STOCKS

News


గోద్రేజ్‌ ప్రొపర్టీస్‌ లాభం 9 శాతం అప్‌

Tuesday 4th February 2020
news_main1580787024.png-31485

  • రూ.517 కోట్లకు పెరిగిన ఆదాయం 

న్యూఢిల్లీ: రియల్టీ సంస్థ, గోద్రేజ్‌ ప్రొపర్టీస్‌ కంపెనీ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం (2019-20) మూడో త్రైమాసిక కాలంలో 9 శాతం పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం (2018-19) క్యూ3లో రూ.42 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ3లో రూ.45 కోట్లకు పెరిగిందని గోద్రేజ్‌ ప్రొపర్టీస్‌ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌ పిరోజ్‌షా గోద్రేజ్‌ తెలిపారు. మొత్తం ఆదాయం రూ.431 కోట్ల నుంచి రూ.517 కోట్లకు తగ్గిందని పేర్కొన్నారు. సేల్స్‌ బుకింగ్‌లు రూ.1,528 కోట్ల నుంచి 22 శాతం క్షీణించి రూ.1,189 కోట్లకు తగ్గాయని వివరించారు. ఈ క్యూ3లో నాలుగు కొత్త ప్రాజెక్ట్‌లు ప్రారంభించామని, వీటిల్లో మూడు జాయింట్‌ వెంచర్‌ ప్రాజెక్ట్‌లని పేర్కొన్నారు. 

ప్రస్తుతం రియల్‌ ఎస్టేట్‌ స్థితిగతులు సమస్యాత్మకంగా ఉన్నాయని పిరోజ్‌షా గోద్రేజ్‌ వ్యాఖ్యానించారు. ప్రస్తుతమున్న కన్సాలిడేషన్‌ కారణంగా రెసిడెన్షియల్‌ రియల్‌ ఎస్టేట్‌లో తమ కంపెనీ మార్కెట్‌ వాటాను పెంచుకోవడానికి అవకాశాలు అధికంగా ఉన్నాయని పేర్కొన్నారు. 



You may be interested

300 పాయింట్ల గ్యాప్‌తో సెన్సెక్స్‌ ప్రారంభం

Tuesday 4th February 2020

కలిసొచ్చిన క్రూడాయిల్‌ పతనం 78 పాయింట్ల లాభంతో మొదలైన నిఫ్టీ  దేశీయ మార్కెట్‌ మంళవారం లాభంతో మొదలైంది. బెంచ్‌మార్క్‌ సూచీలైన సెన్సెక్స్‌ 306 పాయింట్ల లాభంతో 40,167.86 వద్ద, నిఫ్టీ 78 పాయింట్లు పెరిగి 11,786.25 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. కరోనా వైరస్‌ వ్యాధి వ్యాప్తి భయాలతో అంతర్జాతీయ వృద్ధి మందగమన ఆందోళనలతో ప్రపంచమార్కెట్లో బ్యారెల్‌ క్రూడాయిల్‌ ధర ఏకంగా 2శాతం నష్టపోయి 50డాలర్లకి దిగువకు వచ్చింది. ఈ ధరలు 13నెలల కనిష్టస్థాయి

లిథియం బ్యాటరీల సరఫరాలో బీపీసీఎల్‌

Tuesday 4th February 2020

కైనెటిక్‌, ఐఐటీ మద్రాస్‌లతో జట్టు చెన్నై: ప్రభుత్వ రంగ చమురు తయారీ దిగ్గజం బీపీసీఎల్ తాజాగా ఎలక్ట్రిక్ ఆటో రిక్షాల కోసం లిథియం అయాన్ బ్యాటరీల సరఫరా కార్యకలాపాలు ప్రారంభించింది. ఇందుకోసం ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ కైనెటిక్ గ్రీన్ ఎనర్జీ అండ్ పవర్ సొల్యూషన్స్‌, ఐఐటీ మద్రాస్‌ (సాంకేతిక సహకారం)తో జట్టు కట్టింది. తొలి దశలో కొచి, లక్నోలోని తమ రిటైల్ అవుట్‌లెట్స్‌లో లిథియం అయాన్ బ్యాటరీలను అందుబాటులోకి తెచ్చింది.

Most from this category