పండుగ సీజన్లో గోల్డ్ బాండ్ ధమాకా
By Sakshi

న్యూఢిల్లీ: పండుగ సీజన్లో భౌతిక పసిడి కొనుగోళ్లను తగ్గించి, ఆ మొత్తాలను పూర్తిస్థాయి ఇన్వెస్ట్మెంట్గా మార్చడానికి కేంద్రం కీలక నిర్ణయం ప్రకటించింది. ఇందుకు అనుగుణంగా అక్టోబర్ 7వ తేదీన సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ 2019-20- సిరీస్ 5కు శ్రీకారం చుట్టింది. ఈ సిరీస్‌లో పసిడి గ్రామ్ ఇష్యూ ధర రూ.3,788గా నిర్ణయించింది. అక్టోబర్ 7 నుంచి 11వ తేదీ వరకూ ఈ స్కీమ్ అందుబాటులో ఉంటుంది. ఆన్లైన్ అప్లై చేసిన, డిజిటల్ రూపంలో చెల్లింపులు జరిపిన ఇన్వెస్టర్లకు రూ.50 డిస్కౌంట్ ఉంటుంది. అంటే వీరికి 3,738కే గ్రాము బాండ్ అందుబాటులో ఉంటుందన్న మాట. భౌతికపరమైన పసిడి డిమాండ్ తగ్గింపు, తద్వారా దేశీయ పొదుపుల పెంపు లక్ష్యంగా 2015 నవంబర్‌లో సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్‌ను కేంద్రం తీసుకువచ్చింది. వ్యక్తిగతంగా ఒకరు ఒక ఆర్థిక సంవత్సరంలో 500 గ్రాముల వరకూ విలువైన పసిడి బాండ్లను కొనుగోలు చేసే వీలుంది. హిందూ అవిభక్త కుటుంబం 4 కేజీల వరకూ కొనుగోలు చేయవచ్చు. ట్రస్టీల విషయంలో ఈ పరిమాణం 20 కేజీలుగా ఉంది.
You may be interested
నిఫ్టీ చార్టుల్లో బేరిష్క్యాండిల్!
Saturday 5th October 201911100 పాయింట్ల వద్ద కీలక మద్దతు శుక్రవారం సూచీల్లో అమ్మకాల ఒత్తిడి కొనసాగింది. దీంతో ఉదయం లాభాలను కోల్పోయిన సూచీలు చివరకు భారీ నష్టాల్లో ముగిశాయి. నిఫ్టీ కీలకమైన 11200 పాయింట్ల దిగువకు చేరింది. ఆర్బీఐ తాజా ప్రకటనలో వృద్ధి అంచనాలను తగ్గించడమే మార్కెట్లో భయానికి కారణమని నిపుణులు భావిస్తున్నారు. తాజా క్షీణతతో నిఫ్టీ తన 200 రోజుల డీఎంఏ దిగువకు చేరి చార్టుల్లో పెద్ద బేరిష్క్యాండిల్ ఏర్పరిచింది. వీక్లీ చార్టుల్లో
హైదరాబాద్‌లో మైక్రాన్ డెవలప్మెంట్ సెంటర్
Saturday 5th October 2019- భారత్‌లో 2,000 దాకా సిబ్బంది పెంపు యోచన హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అమెరికాకు చెందిన సెమీకండక్టర్ల తయారీ సంస్థ మైక్రాన్ టెక్నాలజీ తాజాగా హైదరాబాద్‌లో గ్లోబల్ డెవలప్మెంట్ సెంటర్ (జీడీసీ)ని ఆవిష్కరించింది. తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ శుక్రవారమిక్కడ దీన్ని ప్రారంభించారు. మైక్రాన్ వంటి దిగ్గజ సంస్థ హైదరాబాద్‌లో తమ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయడం రాష్ట్రానికి గర్వకారణమని ఈ సందర్భంగా