ఈటీఎఫ్‌(ఎక్స్చేంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్స్‌)ల జోరు పెరుగుతోంది. ఈ ఏడాది ఆగస్టులో గోల్డ్‌ ఈటీఎఫ్‌ల్లో రూ.145 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. గత ఎనిమిది నెలలుగా ఈ ఫండ్స్‌ నుంచి ఇన్వెస్టర్లు సొమ్ములు వెనక్కి తీసుకోవడమే గానీ, పెట్టుబడులు పెట్టింది లేదు. కానీ ఆగస్టులో మాత్రం పెట్టుబడులు వచ్చాయి. డాలర్‌తో రూపాయి మారకం బలహీనపడటం, పుత్తడి ధరలు ఎగియడం దీనికి కారణాలు. ఆగస్టు నెల చివరలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.40,000 దాటిపోయిన విషయం తెలిసిందే. అసోసియేషన్‌ ఆఫ్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌ ఇన్‌ ఇండియా(యాంఫీ) వెల్లడించిన విశేషాల్లో కొన్ని ముఖ్యాంశాలు.....

-గోల్డ్‌ ఈటీఎఫ్‌ల్లో ఇప్పటివరకూ అత్యధికంగా 2012, డిసెంబర్‌లో రూ.474 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. అప్పటి నుంచి చూస్తే, మళ్లీ ఈ ఆగస్టులో అత్యధికంగా ఇన్వెస్ట్‌మెంట్స్‌ వచ్చాయి. 
-ఈ ఏడాది జూలైలో గోల్డ్‌  ఈటీఎఫ్‌ల నుంచి రూ.18 కోట్ల పెట్టుబడుల ఉపసంహరణ జరిగింది. గత ఏడాది ఆగస్టులో రూ.45 కోట్ల పెట్టుబడులను ఇన్వెస్టర్లు గోల్డ్‌ ఈటీఎఫ్‌ల నుంచి వెనక్కి తీసుకున్నారు. 
-ఈ ఆగస్టులో రూ.145 కోట్ల ఇన్వెస్ట్‌మెంట్స్‌ రావడంతో గోల్డ్‌ ఫండ్స్‌ నిర్వహణ ఆస్తులు రూ.5,799 కోట్లకు పెరిగాయి. 
-గత ఏడాది గోల్డ్‌ ఈటీఎఫ్‌ల నుంచి రూ.571 కోట్ల పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. గోల్డ్‌ ఈటీఎఫ్‌ల నుంచి పెట్టుబడుల ఉపసంహరణ జరగడం ఇది వరుసగా ఆరో ఏడాది. 2017లో ఈ పెట్టుబడుల ఉపసంహరణ రూ.730 కోట్లుగా ఉంది. 
-పుత్తడిలో కంటే ఈక్విటీలోనే అధిక రాబడులు వస్తుండటంతో గత కొన్నేళ్లుగా  ఇన్వెస్టర్లు ఈక్విటీల్లోనే ఇన్వెస్ట్‌ చేస్తున్నారు. 


ఈ ట్రెండ్‌ కొనసాగుతుందా ?
ఆగస్టులో గోల్డ్‌ ఈటీఎఫ్‌ల్లో పెట్టుబడులు పెరగడాన్ని బట్టి ఈ ట్రెండ్‌ కొనసాగుతుందా ?లేదా ? అని ఇప్పుడే చెప్పలేం. గోల్డ్‌ ఈటీఎఫ్‌ల్లో పెట్టుబడులు నిలకడగా కొనసాగితేనే.. పుత్తడి పట్ల ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ మారిందని నిర్ధారణగా చెప్పవచ్చు. 
 -కౌస్తుభ్‌ బేలాపుర్కర్‌, ఎమ్‌డీ(రీసెర్చ్‌), మార్నింగ్‌ ‍స్టార్‌ ఇండియా



You may be interested

వృద్ధి రేటు అంచనా 6.6 శాతానికి తగ్గింపు

Wednesday 11th September 2019

వృద్ధి రేటు అంచనా 6.6 శాతానికి తగ్గింపు న్యూఢిల్లీ: భారత జీడీపీ వృద్ధి రేటు అంచనాలను ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2019-20) గతంలో వేసిన 6.8 శాతం నుంచి 6.6 శాతానికి రేటింగ్‌ ఏజెన్సీ ఫిచ్‌ తాజాగా తగ్గించింది. అధిక రుణ భారం కారణంగా ద్రవ్య విధానాన్ని సడలించే అవకాశాలు ప్రభుత్వానికి పరిమితంగానే ఉన్నాయని ఈ సంస్థ అభిప్రాయపడింది. రానున్న సంవత్సరంలో భారత జీడీపీ 7.1 శాతానికి పుంజుకునే అవకాశం ఉందని

భవిష్యత్తు ‘షా’లకు బాటలు వేస్తా

Wednesday 11th September 2019

స్టార్టప్‌ ఎకోసిస్టమ్‌ ఏర్పాటు పదేళ్లలో పది కోట్ల మందికి ఉపాధి వినూత్న ఆలోచనలున్న యువతకు మార్గదర్శకం ఎంసీఎక్స్‌ వ్యవస్థాపకుడు జిగ్నేషా వెల్లడి న్యూఢిల్లీ: ఎంసీఎక్స్‌ వ్యవస్థాపకుడు జిగ్నేష్‌ షా (52) త్వరలో రెండో విడత ప్రయాణం మొదలుపెట్టనున్నారు. వచ్చే దశాబ్ద కాలంలో దేశంలో 10 కోట్ల మందికి ఉపాధి కల్పించేందుకు మార్గదర్శిగా వ్యవహరించాలన్న ప్రణాళికలతో ఉన్నారు. స్టార్టప్‌ ఎకోసిస్టమ్‌లో వంద రెట్లు అధిక వ్యాపార అవకాశాలు ఉన్నాయని ఆయన భావిస్తున్నారు. అందుకే ఓ స్టార్టప్‌ ప్లాట్‌ఫామ్‌ను

Most from this category