News


విస్తరణలో గోద్రెజ్‌ ఇంటీరియో

Saturday 13th July 2019
news_main1562991497.png-27031

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: ఫర్నీచర్‌ రంగ సంస్థ గోద్రెజ్‌ ఇంటీరియో పెద్ద ఎత్తున విస్తరిస్తోంది. దేశవ్యాప్తంగా పలు నగరాల్లో 2020 మార్చికల్లా కొత్తగా 30 ఎక్స్‌క్లూజివ్‌ ఔట్‌లెట్లు నెలకొల్పుతోంది. అలాగే డీలర్‌ నెట్‌వర్క్‌ ద్వారా 70 షోరూంలు ప్రారంభిస్తున్నట్టు గోద్రెజ్‌ ఇంటీరియో మార్కెటింగ్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ సుబోధ్‌ కుమార్‌ మెహతా శుక్రవారమిక్కడ మీడియాకు తెలిపారు. ఇందులో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో 16 కేంద్రాలు రానున్నట్లు ఆయన వెల్లడించారు. ఇప్పటికే కంపెనీకి భారత్‌లో 250 ఎక్స్‌క్లూజివ్‌ స్టోర్లు, డీలర్ల నిర్వహణలో 800కు పైగా కేంద్రాలున్నాయి. ‘కంపెనీ అమ్మకాల్లో టాప్‌-5 రాష్ట్రాల్లో ఏపీ, తెలంగాణ ఉ‍న్నాయి. ఆదాయంలో ఈ రాష్ట్రాల వాటా 14 శాతం. భారత ఫర్నీచర్‌ విపణి రూ.75,000 కోట్లుంది. వ్యవస్థీకృత రంగం 20 శాతం కైవసం చేసుకుంది. ఇందులో గోద్రెజ్‌కు 15 శాతం వాటా ఉంది. మా కస్టమర్లలో 40 శాతం మంది కస్టమైజేషన్‌ కోరుకుంటున్నారు’ అని వివరించారు.



You may be interested

ఇక విదేశాలకూ విస్తారా విమాన సర్వీసులు

Saturday 13th July 2019

ఆగస్ట్‌ 6 నుంచి అంతర్జాతీయ సేవలు ఢిల్లీ నుంచి సింగపూర్‌కు నిత్యం సర్వీసులు 7న ముంబై నుంచి సింగపూర్‌కు న్యూఢిల్లీ: టాటా, సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌ సంయుక్త భాగస్వామ్య సంస్థ విస్తారా... ఇక నుంచి అంతర్జాతీయ సర్వీసులను కూడా నడపనుంది. వచ్చే నెల (ఆగస్ట్‌) 6 నుంచి ప్రప్రథమంగా సింగపూర్‌కు ఢిల్లీ నుంచి రోజువారీ విమాన సర్వీసులను ఆరంభిస్తోంది. ఆ మరుసటి రోజే ఆగస్ట్‌ 7న ముంబై నుంచి కూడా సింగపూర్‌కు డైలీ సర్వీసులను ప్రారంభించనుంది.

మార్కెట్లోకి ‘ఇథనాల్‌’తో నడిచే టీవీఎస్‌ అపాచీ

Saturday 13th July 2019

ప్రారంభ ధర రూ.1.2 లక్షలు న్యూఢిల్లీ: ప్రముఖ వాహన తయారీ కంపెనీ ‘టీవీఎస్‌ మోటార్‌’.. తాజాగా తన పాపులర్‌ మోడల్‌ అపాచీలో ‘ఇథనాల్‌’ వెర్షన్‌ను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ‘అపాచీ ఆర్‌టీఆర్ 200 ఫై ఈ100’ పేరిట శుక్రవారం విడుదలైన ఈ అధునాతన బైక్‌... ఇథనాల్‌ ఇంధనం ఆధారంగా నడుస్తుంది. ప్రారంభ ధర రూ.1.2 లక్షలు. దేశవ్యాప్తంగా ఇథనాల్‌ అందుబాటులో లేనందున ప్రస్తుతానికి చెరుకు పంటకు ప్రధాన రాష్ట్రాలైన మహారాష్ట్ర, ఉత్తర

Most from this category